NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత వైమానిక దళ చరిత్ర
మన త్రివిధ దళాలలో ఒకటైన వైమానిక దళం ప్రపంచంలోనే మూడవ బలమైన, సమర్ధవంతమైన వైమానిక దళం గా పేరు పొందింది.ఇది భారత గగన తలాన్ని కాపాడుతూ యుద్ధ సమయంలో అవసరమైనప్పుడు శత్రు సేనల పైన దాడి చేస్తుంది.
1932 అక్టోబర్ 8న బ్రిటీష్ ప్రభుత్వం ప్రపంచ యుద్ద సమయంలో సహాయక వైమానిక దళంగా ఏర్పాటు చేశారు.అప్పుడు రాయల్ అనే పేరుతో ఈ వైమానిక దళాన్ని ఏర్పాటు చేశారు.
భారత వైమానిక దళం 1932 అక్టోబర్ 8న బ్రిటీష్ ప్రభుత్వం ద్వారా ఆవిష్కరించబడింది.1932 భారత వైమానిక చట్టం ద్వారా రాయల్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం, బాడ్జీలు, చిహ్నాలు మరియు పత్రాలు ఆపాదించడం జరిగింది. 1933 ఏప్రిల్ 1న మొదటి స్క్వాడ్రన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు వెస్ట్ ల్యాండ్ వాపితి బైప్లాన్ మరియు 4 భారత పైలట్లతో ఈ స్క్వాడ్రన్ ఏర్పాటు జరిగింది. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఆఫీసర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ సిసిల్ బోచియర్ ఈ పైలట్లను ఎంపిక చేశారు.
watch airforce day celebrations live
2వ ప్రపంచ యుద్ధం:
రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మొట్టమొదటి ఎయిర్ స్ట్రైక్ లోనే జపాన్ ఆర్మీని బర్మాలోనే ఆపడం లో భారత వైమానిక దళం ప్రముఖ పాత్ర వహించింది.ఈ మొదటి ఎయిర్ స్ట్రైక్ యొక్క లక్ష్యం ఆరకన్ లోని జపనీస్ మిలట్రీ బేస్. దాని తర్వాత వరుసగా నార్త్ థాయ్లాండ్ లోని ఛియాంగ్ రాయ్, మే హోంగ్సన్ మరియు ఛియాంగ్ మయ్ పైన దాడులు కొనసాగించారు.
యుద్ధ సమయంలో స్థిరంగా విస్తరించింది.అమెరికా లో తయారు చేసిన వుల్టీ వెంజెన్స్,డగ్లాస్ డకోటా,ద బ్రిటీష్ హాకర్ హరికేన్, సూపర్ మెరైన్ స్పిట్ ఫైర్ మరియు వెస్ట్ లాండ్ లిసేండర్ తో కలిపి కొత్త ఎయిర్ క్రాఫ్ట్ జతపడింది.
పరాక్రమవంతమైన భారత వైమానిక దళానికి గుర్తుగా కింగ్ జార్జ్ VI రాయల్ అనే పేరును ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి ముందు పెట్టారు.అప్పటి నుండి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గా పిలవబడేది.1950 లో భారత దేశం రిపబ్లిక్ గా ఏర్పడిన తర్వాత రాయల్ అనే పేరును తొలగించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనే పేరును పెట్టడం జరిగింది.
స్వాతంత్ర్యానంతర మార్పులు:
1947 లో స్వతంత్ర భారతం ఏర్పడిన తర్వాత దేశాన్ని రాష్ట్రాలుగా ఏర్పాటు చేసి పాకిస్థాన్ ని,భారత దేశాన్ని భౌగోళికంగా రెండు దేళాలుగా విభజించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని కూడా రెండు దేశాలకి విభజించారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గి ఉంచారు.కానీ 10 ఆపరేషనల్ స్క్వాడ్రన్స్ లో మూడు పాకిస్థాన్ కి ఇచ్చారు. ఇవి పాకిస్థాన్ బోర్డర్ లో ఉండేవి.పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ రాయల్ పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ గా మార్చబడింది.తర్వాత అశోక చక్ర ని అనుసరించి రౌండల్ ని తయారు చేసారు.
1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాయల్ అనే పేరును తీయకుండానే డొమెనియన్ ఆఫ్ ఇండియా పేరును చేర్చి వైమానిక దళానికి నామకరణం చేశారు.కానీ 1950 లో ప్రభుత్వం మారినప్పుడు రాయల్ అనే పేరును పూర్తిగా తొలగించారు.
1950 నుండి ఇప్పటి వరకు మొత్తం పాకిస్థాన్ తో నాలుగు యుద్ధాల్లో మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అప్పగించిన అనేక ఆపరేషన్స్ లో పాల్గొంది.భారతీయ వైమానిక దళం తన పరిధిని శత్రు సేనలకు అందనంతగా పెంచుకుంది. అనేక సందర్భాల్లో ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో శాంతి ని పరిరక్షించే కార్యిలలో పాల్గొంది.
భారత వైమానిక దళం-దాని స్వరూపం:
వైమానిక దళానికి ముఖ్య అధికారిగా ఎయిర్ చీఫ్ మార్షల్ నాలుగు స్టార్లను కలిగి ఉంటారు. అతను భారతీయ వైమానిక దళం చేపట్టే ఎన్నో పెద్ద పెద్ద ఆపరేషన్స్ నిర్వహించడానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.చరిత్రలో ఒకే ఒక్క సారి 26 జనవరి 2002 లో భారత రాష్ట్రపతి ఇండియన్ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ కి ఫైవ్ స్టార్ ర్యాంక్ ని ఇవ్వడం జరిగింది. అతను భారతీయ వైమానిక దళం లో ఐదు స్టార్ల ర్యాంకు ని పొందిన ఒకే ఒక్క ఎయిర్ మార్షల్ గా నిలిచాడు.
అక్టోబర్ 8న భారత వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటారు.
1947 సాయుధ బలగాల చట్టం, భారత రాజ్యాంగం మరియు భార్ వైమానిక దళ చట్టం దృష్ట్యా భారత వైమానిక దళం భారతదేశం యొక్క ప్రతి ఒక్క భాగం కాపాడడానికీ, యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉండడం మరియు యుద్ధం తర్వాత అక్కడ ఉన్న బలగాలను తిరిగి అక్కడ నుండి తీసుకుని వెళ్ళడం వంటి కార్యక్రమాలు చేపట్టాలి. సాయుధ బలగాలతో కలిసి దేశాన్ని కాపాడుతూనే దేశ గగన తలాన్ని రక్షించాలి.యుద్ధ భూమిలో ఆర్మీకి వ్యూహాత్మకంగా సహాయపడడమే కాకుండా లాజిస్టిక్ మరియు ఎయిర్ లిఫ్టింగ్ లాంటి విషయాలలో సహాయపడుతూ ఉండాలి.
ADVERTISEMENT
PHILIPS BT1232/15 Skin-friendly Beard Trimmer - DuraPower Technology, Cordless Rechargeable with USB Charging, Charging indicator, Travel lock, No Oil Needed, Blue.
Save Extra with 4 offers
మంచి ఫిలిప్స్ బ్రాండెడ్ ట్రిమ్మర్ తక్కువ ధరలో పొందడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ద్వారా పౌర రన్ స్పేస్ ఎక్సప్లొరేషన్ మరియు మిలిటరీ ఫాకల్టీ కలిసి సైన్యం అంతరిక్ష పరిశోధనలో ఆవిష్కరణల నుండి మంచి ఫలితాలను పొందుతారు.ఈ ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ ని భారత సాయుధ దళాలు, పౌర అంతరిక్ష విభాగం మరియు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహిస్తాయి.
భారత వైమానిక దళం సమర్ధవంతమైన మరియు కఠిన శిక్షణలు పూర్తి చేసుకున్న పైలట్లను మరియు సిబ్బంది ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగి ఉండి సమర్ధవంతంగా పని చేస్తాయి.రెస్క్యూ మరియు కార్గో విమానాల ద్వారా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు వేగవంతంగా చేపడతారు, వారికి కావలసిన సామాగ్రిని అందిస్తారు.ఇలా ఎన్నోసార్లు తుఫాన్, సునామీ మరియు వరదల సమయంలో సహాయక చర్యలు చేపట్టారు. మన దేశం లోనే కాక శ్రీలంక లో రెయిన్ బో వంటి సహాయ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటారు.
భారత వైమానిక దళాన్ని ఐదు ఆపరేషనల్ కమాండ్స్ మరియు మూడు ఫంక్షనల్ కమాండ్స్ గా విభజించారు.ఆపరేషనల్ కమాండ్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఉపయోగించుకుని తమ పరిధిలో మిలట్రీ ఆపరేషన్స్ నిర్వహించాలి.యుద్ధానికి అన్నీ సిద్ధం చేయడం ఫంక్షనల్ కమాండ్స్ యొక్క బాధ్యత.ట్రయినింగ్ కమాండ్ బెంగళూరు పరిధిలోని హైదరాబాద్ లో గయిర్ ఫోర్స్ అకాడమీ లో ప్రాధమిక శిక్షణని నిర్వహిస్తారు.దాని తర్వాత వివిధ స్కూల్స్ లో ఆపరేషనల్ శిక్షణ పూర్తి చేయాలి.కమాండ్ పొసిషన్ కోసం ఆధునిక ఆఫీసర్ ట్రయినింగ్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో నేర్పుతారు.ప్రత్యేకమైన అత్యాధునిక ఫ్లైట్ శిక్షణ కేంద్రాలు బీదర్, కర్ణాటక మరియు హకీంపేట, తెలంగాణ లో ఉన్నాయి.టెక్నికల్ స్కూల్స్ దేశం లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి.
సెంట్రల్ ఎయిర్ కమాండ్(CAC):
*ఇది ప్రగ్యారాజ్, ఉత్తర ప్రదేశ్ లో ఉంది.
ఈస్ట్రన్ ఎయిర్ కమాండ్ (EAC):
*ఇది షిల్లాంగ్,మేఘాలయ లో ఉంది.
సౌతర్న్ ఎయిర్ కమాండ్(SAC):
*తిరువనంతపురం, కేరళ లో ఉంది.
సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్(SWAC):
*గాంధీ నగర్, గుజరాత్ లో ఉంది.
వెస్టర్న్ ఎయిర్ కమాండ్ (WAC):
*న్యూఢిల్లీ లో ఉంది.
ట్రయినింగ్ కమాండ్ (TC)+:
బెంగళూరు, కర్ణాటక లో ఉంది.
మెయింటనెన్స్ కమాండ్(MC)+:
నాగపూర్, మహారాష్ట్ర లో ఉంది.
వింగ్స్:
స్క్వాడ్రన్ మరియు కమాండ్ కి మధ్య సమన్వయకర్తగా పని చేసేదే ఈ వింగ్.సాధారణంగా ఒక ఫార్వార్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ల(FBSU)తో బాటు రెండు లేదా మూడు భారత వైమానిక స్క్వాడ్రన్ మరియు హెలికాప్టర్ యూనిట్లు ఉంటాయి. ఈ FBSU ఎప్పుడూ స్క్వాడ్రాన్ యూనిట్లు కానీ, హెలికాప్టర్ యూనిట్లు కానీ సొంతంగా నిర్వహించదు.కానీ సాధారణ ఆపరేషన్స్ లో విమాన నిర్వహణ ఆధారంగా పని చేస్తుంది.యుద్ధ సమయాల్లో మాత్రం పూర్తి ఆధారంగా మారి స్క్వాడ్రాన్స్ ని నడిపిస్తాయి.మొత్తమ్మీద 47 వింగ్స్ మరియు 19 FBSU లు భారత వైమానిక దళం తో బాటు ఉన్నాయి. వింగ్స్ అనేవి ఎయిర్ కమాండర్ ద్వారా నిర్వహించబడతాయి.
స్టేషన్స్:
ప్రతి ఆపరేషనల్ కమాండ్ దగ్గర ప్రతి చోటా ఉంటాయి.దాదాపుగా తొమ్మిది నుండి పదహారు స్టేషన్ లు లేదా బేసెస్ లు ఉన్నాయి.వింగ్స్ కంటే చిన్నవే, కానీ దాదాపుగా వాటి లాగానే పని చేస్తాయి.స్టేషన్స్ అనేవి గ్రూప్ కెప్టెన్ ల ద్వారా నిర్వహించబడే స్థిరంగా ఉండే యూనిట్లు.ఒక స్టేషన్ కి దాదాపుగా ఒక వింగ్ మరియు ఒకటి లేదా రెండు స్క్వాడ్రన్ లు కలిపి ఉంటాయి.
ADVERTISEMENT
Pigeon Amaze Plus Electric Kettle (14289) with Stainless Steel Body, 1.5 litre, used for boiling Water, making tea and coffee, instant noodles, soup etc. 1500 Watt (Silver)
స్క్వాడ్రన్స్ మరియు యూనిట్స్:
స్క్వాడ్రన్స్ అనేవి స్థిరంగా ఉండే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫీల్డ్ యూనిట్లు.ఎగిరే స్క్వాడ్రన్స్ అనేవి ఎయిర్ ఫోర్స్ ఇచ్చే పనులను పూర్తి చేసే వైమానిక దళ స్టేషన్ యొక్క సబ్ యూనిట్లు.ఫైటర్ స్క్వాడ్రన్ అనేది దాదాపు 18 ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంటుంది.అన్ని ఫైటర్ స్క్వాడ్రన్ లు వింగ్ కమాండర్ ర్యాంక్ ఉన్న కమాండింగ్ ఆఫీసర్ ద్వారా నిర్వహించబడతాయి.కొన్ని రవాణా స్క్వాడ్రన్ లు మరియు హెలికాప్టర్ యూనిట్లు మాత్రం గ్రూప్ కెప్టెన్ ర్యాంక్ ఉన్న కమాండింగ్ ఆఫీసర్ ద్వారా నిర్వహించబడుతాయి.
ఫ్లైట్స్:
ఫ్లైట్స్ అనేవి స్క్వాడ్రన్ యొక్క ఉప విభాగం.దీనిని స్క్వాడ్రన్ నాయకుడు నిర్వహిస్తాడు.ప్రతి ఫ్లైట్ రెండు సెక్షన్లు కలిగి ఉంటుంది.
సెక్షన్:
అతి చిన్న విభాగం ఈ సెక్షన్.ఫ్లైట్ లెఫ్టినెంట్ దీన్ని నిర్వహిస్తాడు.ప్రతి సెక్షన్ 3 ఎయిర్ క్రాఫ్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ క్రమ రూపంతో భారత వైమానిక దళం అనుదినం తమ ఆపరేషన్స్ కోసం చాలా సర్వీస్ బ్రాంచీలను కలిగి ఉంటుంది.అవి:
*ఫ్లైయింగ్ బ్రాంచ్:
ఫ్లైయింగ్
*టెక్నికల్ బ్రాంచ్:
ఇంజనీరింగ్
*గ్రౌండ్ బ్రాంచ్:
లాజిస్టిక్స్
అడ్మినిస్ట్రేషన్
అకౌంట్స్
ఎడ్యుకేషన్
మెడికల్ &డెంటల్
మెటీరియలాజికల్
#airforce #indianairforce #aboutairforce #telugupeople #telanganapeople #andrapradesh #telangana #indianarmy #indianarmylovers #armyweapons #airforceday #airforcedaycelebrations
#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana