Showing posts with label indian army special forces. Show all posts
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
జమ్మూ కాశ్మీర్లో భారత సాయుధ దళాలు
జమ్మూ కాశ్మీర్‌లోని భారతీయ సాయుధ దళాలు భారత సైన్యం, నావికా మరియు వైమానిక దళం, సాయుధ దళాల ప్రత్యేక ఆపరేషన్ విభాగం (AFSOD) వంటి త్రి-సేవా విభాగాలు మరియు సరిహద్దు భద్రతా దళం వంటి కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన పారామిలిటరీ సంస్థలను కలిగి ఉన్నాయి. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశాస్త్ర సీమా బల్ మరియు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్,భారత సైన్యం యొక్క పారా SF, ఇండియన్ నేవీ మార్కోస్ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క గరుడ్ కమాండో ఫోర్స్‌తో సహా భారత సైన్యంలోని మూడు విభాగాలు తమ ప్రత్యేక బలగాలను ఈ ప్రాంతంలో మోహరించాయి. ఇది కాకుండా, జమ్మూ కాశ్మీర్ పోలీస్‌కి చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, ఈ ప్రాంతంలో ఎలైట్ పోలీస్ తిరుగుబాటుదారులను అణచివేసే దళాలు ఉన్నాయి.
భారత సైన్యం:
జమ్మూ మరియు కాశ్మీర్లో భారత సైన్యం కార్యకలాపాలు
1947-1948 ఇండో-పాకిస్తాన్ యుద్ధం సమయంలో కాశ్మీర్లో భారత సైన్యం మొట్టమొదట మోహరించింది. దీనిని తర్వాత ఈ ప్రాంతంలో పాకిస్తాన్ మరియు చైనాలతో జరిగిన ప్రతి సంఘర్షణ, ప్రతిష్టంభన మరియు సరిహద్దు వాగ్వివాదంలో సైన్యం భాగమైంది. ఈ ప్రాంతంలోని అంతర్గత భద్రతా విస్తరణలలో ఉగ్రవాదులకు వ్యతిరేక కార్యకలాపాలు మరియు తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు సైన్యం నేతృత్వంలో జరుగుతాయి, CRPF మరియు SOG చుట్టుకొలత మరియు నిరసనల సమయంలో జనాన్ని నియంత్రణకు తమ సహకారాన్ని అందిస్తాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్:
2019 జమ్మూ కాశ్మీర్ వైమానిక దాడులు
1947లో, రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, C-47 డకోటాస్ మరియు టెంపెస్ట్లు, భారత సైన్యానికి రవాణా మరియు వాయు మార్గంలో సహాయాన్ని అందించాయి, ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క పూర్వ రాచరిక రాష్ట్రంలోని పెద్ద ప్రాంతాలపై తిరిగి నియంత్రణ సాధించేందుకు భారత దళాలకు సహాయాన్ని అందించింది.దీని తర్వాత, జమ్మూ కాశ్మీర్ వరదలు, 2014లో మానవతా కార్యకలాపాలతో సహా అనేక సందర్భాలలో వైమానిక దళం జమ్మూ కాశ్మీర్లో సహాయాన్ని అందించింది.వైమానిక దళం జమ్మూ మరియు కాశ్మీర్లో గరుడ్లను సైన్యంతో కలిపి వారికి "ప్రత్యక్ష పరిస్థితుల్లో శిక్షణ" ఇవ్వడం ప్రారంభించింది.కమాండోలు సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ మరియు రాష్ట్రీయ రైఫిల్స్‌తో కలిసి పని చేస్తారు.
ఇండియన్ నేవీ:
భారత నావికా దళ ప్రత్యేక దళం మార్కోస్ జమ్మూ కాశ్మీర్లో సైన్యంతో పాటు కలిసి పని చేస్తుంది, వూలార్ సరస్సు యొక్క భద్రతను పర్యవేక్షించడం వారి కీలక పాత్రలలో ఒకటి.2018 నుండి,మార్కోస్ సాయుధ దళాల ప్రత్యేక కార్యకలాపాల విభాగంలో భాగంగా ఈ ప్రాంతంలో మోహరించబడింది.
కేంద్ర సాయుధ పోలీసు బలగాలు:
సరిహద్దు భద్రతా దళం
పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పర్యవేక్షించడం BSF బాధ్యత.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్
CRPF యొక్క 26 బెటాలియన్లు కాశ్మీర్ ప్రాంతంలో నియమించబడ్డాయి, "ఉత్తరంలోని కుప్వారా నుండి దక్షిణాన జవహర్ టన్నెల్ మరియు తూర్పున పహల్గామ్ నుండి పశ్చిమాన షోపియాన్" మధ్య ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహించబడుతున్నాయి.2020లో CRPF కొత్త బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు మరియు ఆర్మర్డ్ ట్రూప్ క్యారియర్లను పొందింది.
ఇంకా CAPF (సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) కూడా కాశ్మీర్లో మోహరించింది. 1) సశాస్త్ర సీమా బల్ (SSB), 2) కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) కూడా అక్కడ పని చేస్తున్నారు.
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్:
జమ్మూ మరియు కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) 1990ల ప్రారంభంలో సృష్టించబడింది.కాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో మిలిటెన్సీ స్థాయిని బట్టి విభిన్నమైన బలంతో బహుళ SOG యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్‌కి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వం వహిస్తారు. కుల్గాం, అనంత్‌నాగ్, షోపియాన్ మరియు పుల్వామా అత్యధిక SOG యూనిట్లు కలిగిన జిల్లాలు.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత సైన్యం లోని వీర జాగిలాలు (కుక్కలు)
భారత సైన్యం లో జాగిలాలది చాలా ప్రముఖ పాత్ర ఉంది.ఎంతో మంది సైనికులతో పాటు కొన్ని జాగిలాలు కూడా దేశం కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించాయి.
ఇప్పుడు ఆ జాగిలాల యూనిట్ల గురించి,వాటిని ఆర్మీలో ఎలా చేర్చుకుంటారు?ఏఏ జాతుల్ని చేర్చుకుంటారు? తెలుసుకుందాం.
మన జాగిలాల యూనిట్ల లో 25 పూర్తి యూనిట్లు,4 సగం యూనిట్లు ఉన్నాయి.పూర్తి యూనిట్లలో 24 జాగిలాలు,సగం యూనిట్లలో 12 జాగిలాలు ఉంటాయి.
ఏ జాతుల జాగిలాలను ఆర్మీలోకి తీసుకుంటారు?
మన జాగిలాల యూనిట్ల లో చాలా రకాల జాతుల జాగిలాలను తీసుకుంటున్నప్పటికీ, ముఖ్యంగా
లాబ్రెడర్స్,జర్మన్ షిఫర్డ్, బెల్జియన్ మాలినోయిస్ మరియు గ్రేట్ మౌంటెయిన్ స్విస్ డాగ్స్ ఉన్నాయి.
మన ఆర్మీలో ఈ జాగిలాల బాధ్యత ఏమిటి?
సైనిక జాగిలాలు అనేక రకాల విధులను నిర్వహిస్తాయి.అవి గార్డు డ్యూటీ, పెట్రోలింగ్, ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైసెస్ (IEDలు) సహా పేలుడు పదార్థాలను పసిగట్టడం, గనులను గుర్తించడం, డ్రగ్స్‌తో సహా నిషేధిత వస్తువులను పసిగట్టడం, సంభావ్య లక్ష్యాలపై దాడి చేయడం, దాచడం వంటివి ఉంటాయి.పరారీలో ఉన్న ఉగ్రవాదుల జాడ కనిపెట్టడం లాంటివి.
ప్రతి ఒక్క జాగిలానికి దానిని నడిపించే వ్యక్తి ఉంటాడు.వాళ్ళు ఈ జాగిలాలను బాధ్యత గా చూసుకుంటూ అవి చేయవలసిన పనులకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు.
జాగిలాల శిక్షణా పాఠశాల:
ఆర్మీ డాగ్‌లు మీరట్‌లోని రీమౌంట్ మరియు వెటర్నరీ కార్ప్స్ సెంటర్ మరియు స్కూల్లో శిక్షణ పొందుతాయి. 1960లో ఈ ప్రదేశంలో జాగిలాల శిక్షణా పాఠశాల ప్రారంభించబడింది. జాగిలాల జాతి మరియు అర్హత ఆధారంగా, వాటిని చేర్చడానికి ముందు వివిధ నైపుణ్య పరీక్షలు చేస్తారు.
జాగిలాల జీతం
జాగిలాలకు సైన్యంలో ర్యాంక్ వస్తుంది, కానీ జీతం ఇవ్వరు. కుక్కలకు ఆహారం మాత్రమే ఇవ్వబడుతుంది, ఇది డాగ్ హ్యాండ్లర్ యొక్క బాధ్యత.ఈ డాగ్ హ్యాండ్లర్లకు మంచి జీతం వస్తుంది.
సైనిక జాగిలాలు ఎంతకాలం సేవలో ఉంటాయి?
ఆర్మీ డాగ్‌లు సుమారు ఎనిమిది సంవత్సరాలు తమ సేవలను అందించిన తర్వాత వాటికి పదవీ విరమణ ఉంటుంది. ఆర్మీ జాగిలాల పదవీ విరమణ తర్వాత వాటిని అనాయాసంగా మార్చే పద్ధతి గతంలో ఉంది. 2015లో RTI ప్రత్యుత్తరం ఈ సమాచారాన్ని అందించడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తర్వాత ఈ విధానాన్ని సవరించారు.
దీనికి సంబంధించి 2016లో ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది, జంతువులను అనాయాసంగా మార్చే విధానాన్ని సవరిస్తున్నామని, కుక్కలకు పునరావాసం కల్పిస్తామని అప్పటి అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ డిక్లరేషన్ సమర్పించారు.ఇకపై ఆర్మీ జాగిలాలు ఇకపై శాశ్వత నిద్రకు గురికావు.
భారతీయ సైనిక జాగిలాలకు ధైర్యానికి ఇచ్చే సత్కారాలు, అలంకరణలు ఉంటాయా?
భారతీయ సైన్యంలో, కుక్కలతో సహా అన్ని జంతువులకు, వాటి శౌర్యానికి మరియు విశిష్ట సేవలకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డ్, వైస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమెండేషన్ కార్డ్ అలాగే జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ కమెండేషన్ కార్డ్‌ను పొందేందుకు అర్హుత కలిగి ఉంటుంది. డాగ్ హ్యాండ్లర్లు కూడా శౌర్య పతకాలకు అర్హులు మరియు వారి కుక్కలతో ఆపరేషన్లలో పాల్గొంటున్నప్పుడు వారు చూపించే ధైర్య సాహసాలకు, శౌర్యానికి శౌర్య చక్ర మరియు సేన పతకాలను అందిస్తారు.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత్ ఆర్మీ యొక్క ప్రత్యేక దళాలు(స్పెషల్ ఫోర్సెస్)
భారత దేశం కొన్ని ప్రత్యేక దళాలను కలిగి ఉంది.మొత్తం మూడు సైనిక,నావికా, వైమానిక దళాలు విడి విడిగా వాటి ప్రత్యేక దళాలను కలిగి ఉన్నాయి.
భారత్ ఆర్మీ పారా ఎస్.ఎఫ్. దళాలను, నావికా దళం మర్కోస్ దళాలను, వైమానిక దళం గార్డ్ కమాండో దళాలను కలిగి ఉన్నాయి. అలాగే ఆర్మీ తో సంబంధం లేని భారత్ హోం శాఖ ద్వారా నడిపే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ మరియు రిసెర్చ్ మరియు ఎనాలిసిస్ సంస్థ యొక్క ప్రత్యేక దళాలు కూడా పని చేస్తున్నాయి.ప్రత్యేక దళాల నుండి ప్రత్యేకమైన నియంత్రణ పద్ధతులు కలిగిన చిన్న సమూహాలు స్పెషల్ ఆపరేషన్స్ డివిజన్ లో నియమింపబడ్డారు.
భారత్ యొక్క నిఘా వ్యవస్థ రిసెర్చ్ మరియు ఎనాలిసిస్ వింగ్ స్పెషల్ గ్రూప్ మరియు స్పెషల్ ఫ్రెంటియర్ గ్రూప్స్ అనే ప్రత్యేక దళాలను కలిగి ఉంటుంది.
భారత్ ఆర్మీ:
పారా ఎస్.ఎఫ్.:
పారా ట్రూపర్స్ లేదా పారా ఎస్.ఎఫ్. అనేది భారత్ ఆర్మీ కి చెందిన ప్రత్యేక దళం.ఇది 1965 పాకిస్థాన్ తో యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఏర్పడింది.1965 లో పాకిస్థాన్ తో యుద్ధం వల్ల అప్పటికప్పుడు మేఘదూత్ ఫోర్స్ అనే పేరుతో ఏర్పాటు చేసిన బెటాలియన్ పారాచూట్ రెజిమెంట్ లో పని చేసే శాశ్వత పారా కమాండో బెటాలియన్ గా ఏర్పడింది.1969 లో యూనిట్ 9 పారా మరియు 10 పారా పేర్లతో రెండు బెటాలియన్ లుగా ఎదిగింది.ఈ యూన
ఈ యూనిట్ మొదటి పోరాటం 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం మొదలైంది.
1988 లో భారత సాయుధ దళాలు వీదేశీ జోక్యం ఉన్న ఏకైక చర్యకు పారా నాయకత్వం వహించి మాల్దీవుల్లో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాయి.ఈ చర్య పేరు ఆపరేషన్ కాక్టస్.అప్పట్లో అక్కడ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ ప్రభుత్వం పైన ఏర్పడిన తిరుగుబాటును అడ్డుకునేందుకు ఈ ఆపరేషన్ కాక్టస్ నిర్వహించారు. 1980ల చివరలో శ్రీలంకలో భద్రతా కార్యకలాపాలు నిర్వహించడానికి హెలికాప్టర్ ల ద్వారా దాడులు చేయడానికి ఆ దేశం లో మోహరించారు.
1990ల నుండి పారా ఎస్.ఎఫ్. కాశ్మీర్ లోని తిరుగుబాటు దారులను అడ్డుకుంటూ ఉగ్రవాదులను అణచివేయడానికి పోరాడుతున్నారు.ఆకస్మిక దాడులు కూడా చేస్తూ ఉంటారు.1999లో కార్గిల్ యుద్ధం లో భాగంగా పాకిస్థాన్ పదాతి దళాలు మరియు ప్రత్యేక దళాలతో తలపడ్డారు.2002 లో సియెర్రా లియోన్ లో ఐక్య దేశాల శాంతి కార్యక్రమాలు నిర్వహించడానికి వెళ్ళి అక్కడ తీవ్రవాదుల చేతుల్లో చిక్కుకుపోయిన 223 మంది 5/8 గోర్ఖా రైఫిల్స్ సైనికులను కాపాడడానికి 2 పారా ఎస్.ఎఫ్. ఆపరేషన్ ఖుఖ్రీ లో పాల్గోన్నారు.అలాగే ఆ తర్వాత మయన్మార్ లోని ప్రతిదాడి చర్య మరియు 2016 సర్జికల్ స్ట్రైక్ లాంటివి ఉన్నాయి.
మెరైన్ కమాండో ఫోర్స్ లేదా మార్కోస్ అనేది 1985 లో మొదటి సారి ప్రారంభమైంది.కానీ 1987 ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో ఎదిగింది.
ఇది భారత నావికా దళానికి చెందిన ప్రత్యేక దళం.అమెరికా నేవీ సీల్స్ మరియు బ్రిటిష్ ప్రత్యేక దళాలు ఈ మార్కోస్ యొక్క మొదటి ముఖ్యమైన వ్యక్తులకు శిక్షణనిచ్చారు.వాళ్ళు సుశిక్షితులైన కొన్ని నెలల తర్వాత జూలై 1987 లో శ్రీలంక లో ఎల్.టి.టి.ఎ. కి వ్యతిరేకంగా పోరాడారు.1990వ దశకంలో ఎల్.టి.టి.ఎ. కి వ్యతిరేకంగా ఆపరేషన్ తాషా,1992లో సోమాలియా కి అక్రమంగా ఆయుధాలను తరలిస్తున్న ఒక ఓడకి వ్యతిరేకంగా ఆపరేషన్ జబర్దస్త్ లాంటి కొన్ని ఆపరేషన్స్ లో పాల్గొంది.అలాగే 1999లో కార్గిల్ యుద్ధం లో పాల్గొంది.1995 నుండి జమ్మూ మరియు కాశ్మీర్ లో శాశ్వతంగా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో పాల్గొంటున్నారు. 2008లో ముంబయి దాడులకు వ్యతిరేకంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తో కలిసి చర్యల్లో పాల్గొన్నప్పటికీ బ్యూరోక్రాటిక్ తప్పు నిర్ణయాల వల్ల వారి ప్రభావం అంతగా లేకుండా పోయింది.అలాగే ఏంటీ-పైరసీ చర్యల్లో కూడా పాల్గొంటుంది.
10 వారాల సుదీర్ఘ ప్రాధమిక శిక్షణ పొందిన తర్వాత మార్కోస్ ని భారత్ ఆర్మీ ప్రత్యేక దళం పారా ఎస్.ఎఫ్. కి పంపుతారు.అక్కడ మూడు వారాల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ లో మార్కోస్ స్కై డైవింగ్, ఆయుధ శిక్షణ, తిరుగుబాటు చర్యలు, కొన్ని భాషలు మరియు వివిధ రకాల భూ ప్రాంతాల్లో యుద్ధాలు చేయడం లాంటి వాటితో పాటు మరికొన్ని విషయాల్లో అత్యాధునిక శిక్షణ పొందుతారు.ప్రతి మార్కోస్ బృందం లోనూ 8 మంది సైనికులు ఉంటారు.ఈ బృందాన్ని ప్రహార్ అని పిలుస్తారు.
మార్కోస్ బాధ్యతలలో కొన్ని:
*భూ మరియు జల బలగాలకు మద్ధతును ఇవ్వడం.
*ప్రత్యేక నిఘా కలిగి ఉండి పర్యవేక్షించడం.
*డైవింగ్ కార్యాకలాపాలు మరియు రైడ్స్ తో సహా శత్రు భూమి లో రహస్యంగా కార్యకలాపాలు నిర్వహించడం.
*ఉగ్రవాద వ్యతిరేక చర్యలు చేపట్టడం.
భారత వైమానిక దళం:
గరుఢ్ కమాండో:
ఈ గరుఢ్ కమాండోస్ అనేది భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక దళం.వీరి కార్యకలాపాలలో ముఖ్యమైనవి ఉగ్రవాద వ్యతిరేక చర్యలు,బంధీలను కాపాడడం, భారత వైమానిక దళానికి సంబంధించిన వస్తువులను కాపాడడం మరియు వివిధ వైమానిక ప్రత్యేక చర్యల్లో పాల్గొనడం లాంటివి.2002 లో మొదటి సారిగా ప్రారంభించినప్పటికీ 2006 ఫిబ్రవరి 6న అధికారికంగా రూపుదాల్చింది.
గరుఢ్స్ అందరూ 52 వారాల శిక్షణని అందించే వాలంటీర్లు.వీటిలో ప్రత్యేక కార్యకలాపాలతో పాటు 3 నెలల పరిశీలన మరియు ప్రాథమిక వాయుమార్గ శిక్షణ మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలు, నిఘా వ్యవస్థ గురించి శిక్షణ ఉంటుంది.ప్రాథమిక శిక్షణ చివరి దశలో గరుఢ్స్ ఆయుధాలను ఉపయోగించడంలో అనుభవం సాధించాలి.ప్రత్యేకమైన ఆయుధాలతో సహా ఆయుధాలు ఉపయోగించడంలో అత్యాధునిక శిక్షణ అందిస్తారు.
నేరుగా పోరాటానికి దిగటం, ప్రత్యేకమైన నిఘా కలిగి ఉండటం, శత్రు భూభాగాలలో చిక్కుకున్న పైలట్లను కాపాడడం, శత్రు భూభాగాలలో ఎయిర్ బేస్ లను ఏర్పాటు చేసి వాటికి ఏ అడ్డంకులు లేకుండా చూడడం వంటి కార్యక్రమాలు ఈ గరుఢ్స్ ఖచ్చితంగా చేయవలసినవి.ఇవేకాక శత్రువుల నుండి జరిగే వాయు మార్గంలో దాడులను తిప్పికొట్టడం మరియు రాఢార్ లు లాంటి శత్రువుల వస్తువులను నాశనం చేయడం, భారత వైమానిక దాడులను చేయడం,లేసర్ డిసిగ్నేటర్ తో ఎయిర్ స్ట్రైక్ చేస్తున్న వారికి దిశానిర్దేశం చేయడం వంటివి కూడా చేయాలి.
IAF ఇన్స్టాలేషన్లు మరియు ఆస్తుల భద్రత సాధారణంగా ఎయిర్ ఫోర్స్ పోలీస్ మరియు డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్ చేత నిర్వహించబడుతుంది, అయినప్పటికీ కొన్ని క్లిష్టమైన ఆస్తులు గరుడ్లచే రక్షించబడతాయి.
సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశాలతో పని చేసే అంతర్గత భద్రత సంస్థ:
నేషనల్ సెక్యూరిటీ గార్డ్:
ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది ప్రత్యేకంగా ఉగ్రవాద దాడులకు ఆకస్మికంగా ప్రతి దాడులు చేసే సంస్థ.ఇది 1986లో అధికారికంగా ప్రారంభమైంది.ఇది బ్రిటిష్ ప్రత్యేక వాయు సేవ మరియు జర్మన్ జి.ఎస్.జి.9 ఆధారితంగా డిసైన్ చేయబడింది.వారి ప్రత్యేకమైన నల్ల దుస్తుల వలన వారిని బ్లాక్ కాట్స్ అని కూడా పిలుస్తారు.
కింది రెండు అంశాలను కలిగి ఉంటుంది,
1.ఎస్.ఎ.జి.(స్పెషల్ ఏక్షన్ గ్రూప్):
ఇది భారత్ ఆర్మీ నుండి సైన్యాన్ని ఎంపిక చేస్తుంది.
2.ఎస్.ఆర్.జి.(స్పెషల్ రేంజర్స్ గ్రూప్):
ఇది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ నుండి సైన్యాన్ని ఎంపిక చేస్తుంది.
స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్:
ఇది మాజీ మరియు ప్రస్తుత ప్రధాన మంత్రులకు వారి కుటుంబాలతో సహా 5 సంవత్సరాల వరకు భద్రతని కల్పించే ప్రత్యేకమైన భద్రతా సంస్థ.ఇది 1985లో ఇందిరా గాంధీ హత్య తర్వాత ప్రత్యేకంగా రూపొందించబడింది.ఇది ప్రత్యేక కార్యకలాపాలు కూడా నిర్వహించగలదు.దాని కోసమే నిష్ణాతులైన ఆయుధాలు కలిగిన సైనికులను కలిగి ఉంటుంది.
పరిశోధన మరియు విశ్లేషణ విభాగం:
స్పెషల్ గ్రూప్:
స్పెషల్ గ్రూప్ అనేది పరిశోధన మరియు విశ్లేషణ విభాగం యొక్క రహస్య ప్రత్యేక దళాల విభాగం. ఇది 1981లో ఏర్పడింది.ప్రత్యేక బృందం యొక్క బాధ్యతలు రహస్య గూఢచార కార్యకలాపాలు మరియు రహస్య కార్యకలాపాలను కలిగి ఉంటాయి, వీటితో భారత ప్రభుత్వం బహిరంగంగా సంబంధం కలిగి ఉండకూడదు.
స్పెషల్ ఫ్రెంటియర్ ఫోర్స్:
స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ అనేది చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి వ్యతిరేకంగా కార్యకలాపాలను చేపట్టేందుకు 14 నవంబర్ 1962న రూపొందించబడిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క రహస్య ప్రత్యేక దళాల విభాగం. ఉత్తరాఖండ్‌లోని చక్రతాలో ఉన్న SFFని ఎస్టాబ్లిష్మెంట్ 22 అని కూడా అంటారు.ఈ దళం ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంచబడింది మరియు తరువాత, భారతదేశం యొక్క బాహ్య గూఢచార సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్.ఇది ప్రధానంగా హిమాలయాలు మరియు టిబెట్‌లోని కఠినమైన భూభాగాలలో కార్యకలాపాలను చేపట్టే బాధ్యత కలిగిన టిబెటన్ ప్రజలను కలిగి ఉంటుంది, దీని ప్రధాన లక్ష్యం చైనా మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య మరొక యుద్ధం జరిగినప్పుడు చైనా సరిహద్దుల వెనుక రహస్య కార్యకలాపాలను నిర్వహించడం.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారతీయ నావికా దళం
భారత దేశాన్ని చుట్టూ ఉన్న సముద్రం నుండి జరిగే దాడుల నుండి కాపాడే దళం ఈ నావికా దళం.దీనికి కూడా అత్యున్నత కమాండర్ గా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు.నావికా దళ ముఖ్య అధికారిగా నాలుగు నక్షత్రాలు కలిగిన అధిపతి కమాండర్ గా ఉంటారు.మన నావికా దళం పర్షియన్ గల్ఫ్ రీజియన్ లో, హార్న్ ఆఫ్ ఆఫ్రికా మరియు మలక్కా జలాలలో వేరే దేశానికి చెందిన ఎవ్వరూ మన జలాలలోకి రాకుండా కాపలా కాస్తూ ఉంటారు, అలాగే మిగిలిన నావికా దళాలతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటారు. అలాగే ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి దక్షిణ మరియు తూర్పు చైనా సముద్రాలలో అలాగే పశ్చిమ సముద్ర జలాల్లో ఒక పెద్దగా సైన్యాన్ని మోహరిస్తూ ఉంటారు.
భారత నావికా దళ ప్రాథమిక బాధ్యత భారత దేశ సముద్ర పొలిమేరలను కాపాడడం, అలాగే శత్రు సైన్యాలతో సమస్యలు వచ్చినప్పుడు వారి ఉచ్చులను పసిగట్టి వారిని ఓడించాలి.మన నావికా దళం శాంతి మరియు యుద్ధం రెండింటినీ ప్రేమిస్తుంది. సమైక్య అభ్యాసాలు,స్నేహ పూర్వక సభలు ఏర్పాటు చేయడం మరియు విపత్తులలో సహాయం అందించడం ద్వారా మిగిలిన దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి ఉంటుంది.
దాదాపుగా 67,252 సర్వీస్ లో ఉన్న సభ్యులతో పాటు 75,000 మంది రిసర్వ్ సభ్యులు ఉన్నారు. అలాగే శక్తివంతమైన 150 షిప్స్ మరియు సబ్ మెరైన్స్ కలిగి,300 ఎయిర్ క్రాఫ్ట్ కలిగి ఉన్నారు.వీటితో బాటు ఆపరేషనల్ ఫ్లీట్ 2 ఎయిర్ కారియర్స్,1 బలమైన రవాణా నౌక, 8 ల్యాండింగ్ షిప్ టాంక్స్,10 డెస్ట్రాయర్స్,13 ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు,1 బాలిస్టిక్ మిస్సైల్ సబ్ మెరైన్,16 సాంకేతికంగా బలమైన సబ్ మెరైన్స్,24 చిన్న యుద్ధ నౌకలు,1 మైన్ కౌంటర్ మెసర్ వెసెల్,4 ఫ్లీట్ టాంకర్స్ మరియు ఇంకెన్నో ఇతర ఫిరంగులు కలిగిన నౌకలు, చిన్న పెట్రోల్ బోట్ లు అలాగే సోఫిస్టికేటెడ్ షిప్స్ ని కలిగి ఉన్నారు.ఇది మల్టీ రీజనల్ శక్తిని ప్రదర్శించగల నీలి జలాల నావికా దళంగా పరిగణించబడుతుంది.
భారత నావికా దళ చరిత్ర
భారత నావికా వ్యవస్థ అనేది 6000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది.మన దేశం లో క్రీ.పూ.2300 సంవత్సరం సింధు నాగరికత సమయంలోనే ఇప్పటి గుజరాత్ లోని మంగ్రోల్ ఓడ రేవు దగ్గర లోథల్ లో మొట్ట మొదటి సముద్ర వాహనం తయారు చేసినట్టు కొన్ని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మన ఋగ్వేదం మన హిందూ దైవం వరుణ దేవుడికి సముద్ర మార్గాలకు సంబంధించిన అవగాహన ఉందని తెలిపింది మరియు మన భారతీయులు వందల పడవలతో యుద్ధాలు చేసాయని కూడా తెలిపింది.అంతేకాదు ప్లవ అనే నామం కల తుఫానుల్లో ఓడలను స్థిరంగా ఉంచే యంత్రం గురించి కూడా తెలిపింది.ప్లవని నేటి తరం స్థిరీకరించే యంత్రాలకు మొట్ట మొదటి యంత్రం గా పేర్కొంటారు. సముద్రం లో దిక్సూచి ని మొట్టమొదట క్రీ.శ.4 లేదా ఐదు సంవత్సరాల లో మత్స్య యంత్ర పేరుతో ఉపయోగించినట్టు చరిత్ర చెబుతోంది.అలాగే భారతీయులు జావా,సుమత్రా దీవులతోనూ,గ్రీకులతోనూ,రోమనులతోనూ విలువైన వజ్రాలు,తోళ్ళు, వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు మొదలైన వ్యాపారాలు చేసేవారు.
క్రీ.శ. 5-10 సంవత్సరాలలో కలింగ రాజ్యం జావా మరియు సుమత్ర దీవులను హస్తగతం చేసుకున్నారు. అండమాన్ మరియు నికోబార్ దీవులు వ్యాపార నౌకలకు ఓడ రేవులుగా పని చేసేవి.క్రీ.శ.984-1042 మధ్యలో రాజ రాజ చోళ 1, రాజేంద్ర చోళ 1 మరియు కులోతంగు చోళ 1 బర్మా, శ్రీలంక,సుమత్ర మరియు మలయ దీవులను గెలిచి సముద్రపు దొంగలను అణచివేసారు.
14 మరియు 15 శతాబ్దాలలో భారతీయ నావికా వ్యవస్థ ఓడలను తయారు చేయడంలో ఎంతో ఉన్నత స్థాయి కి చేరుకుంది.ఒకటి కంటే ఎక్కువ గదులతో తయారు చేయడం మొదలు పెట్టారు.దాని వలన ఒక గది పాడైపోయినా మిగిలిన గదులలో ఉండడానికి వీలు ఉండేది.ఈ రూప రచన మిగిలిన యురోపియన్ కంట్రీస్ కూడా అప్పటికి తయారు చేయలేకపోయాయి.
13వ శతాబ్దం చివరికల్లా భారతీయ నావికా వ్యవస్థ తిరోగమనం ప్రారంభమైంది.దాని అధ్వాన్న స్థితికి చేరుకుంది.అదే సమయంలో పోర్చుగీసు వాళ్ళు భారత దేశానికి చేరుకున్నారు.దేశంలో వారు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.తర్వాత మొత్తం ఆసియా ఓడల పైన దాడులు చేయడం మొదలు పెట్టారు.ఎవ్వరినీ సముద్రాల ద్వారా వ్యాపారాలు చేసుకోడానికి ఆప్పుకునేవారు కాదు.1529 లో ముంబయిలో జరిగిన పోరు వల్ల థానే,కరంజా మరియు బందోరా పోర్టులు తమ హస్తగతం అయ్యాయి.1534 కల్లా మొత్తం ముంబయి పోర్ట్ పైన ఆధిపత్యం సాధించారు.వాస్కోడా గామా ఎప్పుడైతే వ్యాపార ఒప్పందాలను అనుసరించి కట్టవలసిన పన్నులు కట్టడానికి తిరస్కరించాడో జోమరిన్ ఆఫ్ కలకత్తా పోర్చుగీసు వ్యాపారాలను అడ్డుకున్నారు. దీని ఫలితంగా రెండు పెద్ద యుద్ధాలు సముద్రంలో జరిగాయి.ఒకటి 1504 లో కొచ్చిన్ లో జరిగింది.మరొకటి నాలుగేళ్ల తర్వాత దివు లో జరిగింది.ఈ రెండు యుద్ధాలలో భారత్ ఓడిపోయింది.
17వ శతాబ్దం చివరికల్లా మళ్ళీ భారతీయ నావికా వ్యవస్థ పురోగమనం సాధించింది.మొఘలులు మరియు సిద్దీస్ ఆఫ్ జంజీర సంబంధాల వల్ల పశ్చిమ తీర ప్రాంతం లో శక్తివంతంగా ఎదగగలిగారు.
దక్షిణాది లో మరాఠ రాజ్యానికి మొదటి ప్రముఖుడైన ఛత్రపతి శివాజీ మహారాజ్ తన సొంత నావికా వ్యవస్థ ని, నావికా దళాన్ని ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు.వీరి నావికా దళం సిద్ధోజి గుజార్ మరియు కన్హోజీ ఆంగ్రే ఇద్దరి నావికా అధిపతుల సారధ్యంలో నడిచేది.ఆంగ్రే సారధ్యంలోని మరాఠా నావికా దళం ఇంగ్లీష్, పోర్చుగీసు మరియు డచ్ వాళ్ళని కొంకణ్ తీర ప్రాంతం వైపు చూడడానికి కూడా భయపడేలా చేసేవి.కానీ ఎప్పుడైతే 1729 లో ఆయన మరిణించారో ఆ తర్వాత మరాఠా నావికా దళం క్షీణించడం మొదలైంది.
1612 లో ఇంగ్లీష్ వాళ్ళు పోర్చుగీసు వారిని ఓడించినప్పుడు సముద్రపు దొంగలు రెచ్చిపోయేవారు.వారిని ఆపడం కోసం ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటన్ వాళ్ళు నావికా దళాన్ని ఏర్పాటు చేశారు.మొదటి స్క్వాడ్రన్ సెప్టెంబర్ 5,1912 లో గుజరాత్ తీరానికి చేరుకుంది.గల్ఫ్ ఆఫ్ కాంబే మరియు నర్మద,తపతి నదులలో బ్రిటిష్ వ్యాపార నౌకలను కాపాడడం ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత.ఎప్పుడైతే బ్రిటన్ సామ్రాజ్యం భారత్ లో విస్తరిస్తుందో ఈస్ట్ ఇండియా కంపెనీ బాధ్యత కూడా పెరుగుతూ వెళ్ళింది.
తర్వాత 1686 నుండి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయి నుండి ఈస్ట్ ఇండియా కంపెనీ ని నడిపించేవారు.అప్పటి నుండి దాని పేరు బొంబే మెరైన్ గా మార్చబడింది.తర్వాత కాలంలో బాంబే మెరైన్ డచ్,ఫ్రెంచ్,మరాఠా మరియు సిద్ధి నౌకలను తీసుకున్నారు.తర్వాత కాలంలో 1824 లో మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.1834 లో బొంబే మెరైన్ హర్ మెజెస్టీస్ ఇండియన్ నావీగా మారింది.ఇండియన్ నావీ 1840 లో మొదటి ఓపియమ్ వార్ లో,1852 లో రెండవ ఆంగ్లో-బర్మీస్ యుద్ధం లో పాల్గొంది.తర్వాత 1863 నుండి 1877 మధ్యలో మళ్ళీ దాని పూర్వ నామం బోంబే మెరైన్ గా ఉండి మళ్ళీ హర్ మెజెస్టీస్ ఇండియన్ మెరైన్ గా మారింది.ఆ సమయంలో మెరైన్ కలకత్తా లో బంగాళాఖాతం సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో తూర్పు డివిజన్ మరియు బోంబే లో అరేబియన్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో పశ్చిమ డివిజన్ మొత్తం రెండు డివిజన్ లుగా విభజించారు.మళ్ళీ 1892లో రాయల్ ఇండియన్ మెరైన్ గా మారింది.19వ శతాబ్దం చివరికల్లా మొత్తం 50 ఓడలతో పని చేసేది. మొదటి ప్రపంచ యుద్ధం లో పెట్రోల్ బోట్లతో, ట్రూప్ క్యారియర్ తో, మైన్ స్వీపర్ బోట్లతో పాల్గొంది.1928 లో డి.ఎన్.ముఖర్జీ గారు కమిషన్ కి మొదటి భారతీయ ఇంజనీర్ సబ్ లెఫ్టినెంట్ అయ్యారు.
1934 లో మెరైన్ పూర్తి నావల్ ఫోర్స్ గా రూపాంతరం చెందింది. అప్పటి నుండి రాయల్ ఇండియన్ నావీ గా పిలువబడేది.అలాగే బ్రిటన్ ప్రభుత్వానికి విధేయులుగా పని చేస్తున్నట్టు తెలిపే రాజ వర్ణాలు ఉపయోగించేవారు.
రెండవ ప్రపంచ యుద్ద సమయంలో ఐదు స్తంభపు ఓడలు, ఒక సర్వే ఓడ,ఒక సరుకులు రవాణా చేసే ఓడ,ఒక పెట్రోలింగ్ ఓడ మరియు కొన్ని చిన్న చిన్న ఆయుధాలు కలిగిన ఓడలు,114 మంది అధికారులు,1732 మంది నావికులు మాత్రమే కలిగి ఉంది రాయల్ నావీ.
1940 నుండి మనుషులు మరియు వస్తువులు ఈ సంఖ్య రెట్టింపు అవూతూ 1942 నాటికి ఆరు రెట్లు పెరిగింది.నావీ చాలా హిందూ మహా సముద్రంలో చాలా ఎక్కువగా ఆపరేషన్స్ చేస్తుంది.యుద్ధ సమయాల్లో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. 1945 నాటికి ఏడు స్తంభపు ఓడలు, నాలుగు ఫిరంగులు కలిగిన యుద్ధ నౌకలు, నాలుగు చిన్న యుద్ధ నౌకలు,14 మైన్ స్వీపర్స్,14 పడవలు, రెండు డిపో షిప్స్,30 సహాయక నౌకలు,30 ఆగ్జిలరీ నౌకలు, 150 నౌకలు,200 ఓడరేవు దగ్గర ఉండే చిన్న నౌకలు మరియు మరికొన్ని అఫెన్సివ్, డిఫెన్సివ్ మోటార్ లాంఛర్స్ సమకూర్చుకుంది.
1945 వరకు నావికా దళం లో భారతీయులు ఇంజనీరింగ్ కమాండర్ స్థాయి కంటే పై స్థాయి కి ఎవ్వరూ వెళ్ళలేదు.1946 లో భారతీయులు భారతీయ నావికా వ్యవస్థ కి వ్యతిరేకంగా 78 ఓడలు,20 తీర ప్రాంతాలలో 20000 మంది నావికులతో స్ట్రైక్ చేసారు.స్ట్రైక్ మొదలైన తర్వాత కమ్యూనిస్టు పార్టీ సపోర్ట్ చేసింది.కానీ భారత్ ఆర్మీ దగ్గర నుండి కానీ, మిగిలిన రాజకీయ పార్టీలు కాంగ్రెస్ నుండి కానీ,యం.ముస్లీం లీగ్ నుండి కానీ అస్సలు సపోర్ట్ లభించలేదు.తర్వాత ఈ స్ట్రైక్ విఫలమైంది.1947 జూలై 21న H.M.S.ఛౌదరీ మరియు భాస్కర్ సదాశివ సోమన్ ఇద్దరూ పాకిస్థాన్ మరియు భారత నావికా దళాలుగా ఆఫీసర్లు అయ్యారు.
1947 తర్వాత భారత్ మరియు పాకిస్థాన్ విడిపోయాయి.21 శాతం నావికా అధికారులు మరియు 47 శాతం నావికులు పాకిస్థాన్ నావికా దళం లో పని చేయడానికి మొగ్గు చూపారు.32 ఓడలు మరియు 11,000 మంది ఉద్యోగస్తులు భారత్ కి వచ్చారు.అదే రోజున బ్రిటీషు అధికారులు మొత్తం పదవీ విరమణ తీసుకొన్నారు.వారి స్థానాల్లో భారతీయులు వచ్చారు. 1948 జనవరిలో D.N.ముఖర్జీ మొట్ట మొదటి ఇంజనీరింగ్ కెప్టెన్ గా ప్రమోట్ అయ్యారు.1948 మే లో కెప్టెన్ అజితేందు చక్రవర్తి కమోడోర్ ర్యాంక్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాడు.1950 జనవరి 26న భారత్ గణతంత్ర దేశం అయిన తర్వాత రాయల్ అనే పేరును తొలగించి ఇండియన్ నావీ గా నామకరణం చేశారు.ఓడల పేర్లు కూడా హిస్ మెజిస్టీస్ షిప్ నుండి ఇండియన్ నావల్ షిప్స్ గా మారాయి.అదే సమయంలో ఇంపీరియల్ క్రౌన్ గుర్తు తొలగించి లయన్ కేపిటల్ ఆఫ్ అశోక ను చేర్చారు.వైట్ ఎన్సైన్ లోని యూనియన్ జాక్ స్థానంలో భారతీయ తిరంగాని చేర్చారు.