NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
మిస్సైల్ సిస్టమ్
ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్స్
స్పైక్/స్పైక్ LR-II:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మొత్తం 400 కంటే ఎక్కువ టాంకులు ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*ఆర్మీ స్పైక్ MR మరియు స్పైక్ LR-II నడిపిస్తుంది.
*ఎయిర్ ఫోర్స్ MI-17 హెలికాప్టర్ల కోసం స్పైక్ N-LOS తీసుకుంది.
తయారీ దేశం ఇజ్రాయెల్.
9M 113 కోంకుర్స్-M(AT-5 స్పాండ్రల్):
*భారత్ మరియు రష్యా లు తయారు చేస్తున్నాయి.
*మొత్తం 15,140 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*భారత్ డైనమిక్ లిమిటెడ్ వారి ద్వారా భారత్ లోనే BMP-2(IFV) కోసం తయారు చేస్తున్నారు.
తయారీ భారత్ మరియు రష్యా.
మిలాన్ 2టి:
*భారత్ మరియు ఫ్రాన్స్ లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 34,000 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*దేశీయంగా తయారు చేయడానికి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ లైసెన్స్ పొందింది.
తయారీ దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్.
9M119Svir(AT-11 స్నిప్పర్):
*భారత్ మరియు రష్యా లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 25,000 సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ-టాంక్ గైడెడ్ మిస్సైల్.
*10000 యూనిట్లు రష్యా నుండి దిగుమతి చేసుకోబడతాయి.
తయారీ దేశాలు భారత్ మరియు రష్యా.
9M133కార్నెట్(AT-14 స్ప్రిగ్గన్):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*3000 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*250 లాంఛర్స్ తో సహా కొంటున్నారు.
తయారీ దేశం రష్యా.
9M120 అటాక-V(AT-9 spiral-2):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఏంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం రష్యా.
9K114 స్టర్మ్(AT-6 స్పైరల్):
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*800 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*ఏంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
తయారీ దేశం రష్యా.
ధృవ్ అస్త్ర:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎయిర్-టు-గ్రౌండ్ ఏంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్.
*ట్రయల్స్ విజయవంతం గా పూర్తి చేసుకుని తయారీకి సిద్ధంగా ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
MPATGM:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ట్రయల్స్ విజయవంతం గా పూర్తి చేసుకుని తయారీకి సిద్ధంగా ఉన్నాయి.
*మేన్ పోర్టబుల్ ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్.
తయారీ దేశం భారత్.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
సామ్హో (మిస్సైల్):
*భారత్ లోనే తయారు చేయబోతున్నారు.
*కెనాన్ లాంఛ్డ్ ఏంటీ టాంక్ గైడెడ్ మిస్సైల్.
*DRDO 3 టెస్ట్ లను విజయవంతంగా పూర్తి చేసింది.
బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిస్సైల్
బ్రహ్మోస్:
*భారత్ మరియు రష్యా లలో తయారు చేస్తున్నారు.
*సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
*మొత్తం 4 రెజిమెంట్ లు సర్వీస్ లో ఉన్నాయి.
*ప్రతి రెజిమెంట్ లోనూ 24 లాంఛర్స్ లేదా 72 ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మిస్సైల్స్ ఉంటాయి.
*290-700 కి.మీ. స్థాయి కలిగి ఉంటాయి.
*ప్రపంచంలోనే వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
*ఎంత సంఖ్యలో ఉన్నాయి అని ఖచ్చితంగా తెలియదు.కానీ చైనా మాత్రం భారత్ వద్ద 14,000 ఉన్నాయి అని చెప్తుంది.
తయారీ దేశాలు భారత్ మరియు రష్యా.
నిర్భయ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*1000-1500 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
*సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.
తయారీ దేశం భారత్.
శౌర్య:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*క్వాసీ బాలిస్టిక్ మిస్సైల్.
*700-1900 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
పృథ్వీ-II:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*150-300 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-I:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*700-1250 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-II:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*2000-3500 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
*తయారీ దేశం భారత్.
అగ్ని-III:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*3500-5000 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
అగ్ని-IV:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్.
*4000-6000 కి.మీ. స్థాయిలో పని చేస్తుంది.
తయారీ దేశం భారత్.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత సైన్యం ఫిరంగులు
smerh 9K58 MBRL:
*భారత్ మరియు రష్యా లు తయారు చేస్తున్నాయి.
*90 కి.మీ. రేంజ్ కలిగిన 300mm మల్టిపుల్ రాకెట్ సిస్టమ్.
*మొత్తం 972 లాంఛర్స్ ఉన్నాయి.
తయారీ దేశాలు-భారత్ మరియు రష్యా.
పినాక MBRL:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*MK1 37-45కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది.
*MK2 60కి.మీ. రేంజ్ కలిగి ఉంటుంది.
*మొత్తం 288 లాంఛర్స్ ఉన్నాయి.
*మరొక 3 పినాక మార్క్ 1రెజిమెంట్స్ మరియు 6 పినాక మార్క్ 2 రెజిమెంట్స్ 2022 చివరికి తయారు చేయడానికి లార్సెన్ అండ్ టర్బో మరియు టాటా లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
*సంవత్సరానికి 5000 మిస్సైల్స్ తయారు చేస్తున్నారు.
*2028 కల్లా ఆర్మీ మొత్తం 22 రెజిమెంట్స్ సిద్ధం చేసుకుంటున్నారు.
తయారీ దేశం-భారత్.
BM-21:
*దీన్ని భారత్ మరియు సోవియట్ యూనియన్ తయారు చేస్తున్నారు.
*ఇది ఒక 122 mm సామర్ధ్యం కలిగిన మల్టిపుల్ రాకెట్ లాంఛ్ సిస్టమ్.
*దీన్ని భారత్ లోనే అభివృద్ధి చేస్తున్నారు.
*DRDO ద్వారా దీని ఫైరింగ్ రేంజ్ ని 40 km వరకు పెంచుతున్నారు.
*మొత్తం 240 లాంఛర్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*2023 కల్లా మొత్తం 240 యూనిట్ల స్థానంలో పినాక మార్క్ 1 MBRL యూనిట్లను పెడతారు.
తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.
స్వయంచాలక ఫిరంగులు
K-9 వజ్ర టి:
*భారత్ మరియు సౌత్ కొరియా లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 200 యూనిట్లు తొందర్లోనే ఆర్డర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*K9 థండర్ వేరియంట్.
*155 mm/52 కేలిబర్ కలిగిన స్వయంచాలక పొట్టి ఫిరంగి.
*భారత్ లోని లారెన్ అండ్ టర్బో సంస్థ తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు సౌత్ కొరియా.
పెద్ద బురుజు కలిగిన ఫిరంగులు
ధనుష్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*155mm/45 కాలిబర్ సామర్ధ్యం కలిగిన పొట్టి బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
*మొత్తం 114 గన్స్ ఆర్డర్ లో ఉన్నాయి.ఈ ఆర్డర్ 414 కి చేరే అవకాశం ఉంది.
తయారీ దేశం భారత్.
BAE సిస్టమ్స్ M777:
*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*155 mm/39 కాలిబర్ చిన్న బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 89 సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 145 ఆర్డర్ లో ఉన్నాయి.
*మహీంద్రా డిఫెన్స్ ఇండియా వారు విడి పరికరాలను కలిపి తయారు చేస్తున్నారు.
హాబిట్స్ FH77 A/B:
*స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*155mm పొట్టి ఫిరంగి.
*155mm గన్స్ బోఫోర్స్ లో తయారు చేస్తున్నారు.
*తొందర్లోనే ధనుష్ ఫిరంగులను వీటి స్థానంలో పెట్టబోతున్నారు.
తయారీ దేశం స్వీడన్ .
M-46 షరాంగ్:
*సోవియట్ యూనియన్, ఇజ్రాయెల్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*130mm/155mm ఫీల్డ్ గన్.
*860+240 మొత్తం 1100 షరాంగ్స్ అభివృద్ధి చేసారు.
*180 M-46 130 mm ఫిరంగులు 155 mm స్టాండర్డ్ కి సోల్తామ్ వారి ద్వారా అభివృద్ధి చేసారు.
*300 M-46 గన్స్ OFB వారి ద్వారా 155mm/45 కాలిబర్ గా అభివృద్ధి చేయాల్సి ఉంది.
*ఈ అభివృద్ధి చేసిన గన్స్ ని షరాంగ్ అంటారు.
తయారీ దేశాలు భారత్, సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్.
OFB ఇండియన్ ఫీల్డ్ గన్ Mk 1/2/3:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*105mm ఫీల్డ్ గన్.
*1700 సర్వీస్ లో ఉన్నాయి.
*30 కి.మీ. రేంజ్ వరకు FCS మరియు INS ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.
తయారీ దేశం భారత్.
స్థిరంగా ఉండే ఫిరంగులు
విజయంత MBT:
*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*105mm పిల్ బాక్స్ కలిగి ఉంటుంది.
*200 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.
తయారీ దేశాలు భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్.
T-55 MBT:
*భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.
*700 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఫిరంగులు
DRDO సరికొత్త బురుజు కలిగిన ఫిరంగుల గన్ సిస్టమ్(ATAGS):
*భారత్ లోనే తయారు చేస్తారు.
*155mm/52 కాలిబర్ బురుజు కలిగిన గన్.
*7 యూనిట్లు తయారు చేస్తున్నారు.
*3364 కోట్ల రూపాయల విలువ గల 150 యూనిట్లు తయారు చేయడానికి డిఫెన్స్ ఆక్విసిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది.
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *124 అర్జున్ MK1 మరియు 2 MK1A సర్వీస్ లో ఉన్నాయి. *ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్. *మరొక 118 MK1A ఆర్డర్ లో ఉన్నాయి. *మహాభారతం లోని అర్జునుడి పేరు మీద నామకరణం చేశారు.
తయారీ దేశం-భారత్
T-90S భీష్మ/T-90S:
*వీటిని భారత్ మరియు రష్యాలలో తయారు చేస్తున్నారు. *T-90స్ వాహనాలు ఇప్పటికే 2078 సర్వీస్ లో ఉన్నాయి. *464 T-90S వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి. *ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్. *మహాభారతం లోని భీష్ముడి పేరు మీద నామకరణం చేశారు.
తయారీ దేశాలు-భారత్ మరియు రష్యా.
T-72 అజేయ/అజేయ MK2:
*వీటిని భారత్, సోవియట్ యూనియన్, పోలాండ్ లలో తయారు చేస్తున్నారు. *1000 T-72 ట్యాంకు లు అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్,రష్యా, పోలాండ్ మరియు ఫ్రాన్స్ పంపారు. *ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్. *968 T-72 M1 హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ లో అభివృద్ధి చేయబడ్డాయి. *ఎవ్వరూ జయించలేరు అనే అర్థం వచ్చేలా నామకరణం చేశారు. *తయారీ దేశాలు భారత్, సోవియట్ యూనియన్, పోలాండ్. *ఇంకా అభివృద్ధి చేసిన అజేయ ట్యాంక్ లు ట్రయిల్స్ లో ఉన్నాయి.
తయారీ దేశాలు-భారత్, సోవియట్ యూనియన్ మరియు పోలాండ్.
పదాతి దళాల యుద్ధ వాహనాలు
BMP-2 శరత్:
*దీన్ని భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి. *ప్రస్తుతానికి 2500 సర్వీస్ లో ఉన్నాయి. *TISAS తో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు.దాని వలన ఫైర్ కంట్రోల్ మెరుగు పడుతుంది మరియు ATGMతో సైన్యం ఇంకా ఆధునికంగా ఉంటుంద (కోంకుర్స్-ఎం). *BMP-1 పాతబడిపోయాయి. *BMP-2 రెండు థర్మో బారెక్ మిస్సైల్స్ మరియు రెండు టాండెమ్ వార్ హెడ్ కోంకుర్ మిస్సైల్స్ తో అభివృద్ధి చేయబడి BMP-2 గా మారింది మరియు వీటికి ఒక ఇంటిగ్రేటెడ్ TI సైట్,ఒక LRF అలాగే టెర్రట్ మీద ఒక AGC అమర్చబడి ఉంటుంది. *ప్రతి సంవత్సరం 100 ట్యాంకులను నవీనకరిస్తున్నారు.మరియు ఈ సంఖ్యను 125 కి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. *ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ వారిచే భారత్ లోనే తయారు చేస్తున్నారు. *అన్ని BMP-2/2K వాహనాలను BMP-2M వాహనాలుగా నవీనకరిస్తున్నారు.
తయారీ దేశాలు-భారత్, సోవియట్ యూనియన్
ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనాలు
టాటా 1PMV:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం. *మొదటి బ్యాచ్ ఇన్ ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ DRDO-TATA కెస్ట్రల్ పైన అమర్చారు.
తయారీ దేశం - భారత్
కళ్యాణి M4:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం. *27 M4 ల కోసం 177.95 కోట్ల ఆర్డర్ పెట్టారు.
తయారీ దేశం-భారత్
టాటా క్విక్ రియాక్షన్ యుద్ధ వాహనం:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *మొదట బ్యాచ్ క్విక్ రియాక్షన్ యుద్ధ వాహనం బిగించబడింది. *ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం.
తయారీ దేశం భారత్
మహీంద్రా స్టేషన్ ప్లస్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం. *ఐక్య దేశాల శాంతిని కాపాడే సైన్యాలు ఉపయోగిస్తాయి.
తయారీ దేశం-భారత్
OFB ఆదిత్య:
*భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తయారు చేస్తున్నాయి. *1300 పైన సర్వీస్ లో ఉన్నాయి. *1400 వాహనాలను తయారు చేయాల్సి ఉంది. *నెలకి 20 వాహనాలను ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ వారిచే తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు: భారత్,సౌత్ ఆఫ్రికా.
కాస్పిర్:
*సౌత్ ఆఫ్రికా లో తయారు చేస్తున్నారు. *సర్వీస్ లో ఉన్నాయి. *200 కంటే ఎక్కువ ఉన్నాయి.
తయారీ దేశం-సౌత్ ఆఫ్రికా
మహీంద్రా ఆయుధాలు కలిగిన లైట్ స్పెషలిస్ట్ వాహనం:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం. *1056 కోట్ల రూపాయల విలువ గల 1300 తేలికైన ప్రత్యేక వాహనాలను ఆర్డర్ చేసారు.2024 కల్లా డెలివరీ చేయాల్సి ఉంది.
తయారీ దేశం-భారత్
మహీంద్రా మార్క్స్ మేన్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఎక్కువగా కాశ్మీర్ ప్రాంతంలో ఏంటీ టెర్రర్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తారు. *తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం.
తయారీ దేశం-భారత్
మహీంద్రా రక్షక్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం. *7.62 బుల్లెట్ ల నుండి రక్షణ కలిగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం. *అన్ని యూనిట్ల లోనూ మహీంద్రా ALSV తో భర్తీ చేయబోతున్నారు.
తయారీ దేశం-భారత్
ట్యాంకులను నాశనం చేసే వాహనాలు
నమికా:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఇది శత్రు ట్యాంకులను నాశనం చేసే వాహనం. *BMP-2 దీనికి నాగ్ మిస్సైల్స్ ని కేరీ చేస్తుంది.
తయారీ దేశం-భారత్
9P 148:
*సోవియట్ యూనియన్ తయారు చేస్తుంది. *ఇది ట్యాంకులను నాశనం చేసే వాహనం.గూఢచర్య వాహనం గా కూడా ఉపయోగపడుతుంది. *శత్రు ట్యాంకులను నాశనం చేసే వాహనం ఇది.
తయారీ దేశం-సోవియట్ యూనియన్.
ఇతర వాహనాలు
NBC పర్యవేక్షణ వాహనం:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ప్రస్తుతం 16 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి. *CRBN పర్యవేక్షణ వాహనాలు. *BMP-2 ఆధారితంగా CRBN CVRDE ద్వారా అభివృద్ధి చేయబడింది మరియు ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
కేరియర్ మోర్టార్ ట్రాక్డ్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఇవి మోర్టార్ కేరియర్స్ *ప్రస్తుతం 220 సర్వీస్ లో ఉన్నాయి. *CVRDE ద్వారా BMP-2 మోర్టార్ కేరియర్ అభివృద్ధి చేయబడింది. *ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
DRDO ఆయుధాలు కలిగిన అంబులెన్స్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఇది ఆయుధాలు కలిగిన అంబులెన్స్. *ప్రస్తుతం 275 సర్వీస్ లో ఉన్నాయి. *CVRDE ద్వారా BMP-2 ఆధారిత ఆయుధాలు కలిగిన అంబులెన్స్ గా అభివృద్ధి చేయబడింది. *ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు. *288 వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం-భారత్.
సైన్యం అవసరాలకు మరియు రవాణా కి ఉపయోగపడే వాహనాలు
ఫోర్స్ గూర్ఖా:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం. *2018 లో ఆర్డర్ చేసారు.
తయారీ దేశం-భారత్
టాటా సఫారీ స్మార్ట్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *1500 పైగా వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి. *3193 యూనిట్లు ఆర్డర్ చేసారు. *GS-800 మోడల్. మారుతి జిప్సీ స్థానంలో భర్తీ చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
టాటా క్సినాన్:
*ఇండియా మరియు జపాన్ లలో తయారు చేస్తున్నారు. సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం. *సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-భారత్
టాటా సుమో:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
తయారీ దేశం-భారత్.
మహీంద్రా స్కార్పియో:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
తయారీ దేశం భారత్
మహీంద్రా 550 DXB:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు. *సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం. *ట్రూప్ క్యారియర్ గా ఉపయోగిస్తారు.
తయారీ దేశం-భారత్.
మారుతి జిప్సీ:
*భారత్ మరియు జపాన్ లలో తయారు చేస్తున్నారు. *సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం. *ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాటికి అదనంగా మరో 541 వాహనాలను ఆర్డర్ చేసారు.
తయారీ దేశం-భారత్ మరియు జపాన
మిత్సుబిషి పాజ్రో:
*దీన్ని జపాన్ లో తయారు చేస్తున్నారు. *సైన్యం రవాణా కి ఉపయోగిస్తారు. *ఇండియా-చైనా బోర్డర్ లో ఉంటాయి.
తయారీ దేశం-జపాన్
ఆర్కిటిక్ కాట్ ఆల్టెర్రా TBX 700:
*దీన్ని అమెరికా లో తయారు చేస్తున్నారు. *అల్ టెర్రాయిన్ వాహనాలు. *పారా-SF దళాలు ఉపయోగిస్తాయి.
తయారీ దేశం-అమెరికా
పొలారిస్ స్పోర్ట్స్ మేన్ 6×6 ATV:
*దీన్ని భారత్ మరియు అమెరికాలో తయారు చేస్తున్నారు. *అల్ టెర్రాయిన్ వాహనాలు. *ఇండో-టిబెటన్ బోర్డర్ లో ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు-భారత్ మరియు అమెరికా.
పొలారిస్ రేంజర్:
*భారత్ మరియు అమెరికా తయారు చేస్తున్నారు. *అల్ టెర్రాయిన్ వాహనాలు. *ఇండో-టిబెటన్ బోర్డర్ లో ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు భారత్ మరియు అమెరికా.
పొలారిస్ MRZR:
*దీన్ని అమెరికా లో తయారు చేస్తున్నారు. *అల్ టెర్రాయిన్ వాహనాలు. *మల్టీ పర్పస్ అల్ టెర్రాయిన్ వాహనాలు. *భారత్ ఆర్మీ నార్త్ కమాండ్ లో సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
సామాను చేరవేసే మరియు ట్రాన్స్పోర్ట్ వాహనాలు
DRDO ప్రహార్ 510:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ట్రూప్ క్యారియర్ గా ఉపయోగిస్తారు.
తయారీ దేశం భారత్
టాటా LPTA713TC:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *తేలికైన 4×4 ట్రక్. *వెహికల్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్.
అశోక్ లేల్యాండ్ టోప్చి:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *తేలికైన 4×4 ట్రక్. గన్ టోయింగ్ వాహనం.
తయారీ దేశం-భారత్.
టాటా LPTA 2038 HMV:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *మీడియం 6×6 ఎక్కువ వేగం కలిగిన వాహనం. *1858 ట్రక్ లను ఆర్డర్ ఇచ్చారు. *పాత BEML టాటా 6×6 ఫ్లీట్ స్థానంలో వీటిని పెడుతున్నారు.
తయారీ దేశం-భారత్.
స్కానియా SBA111:
*స్వీడన్ లో తయారు చేస్తున్నారు. *మీడియం 6×6 ఆర్టిలరీ ట్రాక్టర్. *భారత్ ఆర్మీ 410 FH770B బోఫోర్స్ హోటిజర్స్ కొనుగోలు చేసింది. *660 SBAT111S ట్రక్స్ ని కూడా ఆర్డర్ ఇచ్చారు.
తయారీ దేశం-స్వీడన్
అశోక్ లేల్యాండ్ సూపర్ స్టాల్లియన్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *మీడియం 6×6 8×8 10×10 ట్రక్స్ *10,12,15 టన్నుల ట్రక్స్.
తయారీ దేశం-భారత్.
BEML టాట్రా:
*భారత్ మరియు చెక్ ఓస్లోవాకియా దేశాల్లో తయారు చేస్తున్నారు. *మీడియం మరియు భారీ 6×6 8×8 10×10 మరియు 12×12 ట్రక్కులు. *రాడార్స్ లాంటి సున్నితమైన ఉపకరణాలను మోసుకు వెళ్ళడానికి ఉపయోగిస్తారు. *పినాక మరియు smerch MBRL సిస్టమ్స్ యొక్క వాహనం. *వీటిలోని మొత్తం 6×6 మోడల్ స్థానంలో టాటా LPTA 2038 HMV.
తయారీ దేశాలు-భారత్ మరియు చెక్ ఓస్లోవాకియా.
ఇంజనీరింగ్ మరియు సహాయక వాహనాలు
WZT-3M:
*భారత్ మరియు పోలాండ్ లలో తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన రికవరీ వాహనం. *352 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి. *మరొక 204 ఆర్డర్ లో ఉన్నాయి. * భారత్ లో తయారయ్యే కిట్లు మరియు భాగాలతోటి లోకల్ గా తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు-భారత్ మరియు పోలాండ్
WZT-2:
*పోలాండ్ లో తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన రికవరీ వాహనం. *222 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-పోలాండ్.
ఆయుధాలు కలిగిన పర్యవేక్షించే ఇంజనీరింగ్ వాహనం:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన ఇంజనీరింగ్ వాహనం. *16 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి. *53 వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి. *BMP-2 ఆధారిత ఇంజనీరింగ్ మరియు పర్యవేక్షణ వాహనాలను ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్ .
AVTLR:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన ఇంజనీరింగ్ వాహనం. *BMP-2 ఆధారంగా టర్రెట్ ని తొలగించి బుల్లెట్ బ్లేడ్ మరియు ఇంజనీరింగ్ ఉపకరణాలు జత పర్చి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్ .
హైడ్రెమా:
*డెన్మార్క్ లో తయారు చేస్తున్నారు. *మైన్స్ శుభ్రపరిచే వాహనం. *సర్వీస్ లో ఉన్నాయి. *24 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-డెన్మార్క్
బ్రిడ్జి లేయింగ్ ట్యాంక్ T-72:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేసే బ్రిడ్జి వాహనం. *BLT-72 దీనిలో ఒక మోడల్. *దీనికి పొడవైన మిలట్రీ లోడ్ క్లాసిఫికేషన్ 70 బ్రిడ్జి అమర్చబడి ఉంటుంది. *నదుల్ని,కాలవల్ని మొదలైన వాటిని దాటటానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం-భారత్ .
పాంటనోవా మోస్తావా సబ్రేవియా(PMS):
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *సర్వీస్ లో ఉన్నాయి. *ఇవి బల్లకట్టు వంతెన కలిగిన వంతెన.
తయారీ దేశం-భారత్
అర్జున్ BLT:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేయడానికి ఉపయోగిస్తారు. *BLT అర్జున్ అనేది ముఖ్యమైన యుద్ధ ట్యాంక్ అర్జున్ మీద అమర్చబడిన వేగవంతమైన మరియు విశ్వసనీయమైన సిస్టమ్. *వేగవంతమైన ఇండక్షన్ కలిగి 24 మీటర్ల బ్రిడ్జి ని 10 నిమిషాల్లో ఎటువంటి తడి లేదా పొడి ప్రదేశాల్లో అయినా లాంఛ్ చేయగలదు.
తయారీ దేశం-భారత్
కార్తీక్ BLT:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేసే బ్రిడ్జి.
తయారీ దేశం-భారత్
DRDO సర్వత్రా:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *8×8 ట్రక్ కి అమర్చిన బ్రిడ్జి సిస్టమ్. *ట్రక్ మౌంటెడ్,మల్టీ స్పాన్, మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టం.
తయారీ దేశం-భారత్
CL 70 మ్యాట్ గ్రౌండ్ సర్ఫేసింగ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *ట్రక్ మీద అమర్చబడిన మాట్ గ్రౌండ్ సర్ఫేసింగ్. *సాండీ మరియు మార్షీ టెర్రాయిన్ లకు చలన శక్తి ఇవ్వడానికి టాట్రా వాహనాల ప్న అమర్చిన ఆటోమేటెడ్ లేయింగ్ అండ్ రికవరీ సిస్టమ్.
తయారీ దేశం-భారత్
అన్ మాన్డ్ గ్రౌండ్ వాహనం
DRDO దక్ష్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు. *బాంబులను నిర్వీర్యం చేసే రోబోట్. *సర్వీస్ లో ఉన్నాయి
తయారీ దేశం-భారత్
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
తెలంగాణ విమోచన దినోత్సవం-ఆపరేషన్ పోలో
"నీ బాంచన్ దొర కాల్మొక్తా" అంటే నీ బానిసని దొర నీ కాళ్ళు మొక్కుతా అంటూ బానిస బతుకులు బతికేవారు నిజాం ప్రభుత్వం లోని హైదరాబాద్ సంస్థాన ప్రజలు.ఇంకా చెప్పాలంటే నిజాం పాలనలో ప్రజలు మనుషులు అని కూడా మర్చిపోయి అత్యంత దుర్భరమైన జీవితాన్ని జీవించేవారు.
రైతులు పండించిన పంటలు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు.వేల మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు.ప్రతి ఊరిలోని హిందూ మహిళలు తమ ప్రాణాలను,తమ వారి ప్రాణాలను కాపాడుకునేందుకు సిగ్గు విడిచి నగ్నంగా బతుకమ్మ ఆడవలసి వచ్చేది.పనుల్లో ఉన్న పిల్లల తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా అనుమతి ఉండేది కాదు.వారు ఏడ్చి చచ్చినా సరే వారిని పట్టించుకోకుండా తల్లులు పని చేయాల్సిందే.
రకరకాల చిత్ర విచిత్రమైన పన్నులు విధించి ప్రజల సొమ్ము మొత్తం దోచుకునేవారు.కొన్ని సందర్భాల్లో చివరికి ఊరి జనం దాచుకున్న ధాన్యం కూడా దోచుకొనేవారు.నిజాం రాజులు మాత్రం ఆ సొమ్ము తో జల్సాలు చేసేవారు.ఎదురు తిరిగినందుకు బైరాన్ పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్ లో వెయ్యి మందిని ఉరి తీసి చంపారు.ఇలాంటి లెక్కలేనన్ని సంఘటనలు మరెన్నో జరిగేవి.గోళ్ళని పీకేసేవారు.నానా హింసలు పెట్టేవారు.
యార్జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇతైదుహల్ బైనుల్ముస్లమీన్ సంస్థ హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మర్చేది.ఎదురు తిరిగిన వారి పైన అరాచకంగా దాడులు చేసేవారు.నిజాం పాలకుల దృష్టిలో ప్రజలంతా వారి బానిసలు.సామాజికంగా వెట్టి అనే బానిస వ్యవస్థ అమల్లో ఉండేది.
సంస్థాన ఉద్యోగాల్లో ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించేవారు.స్థానికులను తీసుకొనేవారు కాదు.స్థానిక భాషల్ని, సంస్కృతులను నిర్దాక్షిణ్యంగా అణచివేసేవారు.అరబ్బీ,పార్శీ, ఉర్దూ లు గొప్ప భాషలనీ మిగిలిన భాషలు నీచమైనవనీ ఈసడించుకునేవారు.
ఈ అవమానాల్ని,అకృత్యాలను, బాధల్ని, బానిసత్వాన్ని,ఆకలినీ తట్టుకోలేని హైదరాబాద్ సంస్థాన ప్రజలు తమ ఆవేశం కట్టలు తెంచుకోగాయ ఇక ఆ నిజాం నుండి మాకు విముక్తి కావాలని తమ జీవితాల కోసం వీరోచితంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి పైన పోరాడారు.1946 నుండి 1948 మధ్య ఈ ఉద్యమం చాలా భీకరంగా జరిగింది.ఈ ఉద్యమాన్నే తెలంగాణ విమోచన ఉద్యమం గా పేర్కొంటారు.వివిధ సంఘాల,పార్టీల, రచయితల, ప్రజాస్వామిక వాదుల ప్రజల
సంఘటిత పోరాటమిది.
మరొక వైపు మొత్తం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం ఆ బానిసత్వం లోనే బ్రతకాల్సి వచ్చేది.దాని వలన తెలంగాణ ప్రజల కడుపు ఇంకా మండిపోయింది.
తెలంగాణ ప్రజల తిరుగుబాటు అణచివేయడానికి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అనబడే నరరూప రాక్షసులను ప్రజల పైకి ఉసిగొల్పారు.ప్రజల పచ్చి నెత్తురు తాగే రాక్షసుల వంటి వారు ఈ రజాకార్లు.
వాళ్ళు ఊళ్ళ మీద పడి కనిపించిందంతా దోచుకుని ఊళ్ళకు ఊళ్ళనే తగలబెట్టేసేవారు.ఆఖరికి చచ్చిన శవాలను కూడా బూటు కాలితో తన్నేవారు కిరాతక రజాకార్లు.స్త్రీలను మానభంగం చేసి,వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు, చెట్లకు కట్పేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరుసగా నిలబెట్టి తుపాకీతో కాల్చేసేవారు, బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసేవారు.
ఈ భయంకర దృశ్యాలు చూసి వందేమాతరం రామచంద్రరావు గారు అప్పటి నెహ్రూ గారికి నిజాం దుర్మార్గుల పై లేఖ రాసి అందించారు.
భారత ఆర్మీ పోలీసు చర్య-ఆపరేషన్ పోలో
స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం దేశం లో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం కట్టబెట్టారు.ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక లేకపోయి ఉంటే ఆ చిన్న చిన్న సంస్థానాలన్నీ స్వతంత్రంగా ఉండి మళ్లీ దోపిడీకి గురయ్యేవి.కానీ పటేల్ గారు తన చాతుర్యం తో 562 సంస్థానాలను మన దేశంలో కలిపారు.కానీ కాశ్మీర్,జునాఘడ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర్య రాజ్యాలుగా ఉంటామని పట్టుబట్టాయి.కానీ తొందర్లోనే పాకిస్థాన్ దాడులు తట్టుకోలేక కాశ్మీర్ రాజు కూడా తన సంస్థానాన్ని భారత దేశం లో కలిపాడు.పాకిస్థాన్ నుండి మన కాశ్మీర్ ను మన సైన్యం కాపాడింది.అదే మన సైన్యం మొదటి ఆపరేషన్.
హైదరాబాద్ సంస్థాన పాలకుడు ఏడవ నిజాం తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలనుకున్నాడు.దాని కోసం వ్యూహాలు పన్నాడు.భారత్ లో విలీనానికి సమయం కావాలని అప్పటి వరకు స్వతంత్రంగా ఉంటామనీ పటేల్ ని కోరాడు.
కానీ అదే నిజాం అప్పటికే పాకిస్థాన్ కి 20 కోట్ల సహాయం చేసినట్లు ఆధారాలతో సహా పటేలచ గారికి తెలిసింది.
దాంతో సమయం ఇవ్వడానికి పటేల్ ఒప్పుకోలేదు.ఆలస్యం అయితే ఏం జరుగుతుందో ఆయన అర్ధం చేసుకున్నారు.
పైగా కరాచీలో నిజాం తన సంస్థానం తరపున ఒక అధికారిని కూడా నియమించాడు.
అదే సమయంలో నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లు హైదరాబాద్ సంస్థానం లో మారణహోమం సృష్టిస్తూ భారత ప్రభుత్వాన్ని భయపెట్టడానికి లక్షలాది మంది తో భారీ కవాతు నిర్వహించారు.
ఇక పటేల్ గారు ఆలస్యం చేయకూడదని భావించి హైదరాబాద్ సంస్థానాన్ని ఎలాగైనా భారతదేశంలో కలపాలనుకున్నాడు.అప్పుడే భారత సైన్యం తో పోలీసు చర్య చేయించాడు.
దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు.
పటేల్ గారి ఆదేశాలతో జనరల్ జె.ఎన్.ఛౌదరి నేతృత్వంలో ఈ చర్య 1948 ్్సెప్టెంబర్ 13 నుండి 18 సాయంత్రం వరకు కొనసాగింది.
నిజాం సైన్యం రెండు రోజులు ప్రతిఘటించినా తర్వాత ఏమీ చేయలేకపోయారు.రజాకార్లు 800 వరకూ చనిపోయారు.వారు చేసిన అకృత్యాల ముందు అది చాలా చిన్నదని కొంత మంది అభిప్రాయం.
భారత ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షి సమక్షంలో నిజాం సైన్యాధ్యక్షుడు ఎల్.ఎడ్రూస్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు మేజర్ జనరల్ చౌదరి కి పత్రాన్ని అందజేశారు.దక్కన్ రేడియో లో ఆ రోజు రాత్రి హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్లుగా నిజాం ప్రకటించడంతో జనం వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగురవేశారు.తర్వాత రోజు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు.
1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేసారు.నిజాం ప్రధాని లాయక్ అలీ ని తొలగించి, రజాకార్లతో జనాన్ని నానా హింసలు పెట్టించిన ఖాసీం రజ్వీ ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.తర్వాత హైదరాబాద్ లో తాము కనిపిస్తే ప్రజల చేతుల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి లాయకై అలీ, ఖాసీం రజ్వీ లు పాకిస్థాన్ కి పారిపోయారు.ఖాసీం రజ్వీ అక్కడే దిక్కు లేని చావు చచ్చాడు.
అలా ఆపరేషన్ పోలో పేరుతో పటేల్ గారు తెలంగాణ ప్రజలను బానిసత్వం నుండి,ప్రత్యక్ష నరకం నుండి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించాడు.ఒకవేళ పాకిస్థాన్ లో కలిపి ఉంటే ఇంకా దయనీయంగా ఉండేది తెలంగాణ ప్రజల పరిస్థితి.
అందుకే సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు.
ఒకవేళ పటేల్ గారే లేకపోతే భారత దశమే ఉండేది కాదు.ఒకవేళ ఉన్నా కాశ్మీర్ మరియు హైదరాబాద్ చాలా దారుణ పరిస్థితుల్లో పాకిస్థాన్ చేతిలో నలిగిపోతూ ఉండేవి.
మన ఈ బ్లాగ్ లో ముందు భారత సైన్యం గురించి, తర్వాత నావీ మరియు ఎయిర్ ఫోర్స్ గురించి తెలియజేసి తర్వాత వారు చేసిన ఆపరేషన్స్ గురించి తెలియజేయాలనుకున్నా.కానీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది.