ఆపరేషన్ పోలో
(నిజాం పైన యుద్ధం చేసి హైదరాబాద్ ని భారత్ లో కలిపిన భారత సైన్యం)
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
1947లో స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని రెండు దేశాలుగా విడదీయడమే కాకుండా మిగిలిన దేశాన్నంతా 565 చిన్న చిన్న రాజ్యాలుగా వదిలేసి ప్రతి రాజ్యం అయితే పాకిస్థాన్ లో లేదా భారత్ లో కలవచ్చు లేదా స్వాతంత్ర్య రాజ్యాలుగా కొనసాగవచ్చునని వదిలేసి వెళ్లిపోయారు.కానీ వల్లభాయ్ పటేల్ గారు ఈ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ ఒప్పించి,522 రాజ్యాలను భారత దేశంలో కలిసేటట్లుగా చేసారు.కానీ జమ్మూకాశ్మీర్, హైదరాబాద్ మరియు జునాఘడ్ రాజ్యాలు మాత్రం స్వాతంత్ర్యం గానే ఉంటామని పట్టుబట్టారు.
పైగా అప్పటికే హైదరాబాద్ సంస్థాన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలవడమే కాక నిజాం రాచరిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది.హైదరాబాద్ సంస్థానం లో రకరకాల పన్నులతో ప్రజలను దోచుకునేవారు.వారి పంటలను కూడా దోచుకునేవారు.వారి పైన దాడులు చేసేవారు.స్త్రీలను నగ్నంగా బతుకమ్మ ఆడించడమే కాకుండా వారి పైన అత్యాచారాలు చేసేవారు.
హైదరాబాద్ సంస్థానం సంపన్న రాజ్యం గా మారింది.సొంత కరెన్సీ, ఎయిర్ లైన్స్, రైల్వే లైన్, స్వంత సైన్యం,టెలి కమ్యూనికేషన్ సిస్టమ్,పోస్టల్ సిస్టమ్ మరియు రేడియో ప్రసార సేవలను కలిగి ఉంది.మొత్తం జనాభాలో దాదాపు 85 శాతం మంది హిందువులు ఉండేవారు, ముస్లిం లు 12 శాతం మంది ఉండేవారు,3 శాతం మిగిలిన మతాల వారు ఉండేవారు.కానీ హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ, సైన్యం లో కానీ, ఎక్కువ జీతం తీసుకునే ఉద్యోగాలలో కానీ ఇరవై శాతం మంది కూడా హిందువులు ఉండేవారు కాదు.పైగా మొత్తం రాజ్యం లో 40 శాతం భూమి నిజాం,అతని వర్గం వారు కలిగి ఉండేవారు.
1926 లో మాజీ ఉద్యోగి మహమ్మద్ నవాజ్ ఖాన్ మజ్లిస్ - ఇత్తెహాద్ - ఉల్ - ముస్లిమీన్ (ఎం.ఐ.ఎం.)ని స్థాపించారు.ఈ సంస్థ ద్వారా రాజ్యంలోని ముస్లిం లను ఏకం చేస్తూ నిజాం కి అనుకూలంగా మార్చడం,హిందువులను ఏ విధంగా అయినా సరే ముస్లిం మతంలోకి మార్చి వారి సంఖ్య తగ్గించడం,అందరితో స్నేహంగా ఉండాలనుకునే ముస్లిం లను బహిష్కరించడం లాంటివి చేసేవారు.
చివరికి నిజాం ఆగడాలు భరించలేక హైదరాబాద్ సంస్థాన ప్రజలు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు చేశారు.ఈ పోరాటాలు రాజ్యం మొత్తం కొనసాగాయి.చివరికి నిజాం హిందూ యువత తిరుగుబాటు కి భయపడి ఎం.ఐ.ఎం. నాయకుడు,తన సన్నిహిత సలహాదారుడు అయిన ఖాసీం రజ్వీ నేతృత్వంలో 2,00,000 మంది సైన్యం తో రజాకార్లు అని పిలవబడే రాక్షస సైన్యాన్ని ఏర్పాటు చేసాడు.ఈ రజాకార్లు భారత దేశం లో కలవాలని అభిప్రాయబడ్డ, నిజాం కి వ్యతిరేకంగా పని చేసే హిందూ ప్రజలను అత్యంత పాశవికమైన పద్ధతుల్లో చంపేవారు, స్త్రీలను బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసేవారు.రజాకార్లు క్రిస్టియన్ మిషనరీలు, వాటిలోని సన్యాసుల పైన కూడా దౌర్జన్యాలు చేసేవారు.సెప్టెంబర్ ప్రారంభం లో ఒక మిషనరీ లోని సన్యాసినులను వేధించారని హోం శాఖకు ఫిర్యాదులు అందాయి.4 డిసెంబర్ 1947న, ఆర్యసమాజ్ అనే హిందూ జాతీయవాద సంస్థ సభ్యుడు నారాయణరావు పవార్ నిజాంను అతని రాజభవనం వెలుపల హత్య చేసేందుకు విఫలయత్నం చేశాడు.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి 565 సంస్థానాల్లో 562 సంస్థానాలు భారతదేశములో కలిసాయి.మరొక 3 సంస్థానాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి.అందులో ఒకటి హైదరాబాద్ సంస్థానం.మిగిలిన రాజ్యాలు ఎలా ఉన్నా ముందు భారత దేశపు నడిబొడ్డున దక్షిణాదిలోనే పెద్ద వేరుగా ఉంటే దేశం గుండెల పైన కుంపటిలా ఉంటుందనీ లేదా పాకిస్థాన్ లో చేరితే దేశం లోపల శత్రు దేశం ఏర్పడుతుందని పటేల్ గారు భావించారు.పటేల్ గారు అప్పటి భారత జనరల్ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ ని కలిసి తన ఆలోచన చెప్పారు.అయితే అతను సమస్యను శాంతియుతంగా పరిష్కరించమని సలహా ఇచ్చారు.హైదరాబాద్ సంస్థానాన్ని బ్రిటిష్ కామన్వెల్త్ దేశాల కింద స్వతంత్రంగా కొనసాగాలని ఆశించి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్ధించాడు.అయితే ఆ అభ్యర్ధన తిరస్కరించారు.
సర్దార్ పటేల్ గారు హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో కలవమన్నప్పుడు నిజాం ఒప్పుకోలేదు.మౌంట్ బాటన్ శాంతి యుతంగా చర్చించామన్నారు.హైదరాబాద్ కి భారత రాయబారి మరియు ఏజెంట్ జనరల్ K.M.మున్షీ మరియు హైదరాబాద్ రాయబారి లైక్ అలీ,సర్ వాల్టర్ మాంక్టన్ ల ద్వారా చర్చలు నిర్వహించబడ్డాయి. లార్డ్ మౌంట్ బాటన్ అధ్యక్షత వహించిన ఈ చర్చల్లో హైదరాబాద్ కి అనేక ఒప్పందాలను ఇచ్చారు.కానీ నిజాం వాటన్నింటినీ తిరస్కరించారు. దాంతో భారత్ లో కలవడం పక్కన ఉంచి పాకిస్థాన్ లో కలవదనీ, భారత్ హైదరాబాద్ పైన సైనిక చర్య చేయమనీ ఒప్పందం తో స్టాండ్ స్టిల్ ఒప్పందం పైన సంతకం చేసారు.
కానీ నిజాం పాకిస్థాన్ నుండి ఆయుధాలు దిగుమతి చేసుకోవడమే కాక పాకిస్థాన్ లో బాంబ్ స్క్వాడ్రన్ ఏర్పాటు చేశారు మరియు 200 మిలియన్ రూపాయల సాయం అందించింది.ఒకవైపు హైదరాబాద్ సంస్థానం లోని హిందువుల పైన దాడులు పెరుగుతున్నాయి, మరొక వైపున పాకిస్థాన్ తో కలిసి పోతుందని అనుమానం పెరుగుతుంది.ఒకవేళ అదే నిజమైతే అప్పటికే బెంగాల్ మరియు కాశ్మీర్ లో జరిగిన వాటి కంటే పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది.
లార్డమౌంట్ బాటన్ 'హెడ్స్ ఆఫ్ అగ్రిమెంట్ 'డీల్ ని సిద్ధం చేశారు.ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ భారత ప్రభుత్వం కింద స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యం గా కొనసాగుతోంది.హైదరాబాద్ రాష్ట్ర బలగాలను తగ్గిస్తారు మరియు స్వచ్ఛంద బలగాలను రద్దు చేయాలి, హైదరాబాద్ ప్రభుత్వం రాజ్యాన్ని పరిపాలించుకోవచ్చు.కానీ విదేశీ వ్యవహారాలు మాత్రం భారత ప్రభుత్వం చూసుకుంటుంది, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి మరియు ప్రజాస్వామ్య ఎన్నికల తో రాజ్యాంగ సభని ఏర్పాటు చేయాలి.భారత దేశం దీనికి ఒప్పుకుంది.కానీ నిజాం ఈ ఒప్పందాలను తిరస్కరించారు.
చివరికి పటేల్ బలవుతంగానైనా హైదరాబాద్ ని భారత్ లో కలపాలని భావించారు.హైదరాబాద్ చుట్టూ బారీకేడ్లతో సాయుధ దిగ్భందనం చేసారు.అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ మరియు ఐక్యరాజ్యసమితి సహాయం కోసం నిజాం ప్రయత్నం చేశారు.కానీ కుదరలేదు.చివరికి సెప్టెంబర్ 9,1948న అన్ని విధాలుగా బాగా ఆలోచించిన తర్వాత ఇక హైదరాబాద్ లో శాంతి భద్రతలు కాపాడడానికి సైన్యాన్ని పంపడం తప్పితే వేరే మార్గం లేదని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఆర్మీ కమాండర్ లకు మరియు ప్రభుత్వ అధికారులకు కొన్ని సూచనలు జారీ చేశారు.అవి
ఆహారం, ఉప్పు, వైద్య సదుపాయాలు మరియు నీటిని శుద్ధి చేసే క్లోరిన్ వస్తువులు తప్ప ఇతర ఏ వస్తువులు హైదరాబాద్ లోకి అనుమతించకూడదనే కఠినమైన ఆంక్షలు విధించి అమలు చేసారు.
హైదరాబాద్ ఆయుధాల కొనుగోలుకు స్టేట్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ ఎల్.అడ్రూస్ ను ఆటోమేటిక్ ఆయుధాలు మరియు ఏంటీ టాంక్ గన్లను తీసుకొని రావడం కోసం లండన్ పంపించారు.కానీ హైదరాబాద్ కి ఇంకా స్వతంత్ర దేశ హోదా లభించనందున ఆయుధాలను కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యం అనే విషయం తెలిసివచ్చింది.
హైదరాబాద్ సంస్థాన ప్రధాన మంత్రి లైక్ అలీ మాట్లాడుతూ ఒకవేళ పాకిస్థాన్ తో యుద్ధం వస్తే మనం భారత్ కి వెన్నుపోటు పొడిచి పాకిస్థాన్ తో కలిస్తామని భారత్ భావిస్తుంది.కానీ బహుశా నిజంగానే మనం కూడా అలాగే చేయవచ్చు అని చెప్పారు.దానికి పటేల్ గారు స్పందిస్తూ మీరు కత్తులతో వస్తే మేము కూడా కత్తులతోనే సమాధానం చెప్తాము అంటూ బదులిచ్చారు.
ఖాసీం రజ్వీ తన రజాకార్ల సైన్యం తో మాట్లాడుతూ చేతిలో కత్తితో మరణించడం ఉత్తమమైన మరణంగా పేర్కొన్నారు.
ఖాసీం ని ఒక రాక్షసుడిగా భారత ప్రభుత్వం పేర్కొంది.
భారత్ మన పైన దాడి చేస్తే నేను భారతదేశం మొత్తం అల్లర్లు సృష్టిస్తాను.భారత్ మనల్ని నాశనం చేస్తే, భారత్ ని నేను నాశనం చేస్తాను.భారతదేశం మా పైకి దండెత్తి వస్తే హిందువుల పైన దాడులు చేసి ప్రతీకారం తీర్చుకుంటాను, దాని వల్ల భారతదేశం మొత్తం హిందువులు ముస్లిం ల పైన ప్రతీకార దాడులు చేస్తారనీ, దేశం నాశనమవుతుంది అని ఖాసీం రజ్వీ పేర్కొన్నారు.
సెప్టెంబర్ 6న చిల్లకల్లు సమీపంలోని భారత పోలీస్ పోస్ట్ పైన రజాకార్లు భారీ కాల్పులు జరిపారు.ఈ దాడి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి భారత ఆర్మీ కమాండర్ అభేసింగ్ నేతృత్వంలో పూనె హార్స్ స్క్వాడ్రన్ మరియు 2/5 గూర్ఖా రైఫిల్స్ కంపెనీ ని పంపారు.పూనా హార్స్ స్క్వాడ్రన్ యొక్క ట్యాంకులు హైదరాబాద్ భూభాగం లోని కోదార్ వరకు వారిని వెంబడించారు.కోదార్ వద్ద 1వ హైదరాబాద్ సాయుధ లాన్సర్ల తో అడ్డగించబడ్డారు.పూనా హార్స్ స్క్వాడ్రన్ ఒక సాయుధ వాహనాన్ని నాశనం చేసారు.రాష్ట్ర బలగాలను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ ని బలవంతంగా స్వాధీనం చేసుకుని భారతదేశంలో కలపాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఆదేశాలు అందిన వెంటనే సదరన్ కమాండ్ కమాండర్-ఇన్-ఛీఫ్ లెఫ్టినెంట్ జనరల్ E.N.గోడ్దార్ నేతృత్వంలో భారత సైన్యం గోడ్దార్ ప్లాన్ ని రూపొందించింది.ఈ ప్లాన్ ప్రకారం భారత సైన్యం రెండు లక్ష్యాలను ఛేదించాలి.ఒకటి విజయవాడ నుండి మరియు రెండవది షోలాపూర్ నుండి హైదరాబాద్ సైన్యాన్ని లక్ష్యాలుగా చేసుకున్నాయి.'పోలీస్ ఏక్షన్' అని పిలిచే ఈ చర్యకు ఆర్మీ ప్రధాన కార్యాలయం 'ఆపరేషన్ పోలో' అని పేరు పెట్టారు.
షోలాపూర్ నుండి జరిగిన దాడికి మేజర్ జనరల్ జె.ఎన్.ఛౌదరి అధ్యక్షత వహించారు.వీరి సైన్యం లో నాలుగు దళాలు పని చేసాయి.
స్ట్రైక్ ఫోర్స్,దీనిలో వేగంగా కదిలే పదాతిదళం,ఆశ్విక దళం మరియు తేలికపాటి ఫిరంగి దళాలతో కలిసి ఉంటుంది.స్మాష్ ఫోర్స్,దీనిలో సాయుధ యూనిట్లు మరియు ఫిరంగులు ఉంటాయి.కిల్లింగ్ పదాతిదళం,దీనిలో పదాతి దళం మరియు ఇంజనీరింగ్ విభాగాలతో కూడిన దళాలు ఉంటాయి.వీర్ ఫోర్స్ యాంటీ ట్యాంక్ మరియు ఇంజనీరింగ్ విభాగాలను కలిగి ఉంటుంది.
విజయవాడ నుండి చేసిన దాడికి మేజర్ జనరల్ A.A.రుద్ర నేతృత్వం వహించారు.వీరి సైన్యం లో
2/5 గూర్ఖా రైఫిల్స్, 17వ (పూనా) హార్స్ స్క్వాడ్రన్ యొక్క ఒక స్క్వాడ్రన్ మరియు ఇంజనీరింగ్ మరియు అనుబంధ విభాగాలతో పాటు 19వ ఫీల్డ్ బ్యాటరీ నుండి ఒక దళం ఉన్నాయి. అదనంగా, నాలుగు పదాతిదళ బెటాలియన్లు కమ్యూనికేషన్ మార్గాలను తటస్థీకరించడం కోసం మరియు రక్షించడం కోసం. పూణే బేస్ నుండి ఎయిర్ సపోర్ట్ కోసం హాకర్ టెంపెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క రెండు స్క్వాడ్రన్లు సిద్ధం చేయబడ్డాయి.
అప్పటికే కాశ్మీర్ లో యుద్ధం చేయగా దాని కారణంగా భారత ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ సర్ రాయ్ బుచెర్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ దాడి చేయడానికి సెప్టెంబర్ 13వ తారీఖు ఖరారు చేయబడింది.
సెప్టెంబర్ 13వ తేదీ మొదటి రోజు యుద్ధం లో షోలాపూర్ సికింద్రాబాద్ హైవే లో నల్దుర్గ్ కోట వద్ద హైదరాబాద్ 1వ పదాతి దళానికి చెందిన డిఫెండింగ్ ఫోర్స్ మరియు భారత 7వ బ్రిగేడ్ దళానికి మధ్య జరిగింది. ఈ దాడిలో భారత సైన్యం గెలవడమే కాక బోరి నది పైన ఒక ముఖ్యమైన వంతెనని భద్రంగా ఉంచగలిగారు.తర్వాత 2వ సిక్కు పదాతి దళం ద్వారా నల్దుర్గ్ వద్ద హైదరాబాద్ స్థావరాల పైన జరిగింది.వారు ఓడినా రహదారులు, వంతెనలు పాడవకుండా దాడి జరిగింది.స్మాష్ ఫోర్స్ లోని భాగమైన 1వ ఆర్మర్డ్ బ్రిగేడ్ యొక్క సాయుధ దళం నల్దుర్గ్ నుండి 8 కి.మీ. దూరం లో ఉన్న జల్కోట్ పట్టణానికి 9.00 గంటలకల్లా చేరుకుంది.ఇది లెఫ్టినెంట్ కల్నల్ రామ్ ఆధ్వర్యంలోని స్ట్రైక్ ఫోర్స్ యూనిట్లకు 9 డోగ్రా యొక్క సింగ్ కమాండెంట్ (మోటరైజ్డ్ బెటాలియన్) గుండా వెళ్ళడానికి మార్గం సుగమం చేసింది.అక్కడ నుండి 61 కి.మీ. దూరంలో ఉన్న ఉమర్గే పట్టణానికి 15.15 గంటలకు చేరుకుంది.అక్కడ వారికి రజాకార్ల నుండి ఎదురైన ప్రతిఘటనలను సులభంగానే తిప్పికొట్టి, వారిని పరాజితులను చేసింది.అదే సమయంలో, 3వ అశ్విక దళం యొక్క స్క్వాడ్రన్, 18వ కింగ్ ఎడ్వర్డ్స్ స్వంత కావల్రీ నుండి ఒక దళం, 9 పారా ఫీల్డ్ రెజిమెంట్ నుండి ఒక దళం, 10 ఫీల్డ్ కంపెనీ ఇంజనీర్లు, 3/2 పంజాబ్ రెజిమెంట్, 2/1 గూర్ఖా రైఫిల్స్, 1 మేవార్ ఇన్ఫాంట్రీతో కూడిన మరొక కాలమ్ మరియు సహాయక దళాలు తుల్జాపూర్ పట్టణంపై దాడి చేశాయి.దాదాపు నల్దుర్గ్ నుండి 34 కి.మీ. దూరం లో ఉన్న తుల్జాపూర్ చేరుకున్నారు.అక్కడ 200 మంది రజాకార్లు దాదాపుగా 2 గంటల పాటు పోరాడి చివరికి భారత సైన్యానికి లొంగిపోయారు.కానీ అక్కడ నది ఉప్పొంగడంతో లోహారా పట్టణం వైపు ముందుకు వెళ్ళలేకపోయారు.
షోలాపూర్ వైపు నుంచి మొదటి రోజు జరిగిన దాడి లో శత్రువుల వైపు భారీ ప్రాణ నష్టం జరగడమే కాకుండా ఎక్కువ భూభాగాన్ని కూడా చేజిక్కుంచుకోగలిగారు.చాలా మంది హైదరాబాద్ కి చెందిన రజాకార్లు మరియు సైనికులు బందీలుగా దొరికారు.వారిలో బ్రిటిష్ సైనికుడు ఉన్నాడు.వాడు నల్దుర్గ్ సమీపంలోని వంతెనను కూల్చేయడానికి ప్రయత్నించాడు.
విజయవాడ నుండి లెఫ్టినెంట్ జనరల్ A.A.రుద్ర నేతృత్వంలోని దళాలు హంబర్ ఆర్మ,ర్డ్ కార్లు మరియు స్టాగౌండ్ ఆర్మర్డ్ కార్ల యొక్క రెండు సాయుధ యూనిట్ల నుండి తీవ్ర స్థాయిలో దాడులను ఎదుర్కొన్నారు.అయితే 8.30 గంటల సమయంలో కోదార్ చేరుకోగలిగారు.శత్రువులను అణగదొక్కుతూ సాయంకాలానికి మునగాల చేరుకోగలిగారు.హోస్పేట్ లో 1వ హైదరాబాద్ రజాకార్లు మరియు పఠాన్ల యూనిట్ల నుండి దాడి చేసి చక్కెర కర్మాగారాన్ని చేజిక్కించుకున్నారు.తుంగభద్ర వద్ద 5/5 గూర్ఖా దాడి చేసి హైదరాబాదీ సైన్యం నుండి కీలకమైన వంతెనని పొందారు.
రెండవ రోజు అయిన సెప్టెంబర్ 14న ఉమర్గే వద్ద సేద తీరిన దళాలకు గూఢచార వ్యవస్థ ఆకస్మికంగా ఏర్పాటు చేసిన శత్రు స్థావరాలను కనిపెట్టడం వల్లన టెంపెస్ట్ ల స్క్వాడ్రాన్ ల నుండి వైమానిక దాడులు నిర్వహించి ఆ స్థావరాలను నాశనం చేస్తూ మార్గాన్ని సుగమం చేసింది.దాంతో వారు ఆ మార్గాల్లో ముందుకు సాగుతూ రాజసూర్ ని చేరుకుని అక్కడ వరకు భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ నుండి వస్తున్న దళాలకు మాత్రం ట్యాంకులు ముందుకు సాగకుండా పెద్ద పెద్ద కందకాలు తవ్వడం వల్లన నెమ్మదిగా ముందుకు సాగింది.అలా ముందుకు సాగుతూ ఉండగా సూర్యాపేట నుండి 6 కి.మీ. దూరం లో ఉన్న 1వ లాన్సర్ మరియు 5వ పదాతి దళాల వల్ల కొండ ప్రాంతాల నుండి కాల్పులను ఎదుర్కొన్నారు.బర్మా కాంపెయిన్ లోని 2/5 గూర్ఖా దళాలు ఈ దాడులను సమర్థవంతంగా తిప్పి కొట్టారు.హైదరాబాద్ సైన్యం భారీ ప్రాణ నష్టం తో లొంగిపోవాల్సి వచ్చింది.అదే సమయంలో 3/11 గూర్ఖా రైఫిల్స్ మరియు 8వ ఆశ్విక దళం యొక్క స్క్వాడ్రన్ ఉస్మినాబాద్ పైన దాడి చేసి ఎదురు దాడి చేసిన రజాకార్లతో తీవ్ర పోరాటం చేసి వారిని ఓడించి నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మేజర్ జనరల్ D.S.బ్రార్ నేతృత్వంలోని దళాలు ఔరంగాబాద్ పైన దాడి చేసాయి.ఈ దాడి లో పదాతి దళం మరియు ఆశ్విక దళం యొక్క 6 వరుసలు దాడి చేసాయి.ఈ దాడులు వల్ల చివరికి శత్రు సైన్యాలు భారత దేశానికి లొంగిపోయేలా చేసింది.జల్పాలో 3వ సిక్కు,2వ జోధ్పూర్ పదాతి దళం మరియు 18వ ఆశ్విక దళానికి చెందిన ట్యాంక్ లు శత్రు సైన్యం నుండి పోరాటాలను ఎదుర్కోవలసి వచ్చింది.
సెప్టెంబర్ 15 మూడవ రోజున 3/11 గూర్ఖా కంపెనీ తప్ప మిగిలిన సైన్యం జల్నా పట్టణాన్ని ఆక్రమించడానికి బయలుదేరారు.వారు ముందు లాతూర్ కు అక్కడ నుండి మోమినాబాద్ కు వెళ్ళారు.ముందు గోల్కొండ 3 లాన్సర్లు గట్టి పోరాటం చేసిని భారత సైన్యం వీరోచిత పోరాటం వల్ల ఆ ప్రాంతాల్లోని హైదరాబాద్ సైన్యం లొంగిపోయారు.
సూర్యాపేట ప్రాంతంలో వైమానిక దాడులు చేసి హైదరాబాద్ సైన్యాన్ని చెల్లాచెదురు చేసి వారి అడ్డంకులను తొలగించారు.అయినా కొంత మేరకు గూర్ఖా 2/5 సైన్యం పైన రజాకార్ల దాడి జరిగింది.ఎన్ని జరిగినా వారిని తరిమి కొట్టి చివరికి పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు.వెనక్కి పారిపోయిన రజాకార్లు మూసీ నది పైన వంతెనను కూల్చేసారు.భారత సైన్యం ఆ వంతెనను మరమ్మతులు చేయడానికి వీలు లేకుండా అయిపోయింది.నార్కట్ పల్లిలో కూడా రజాకార్ల ను భారత సైన్యం అణచివేసింది.
సెప్టెంబర్ 16 నాల్గవ రోజున లెఫ్టినెంట్ కల్నల్ రామ్ సింగ్ ఆధ్వర్యంలోని సైన్యం తెల్లవారుజామున జహీరాబాద్ వైపు వెళ్తుండగా మందుపాతర పేలడంతో అక్కడ క్లియర్ చేయడానికి ఆలస్యం అయ్యింది.షోలాపూర్-హైదరాబాద్ హైవే రోడ్ పైన బీదర్ రోడ్ జంక్షన్ కి చేరుకోగానే అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన స్థావరాల నుండి పెద్ద ఎత్తున హైదరాబాద్ సైన్యం దాడులు ప్రారంభించారు.అక్కడ ఆ దాడులను తిప్పి కొట్టడానికి కొన్ని యూనిట్లను అక్కడ వదిలి జహీరాబాద్ వైపు వెళ్తుండగా దారిలో కొన్ని దాడులు జరిగినప్పటికీ వాటిని తిప్పికొడుతూ జహీరాబాద్ దాటి 15 కి.మీ. ముందుకు వెళ్ళారు.
భారత సైన్యం పట్టణ ప్రాంతాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు రజాకార్లు మెరుపు దాడులు చేశారు.భారత సైన్యం పోరాడుతున్నప్పటికీ వారు గట్టి ఎదురు దాడి చేస్తూ ఆ భూభాగం లో భారత సైన్యం ముందుకు పోకుండా ఆపగలిగారు.కానీ భారత సైన్యం 75 ఎం.ఎం. తుపాకీలతో దాడి మొదలు పెట్టే సరికి రజాకార్లు ఓటమి పాలయ్యారు.
సెప్టెంబర్ 17,5వ రిజున తెల్లవారుజామున భారత సైన్యం బీదర్ లోకి ప్రవేశించింది.అప్పటికే 1వ ఆర్మర్డ్ రెజిమెంట్ నేతృత్వంలోని దళాలు రాజధాని నగరానికి 60 కి.మీ.దూరంలో కల చిట్యాల్ పట్టణానికి చేరుకున్నారు. మరొక దళం హింగోళి పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది.
యుద్ధం మొదలైన 5వ రోజుకి హైదరాబాద్ సైన్యం మరియు రజాకార్లు అన్ని విధాలుగా అత్యంత ప్రాణ నష్టం తో ఓడిపోయారు.అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం సాయుధ పోరాటాన్ని ఆపేస్తూ కాల్పుల విరమణ ప్రకటించారు.
సెప్టెంబర్ 16 న ఓటమిని అంగీకరించిన నిజాం తన ప్రధాన మంత్రి మీర్ అలీని పిలిచి రాజీనామా చేయాల్సిందిగా కోరారు.అతనితో పాటు మొత్తం మంత్రులు రాజీనామా చేశారు.
సెప్టెంబర్ 17 మధ్యాహ్నం నిజాం యొక్క దూత భారత ఏజెంట్ జనరల్ K.M. మున్షీకు నిజాం రాసిన ఉత్తరం పట్టుకొచ్చి ఇచ్చాడు.K.M.మున్షీ నిజాం ని సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయానికి పిలిచాడు.అక్కడ జరిగిన సమావేశంలో నిజాం "రాబందులు రాజీనామా చేశారు, ఇప్పుడు నేనేం చేయాలో అర్థం కావట్లేదు" అన్నారు. హైదరాబాద్ స్టేట్ ఆర్మీ కమాండర్ జనరల్ ఎల్.ఆడ్రూస్ కి హైదరాబాద్ ప్రజలకు భద్రత కల్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేయమని మున్షీ నిజాం కి చెప్పాడు.
సెప్టెంబర్ 23 1948న నిజాం మొదటి సారిగా ఆకాశవాణి స్టేషన్ ని సందర్శించి తన ప్రసంగాన్ని ఇచ్చారు.
అతని ప్రసంగం లో
గత సంవత్సరం (1947)లో ఒక సమూహం పాక్షిక సైనిక సంస్థని ఏర్పాటు చేశారు.నా ప్రధాన మంత్రి,ఛతారీ నవాబు ఇళ్ళను చుట్టుముట్టింది.సర్ వాల్టర్ మాంక్టన్,నా రాజ్యాంగ సలహాదారు, బలవంతంగా నవాబ్ మరియు నా ప్రధాన మంత్రి మరియు నమ్మకస్తులైన మంత్రులను రాజీనామా చేయమని బలవంతం చేసారు.ఖాసీం రజ్వీ నేతృత్వంలోని ఈ దళాలకు దేశం లో ఎటువంటి వాటా కానీ,సేవా గుర్తింపు కానీ లేదు.హిట్లర్ జర్మనీని స్వాధీనం చేసుకున్నట్టు అది రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకుంది.ప్రజలను భయాందోళనలకు గురి చేసి నన్ను నిస్సహాయుణ్ణి చేసింది అని చెప్పారు.
భారత సైన్యం రికార్డుల ప్రకారం జనరల్ చౌదరి నేతృత్వంలోని సైన్యం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోకి ప్రవేశించింది.సెప్టెంబర్ 18న హైదరాబాద్ మేజర్ జనరల్ ఎడ్రూస్ నేతృత్వంలోని హైదరాబాద్ సైన్యం లొంగిపోయింది.మేజర్ జనరల్ చౌదరి సెప్టెంబర్ 18న ఆర్మీ జనరల్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ పోలీస్ ఏక్షన్ మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దగ్గరుండి చూసుకున్నారు.
హైదరాబాద్ కి విమోచన లభించిన అనంతరం అల్లర్లు,హింస చెలరేగాయి.ఈ హింసలో ముస్లిం లు కూడా మరణిస్తున్నారనే వార్త వచ్చింది.వెంటనే ఈ అల్లర్ల గురించి తెలుసుకోవాలని నెహ్రూ కాంగ్రెస్ సభ్యుడు పండిట్ సుందర్ లాల్ ను మరియు ఒక బృందాన్ని పంపారు.ఈ హింసలో 25,000 నుండి 40,000 మంది పౌరులు మరణించారని ఒక అంచనా.అలాగే భారత సైన్యం మరియు హైదరాబాద్ పోలీసులు కొంత మంది పాల్గొన్నారని కూడా అంచనా వేశారు.
0 $type={blogger}