NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
జమ్మూ కాశ్మీర్లో భారత సాయుధ దళాలు
జమ్మూ కాశ్మీర్‌లోని భారతీయ సాయుధ దళాలు భారత సైన్యం, నావికా మరియు వైమానిక దళం, సాయుధ దళాల ప్రత్యేక ఆపరేషన్ విభాగం (AFSOD) వంటి త్రి-సేవా విభాగాలు మరియు సరిహద్దు భద్రతా దళం వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన పారామిలిటరీ సంస్థలను కలిగి ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశాస్త్ర సీమా బల్ మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్,భారత సైన్యం యొక్క పారా SF, ఇండియన్ నేవీ మార్కోస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గరుడ్ కమాండో ఫోర్స్‌తో సహా భారత సైన్యంలోని మూడు విభాగాలు తమ ప్రత్యేక బలగాలను ఈ ప్రాంతంలో మోహరించాయి. ఇది కాకుండా, జమ్మూ కాశ్మీర్ పోలీస్‌కి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఈ ప్రాంతంలో ఎలైట్ పోలీస్ తిరుగుబాటుదారులను అణచివేసే దళాలు ఉన్నాయి.
భారత సైన్యం:
జమ్మూ మరియు కాశ్మీర్లో భారత సైన్యం కార్యకలాపాలు
1947-1948 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో కాశ్మీర్లో భారత సైన్యం మొట్టమొదట మోహరించింది. దీనిని తర్వాత ఈ ప్రాంతంలో పాకిస్తాన్ మరియు చైనాలతో జరిగిన ప్రతి సంఘర్షణ, ప్రతిష్టంభన మరియు సరిహద్దు వాగ్వివాదంలో సైన్యం భాగమైంది. ఈ ప్రాంతంలోని అంతర్గత భద్రతా విస్తరణలలో ఉగ్రవాదులకు వ్యతిరేక కార్యకలాపాలు మరియు తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సైన్యం నేతృత్వంలో జరుగుతాయి, CRPF మరియు SOG చుట్టుకొలత మరియు నిరసనల సమయంలో జనాన్ని నియంత్రణకు తమ సహకారాన్ని అందిస్తాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్:
2019 జమ్మూ కాశ్మీర్ వైమానిక దాడులు
1947లో, రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, C-47 డకోటాస్ మరియు టెంపెస్ట్లు, భారత సైన్యానికి రవాణా మరియు వాయు మార్గంలో సహాయాన్ని అందించాయి, ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాచరిక రాష్ట్రంలోని పెద్ద ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించేందుకు భారత దళాలకు సహాయాన్ని అందించింది.దీని తర్వాత, జమ్మూ కాశ్మీర్ వరదలు, 2014లో మానవతా కార్యకలాపాలతో సహా అనేక సందర్భాలలో వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లో సహాయాన్ని అందించింది.వైమానిక దళం జమ్మూ మరియు కాశ్మీర్లో గరుడ్లను సైన్యంతో కలిపి వారికి "ప్రత్యక్ష పరిస్థితుల్లో శిక్షణ" ఇవ్వడం ప్రారంభించింది.కమాండోలు సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి పని చేస్తారు.
ఇండియన్ నేవీ:
భారత నావికా దళ ప్రత్యేక దళం మార్కోస్ జమ్మూ కాశ్మీర్లో సైన్యంతో పాటు కలిసి పని చేస్తుంది, వూలార్ సరస్సు యొక్క భద్రతను పర్యవేక్షించడం వారి కీలక పాత్రలలో ఒకటి.2018 నుండి,మార్కోస్ సాయుధ దళాల ప్రత్యేక కార్యకలాపాల విభాగంలో భాగంగా ఈ ప్రాంతంలో మోహరించబడింది.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు:
సరిహద్దు భద్రతా దళం
పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పర్యవేక్షించడం BSF బాధ్యత.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
CRPF యొక్క 26 బెటాలియన్లు కాశ్మీర్ ప్రాంతంలో నియమించబడ్డాయి, "ఉత్తరంలోని కుప్వారా నుండి దక్షిణాన జవహర్ టన్నెల్ మరియు తూర్పున పహల్గామ్ నుండి పశ్చిమాన షోపియాన్" మధ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.2020లో CRPF కొత్త బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు మరియు ఆర్మర్డ్ ట్రూప్ క్యారియర్లను పొందింది.
ఇంకా CAPF (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) కూడా కాశ్మీర్లో మోహరించింది. 1) సశాస్త్ర సీమా బల్ (SSB), 2) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) కూడా అక్కడ పని చేస్తున్నారు.
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్:
జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) 1990ల ప్రారంభంలో సృష్టించబడింది.కాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో మిలిటెన్సీ స్థాయిని బట్టి విభిన్నమైన బలంతో బహుళ SOG యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌కి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వం వహిస్తారు. కుల్గాం, అనంత్‌నాగ్, షోపియాన్ మరియు పుల్వామా అత్యధిక SOG యూనిట్లు కలిగిన జిల్లాలు.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
PFI (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)
ఇప్పుడు దేశం మొత్తం ఈ సంస్థ గురించే చర్చలు.ఏ న్యూస్ ఛానల్ చూసినా, యూట్యూబ్ లో వీడియోలు ఊదరగొట్టేస్తున్నాయి.
అంతేకాదు NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) చరిత్రలో తొలిసారిగా అతి పెద్ద దాడిని 15 రాష్ట్రాల్లో 93 ప్రాంతాల్లో 300 మంది నియా అధికారులు నిర్వహించారు.ఈ దాడుల్లో pfi యొక్క రహస్య పత్రాలు,నిషేధిత సాహిత్యం ఎన్నో లభించాయి. దాదాపుగా 300 మందిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత ఈ PFI సంస్థని చివరికి బాన్ చేసారు.
అసలేంటి ఈ PFI?వీళ్ళు చేసిన తప్పు ఏంటి?వీళ్ళ దగ్గర లభించిన రహస్య పత్రాల్లో ఏముంది?PFI కి నిజంగానే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా?
ఒకసారి చూద్దాం:
నిషేధిత ఉగ్రవాద సంస్థ SIMI (స్టుడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా)ని నిషేధించినప్పుడు ఆ సంస్థలోని చాలా మంది నాయకులు బయటకి వచ్చి కేరళ లో నేషనల్ డెమోక్రటిక్ సంస్థని ఏర్పాటు చేసాయి.
తర్వత కాలంలో అంటే 2006 లో ఈ కేరళలోని నేషనల్ డెమోక్రటిక్ సంస్థ వీళ్ళలానే ఆలోచించే కర్ణాటక లోని ఫోరమ్ ఫర్ డిగ్నిటీ అనే సంస్థ మరియు తమిళనాడు లోని మనీదా నీది పసరై అనే సంస్థలతో కలిసి PFI(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)గా ఏర్పడ్డాయి.
ఈ కర్ణాటక లోని ఫోరమ్ ఫర్ డిగ్నిటీ సంస్థ అక్కడ కోస్టల్ ఏరియా లోని ముస్లిం యువతలో బాగా పాపులర్ అయిన సంస్థ.
వీళ్ళు మైనారిటీలు,దళితులలో సామాజికమైన,విద్యాపరమైన సంస్కరణలు తీసుకు రావడానికి ఈ సంస్థని ఏర్పాటు చేసినట్టు పైకి చెప్పుకుంటారు.ఒక కేసులో కేరళ హైకోర్టు ఈ సంస్థని నిషేధిత ఉగ్రవాద సంస్థ SIMI కి ప్రతిరూపంగా చెప్పింది.
ఈ సంస్థకి అనుబంధం గా క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(CFI),ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC), నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్(NWF), జూనియర్ ఫ్రంట్ మరియు ఎంపవర్ ఇండియా అనే సంస్థలే కాక మానవ హక్కుల కోసం పోరాడతామనే ముసుగులో నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్(NCHRO),సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామనే నెపంతో రియాద్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి విదేశాల నుండి ముఖ్యంగా గల్ఫ్ దేశాలు మరియు చైనా నుండి ఫండ్స్ ని సేకరించి PFI కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థలన్నీ PFI కి అనుబంధం గా పని చేస్తున్నాయి.
PFI ప్రత్యక్షంగా రాజకీయాలలో పాల్గొనకపోయినప్పటికీ SDPI (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీకి మద్దతు ఇస్తున్నారు.ఈ పార్టీ కర్ణాటక లోని స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లని కూడా గెలుచుకుంది.ఈ పార్టీ తమకి PFI తో సంబంధం లేదు అని చెప్పినప్పటికీ PFI కి రాజకీయ రూపమే ఈ పార్టీ అని చాలా మంది అభిప్రాయం.
మేము రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నామని చెప్పినప్పటికీ వీళ్ళు చాలా హింసాయుత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.2010 లో కేరళ లో జోసెఫ్ అనే లెక్చరర్ క్వశ్చన్ పేపర్ కష్టంగా సెట్ చేసాడని దాడి చేసి గాయ పరిచారు.బంద్ లలో వీరి నినాదాలు కూడా హింసని ప్రేరేపించేలా ఉంటాయి.ఈ సంస్థ మొత్తం 26 రాష్ట్రాలకు పాకింది.15 రాష్ట్రాల్లో చాలా చురుకుగా వ్యవహరిస్తుంది.
మైనారిటీలకు సేవ చేస్తున్నామనే ముసుగులో ముస్లిం యువతను పోగు చేసి ఈ దేశం పైన ద్వేషాన్ని నూరిపోస్తూ ఈ దేశంలో ముస్లిం లను అణచి వేస్తున్నారు, దాడులు చేస్తున్నారు అంటూ యువతని రెచ్చగొడతారు.
సెల్ఫ్ డిఫెన్స్,ఫిసికల్ ఫిట్నెస్ పేరుతో ఉగ్రవాద శిక్షణనిస్తారు.కత్తులు, కర్రలతో మనిషిని ఎక్కడ దాడి చేస్తే చనిపోతోడో చెప్తారు.మత విద్వేషాలు సృష్టించి,మత కల్లోలాలు సృష్టించడం ఎలానో నేర్పిస్తారు.అన్నిటి కంటే వీరికి మతోన్మాదం ముఖ్యం.యువతను ఉన్మాదులుగా మారుస్తారు.ఇంట్లో కారంపొడి లాంటివి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి అని చెప్తారు.ఇప్పటి వరకు వందల మందిని ఇలాంటి శిక్షణనిచ్చి తయారు చేసారు.హిందూ సంస్థలు,నాయకుల పైన నిఘా ఉంచే నిఘా వ్యవస్థని కూడా ఏర్పాటు చేసుకున్నారు.
ఆఖరికి వాళ్ళు సొంతంగా ప్రధాన మంత్రుల్ని,దేశాధ్యక్షుల్ని ప్రకటించేసుకుని కేరళలో ప్రమాణ స్వీకారం చేసి, సైనిక కవాతులు కూడా చేసుకుంది.ఆర్.ఎస్.ఎస్. లాంటి హిందూ సంస్థలకి వ్యతిరేకంగా పని చేయాలని చెప్తారు.మా తప్పు లేకుండా మిమ్మల్ని అణచి వేయాలని ఇలా చేస్తున్నారని వారు చెప్తున్నా ఇస్లాం ని అవమానించారు అని ఎన్నో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారు.
*కన్హయ్యా లాల్ అనే టైలర్ ని రాజస్థాన్ లో కర్కశంగా పీక కోసి చంపిన వాళ్ళు వీరే.
*తూర్పు ఢిల్లీ లో అల్లర్లు సృష్టించిన వాళ్ళు వీరే.
*CAA కి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రోడ్లని నిర్భంధించిందీ వీళ్ళే.
*హత్రాస్ లో ఏదో జరిగింది అని దేశ వ్యాప్తంగా పెద్ద ఇష్యూ చేయాలని ప్రయత్నించిందీ వీళ్ళే.
అల్లర్లకు,అలజడులకు,మత ఉద్రిక్తత లకు,శోభా యాత్రల పైన, ధార్మిక కార్యక్రమాల పైన దాడులకు PFI యత్నాలు చేసింది.
కేరళ, కర్నాటక, భైంసా, కర్నూలు దగ్గర నంద్యాల, తమిళనాడు లో ఇలా ఎన్నో దాడుల్లో వీరి హస్తం ఉంది.
బీహార్ లో ఒక క్యాంపు పైన, నిజామాబాద్ లో ఒక క్యాంపు పైన దాడి చేసి వారు ఆ కేసుల్లో బిసీగా ఉండేటట్లు చేసి వారు పసిగప్టకుండా దేశ వ్యాప్తంగా ఒకేసారి దాడి చేసారు.మూడు నెలలుగా పథకం వేసి ప్రతి ప్రాంతం,ప్రతి సభ్యుడు ఇలా అన్ని వివరాలు సంపాదించి వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా ఒకేసారి దాడి చేసారు.6000 వరకు నకిలీ అకౌంట్ లు సృష్టించి 100 కోట్ల వరకూ మనీ లాండరింగ్ చేసారని భావిస్తున్నారు.
సిమి ని బాన్ చేసినప్పుడు సిమి తనకు తానే తమ సంస్థని ఆపివేస్తున్నట్టు ప్రకటించుకుని ఆ సభ్యులు వేరే సంస్థల్లో చేరారు.దాంతో అప్పుడు అరెస్టు చేయడానికి ఎవ్వరూ దొరకలేదు.
కానీ ఈసారి అలా జరగకుండా ముందుగా అన్ని ఆధారాలు సంపాదించి అరెస్టులు చేసి తర్వాత నిషేధం విధించింది.
2022 జులై నెలలో బీహార్ లోని పుల్వారీ షరీఫ్ లో అక్కడి పోలీసులు దాడి చేసి అక్కడ ఆయుధ శిక్షణనిస్తున్న PFI లీడర్ని అరెస్టు చేసినప్పుడు అక్కడ 8 పేజీల రహస్య పత్రం లభించింది. అది చదివితే సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు. భద్రతా ఏజెన్సీలు కూడా దిగ్భ్రాంతికి గురి అయ్యారు.అప్పటి నుండి దర్యాప్తు చేస్తే మొత్తం డాక్యుమెంట్లు అన్నీ బయటపడ్డాయి.
వాటిలోని ముఖ్యమైన పాయింట్లు:
విజన్ 2047:
2047 కల్లా ఈ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి.షరియా చట్టం తీసుకురావాలి.
భారత దేశంలో ముస్లిం ల పరిస్థితి:
ఈ దేశంలో ముస్లిం ల పైన,మదర్సాల పైన దాడులు జరుగుతున్నాయి,అణగదొక్కుతున్నారు అని ముస్లిం యువతను రెచ్చగొట్టాలి.
2047 కల్లా ఇస్లాం రాజ్యం తేవడానికి చేయాల్సిన పనులు:
ప్రతి ఇంటి నుంచి ఒక సభ్యుడిని చేర్చాలి, కుదరకపోతే సోషల్ మీడియాలో ఇతర మాధ్యమాల ద్వారా తమ పోరాటాన్ని ఇంటింటికీ ప్రచారం చేయాలి.ఆర్.ఎస్.ఎస్. వాళ్ళు మిమ్మల్ని బతకనివ్వరు అని నమ్మించాలి.
రిక్రూట్మెంట్ మరియు శిక్షణ:
యోగా పేరుతో ఆయుధ శిక్షణ, అందుబాటులో ఉన్న వస్తువులతో పేలుడు పదార్థాలు తయారు చేయడంలో శిక్షణ ఇవ్వడం, వాటిని హిందువుల పైన ఉపయోగించడం నేర్పిస్తారు.
ఆర్.ఎస్.ఎస్. మరియు ఇతర హిందూ సంస్థల సమాచారాన్ని సేకరించడానికి నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు.నాగ్ పూర్ ఆర్.ఎస్.ఎస్. కార్యాలయం పై రెక్కీ కూడా నిర్వహించారు.
మెజారిటీ హిందువుల్లో లోపాలను వివరించడం, ప్రపంచాన్ని అల్లానే సృష్టించాడు, అల్లానే ఈ ప్రపంచానికి ప్రభువు అని చెప్పడం.సోషల్ మీడియా ద్వారా బెదిరించడం,కోర్టుల్లో పిటిషన్లు వేయడం ఇలా ప్రతి దానికి ఒక విభాగం ఉంటుంది.
ప్రజల్లో భయాన్ని సృష్టించి ఓట్లు తమకి అనుకూలంగా వేయించి నాయకులతో తమకు నచ్చినట్లు పని చేయించుకోవడం,ఎస్.సి.,ఎస్.టి, ఒబిసిలలో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆర్.ఎస్.ఎస్. పైన హిందూ జాతి పైన విద్వేషాలు రెచ్చగొట్టి చివరికి మారణహోమం సృష్టించడం వంటివి ఉన్నాయి.
కేరళ, కర్నాటక, రాజస్థాన్, బెంగాల్ లో ఎంతోమంది ఆర్.ఎస్.ఎస్., హిందూ నాయకులు మరణించారు.
హిందువుల అభివృద్ధి చెందిన మౌలిక వసతులను నాశనం చేయాలి.ఆలయాలు, హిందూ సంఘాలు, హిందూ నాయకులు,బాబాలు, స్వామీజీలు అన్నింటినీ.
చిన్న పనితో అంటే బాంబు దాడి లాంటి వాటితో అందరికీ వారి గురించి తెలిసేలా చేయాలి.వారి దేవుడిని నమ్మని వారిని భయపెట్టాలి.
అరెస్టు తర్వాత కూడా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఇళ్ళపై పెట్రోల్ బాంబుల దాడులు.
భారత ఉపఖండంలో వారి ఆధిపత్యం సాధించాలి.
ADVERTISEMENT
VIMAL JONNEY Men's Regular Fit Trackpants Pack of 3
ఈ రహస్య డాక్యుమెంట్లతో బాటు జీహాదీ సాహిత్యం,డబ్బుతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగిన పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.షార్ట్ కోర్స్ ఆన్ ఐఇడి బాంబ్స్ మేకింగ్ పుస్తకాలు కూడా దొరికాయి.దేశంలో ఎన్ని రకాలుగా కలహాలు, యుద్ధాలు సృష్టించాలి చెప్పే పుస్తకాలు ఉన్నాయి.
PFI నేషనల్ సెక్రెటరీ నసీముద్దీన్ పైన 10 కి పైగా కేసులున్నాయి.ఇతర సభ్యులు కొయ్యె, అబ్దుల్ రెహ్మాన్,అనిస్ అహ్మద్ లాంటి వాళ్ళు నిషేధిత సంస్థ SIMI కి ప్రధాన బాధ్యతలు నిర్వహించారు.
ఒకవేళ ఇప్పటికీ దొరకక పోతే ఆర్.ఎస్.ఎస్.,బి.జె.పి. నాయకులను టార్గెట్ చేసుకుని ఈ దసరా కి భారీ కుట్ర చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.అంతేకాక పెద్ద పెద్ద పోలీస్ అధికారులు పైన కూడా.
PFI తెలంగాణ ఉపాధ్యక్షుడు అహన్ ఆచూకీ తెలియలేదు.దాడులు ఎలా చేయాలి? విద్వేషాలు ఎలా రెచ్చగొట్టాలి? ఆయుధాలు లేకుండా ఎలా విద్వేషాలు రెచ్చగొట్టాలి అని శిక్షణ ఇవ్వడం లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఈ ఏడాది జులై 12న ప్రధాని పాట్నా పర్యటనలో దాడి చేసేందుకు బాగా శిక్షణ పొందిన నిష్ణాతులతో విఫలయత్నం చేసినట్లు తెలిపారు.PFI పై NIA దాడులు తర్వాత కేరళలో బంద్ నిర్వహించారు.ఇది కూడా హింసారూపం దాల్చింది.బస్సులు,ఆటోలు,కార్లు ధ్వంసం చేస్తున్నారు.
PFI ని నిషేధించినప్పుడు అంతర్జాతీయంగా ఎటువంటి వ్యతిరేకత రాకుండా ముందుగా ISIS లాంటి బ్యాన్ చేసిన ఉగ్రవాద సంస్థలతో వారికున్న సంబంధాల్ని ఆధారాలతో సహా చూపించారు. PFI ISIS కి యువతను ఎలా చేరుస్తున్నారు?వాళ్ళకి కావలసిన వస్తువులను ఎలా సమకూరుస్తున్నారు అనే విషయాలను బట్టబయలు చేశారు.ప్రజలకి ఈ సంస్థ ఎంత ప్రమాదకరమో తెలియజేయడంలో సఫలమైంది.అందుకే ప్రజల నుండి బాన్ చేయాలి అనే డిమాండ్ వచ్చింది.ఈ డిమాండ్ మొట్టమొదట కేరళ, ఝార్ఖండ్ ల నుండి వచ్చింది.ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అనే ముస్లిం రాజకీయ పార్టీలు కూడా PFI బ్యాన్ ని సమర్ధించారు.
ADVERTISEMENT
TRAWOC 80L Travel Backpack for Outdoor Sport Camp Hiking Trekking Bag Camping Rucksack HK007 (Grey) 1 Year Warranty
కేంద్ర ప్రభుత్వం గత ఐదారు సంవత్సరాలుగా మొత్తం అన్ని PFI సంస్థల పైనా నిఘా పెట్టింది.ఎంపవర్ ఇండియా అనే మొబలైజేషన్ వింగ్ పైన కూడా. గూఢచారుల్ని ఆ సంస్థ లోకి పంపి ఆ సంస్థల మూలాలు,వ్యాప్తి,మనీ లాండరింగ్, స్లీపర్ సెల్స్ లాంటి అన్ని విషయాలను తెలుసుకున్నారు.తర్వాత చాలా రాష్ట్రాల్లోని ఈ సంస్థ సభ్యులను అరెస్ట్ చేశారు.
అరెస్టు తర్వాత కూడా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఇళ్ళపై పెట్రోల్ బాంబుల దాడులు.
సెప్టెంబర్ 22,25 తేదీల్లో రైడ్స్ చేసి ఆర్ధిక లావాదేవీలు,అకౌంట్లు, కార్యకలాపాలు అన్నీ స్తంభింపజేసి PFI నెట్వర్క్ మొత్తం కుప్పకూలేటట్లు చేసారు.UAPI చట్టాన్ని ఉపయోగించి బ్యాన్ చేసారు.దీని వల్ల ఈ సంస్థలకి ఫండ్స్ పంపే వ్యక్తులు, మీటింగ్ లు పెట్టే ఇళ్ళు, కార్యాలయాలు అన్నిటి పైన కేసులు పెట్టి చర్యలు తీసుకోవచ్చు.
PFI ఒక చక్రం,దాని అనుబంధ సంస్థలు చుట్టూ ఉండే పని చేస్తున్నట్టు HUB&FOKES అని అభివర్ణించారు.చాలా రోజుల నుండి PFI పైన ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కేంద్ర ప్రభుత్వం పైన ఎంత విమర్శలు వినిపిస్తున్నా కంగారు పడకుండా జాగ్రత్తగా పూర్తి సమాచారం సేకరించి వారు తప్పించుకోవడానికి వీలు లేకుండా దాడులు చేశారు.మొట్ట మొదట దాడి జరిగినప్పుడు కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ బ్యాన్ తర్వాత ఎక్కడా చిన్న వ్యతిరేకత కూడా కనిపించలేదు.29 ఉదయం 5 గంటలకు బ్యాన్ విధించారు.
UAPI చట్టం వల్ల అరెస్టు అయిన వారిని ఎటువంటి విచారణ లేకుండా 60 నుండి 180 రోజుల వరకు జైల్లో ఉంచవచ్చు.150 రోజుల్లోగా మరొక కేసు పెడితే ఇంకొక 180 రోజులు జైల్లో ఉంచవచ్చు.
దేశం లో అన్ని ఉగ్రవాద సంస్థల్ని 5 ఏళ్ళ పాటు బ్యాన్ చేసే చట్టాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి.రాజ్యాంగాన్ని అనుసరించి 5 ఏళ్ళ పాటు PFI మరియు దాని అనుబంధ సంస్థలను బ్యాన్ చేసారు.తర్వాత ఒకవేళ ఇంకా వాళ్ళలో మార్పు రాలేదంటే మరొక 5 ఏళ్ళు అలా పొడిగిస్తూ ఉండవచ్చు.
SDPI రాజకీయ పార్టీని మాత్రం బ్యాన్ చేయలేదు.ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల సంఘం 2006 లో రిజిస్టర్ చేసింది. SDPI కి PFI మద్దతు ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా ఆధారాలు లేవు.అలాగే దేశ వ్యతిరేక నినాదాలు ఎప్పుడూ ప్రత్యక్షంగా చేయలేదు.ఒకవేళ దీని పైన చర్యలు తీసుకోవాలంటే ఎన్నికల సంఘం మాత్రమే తీసుకోవాలి.