NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
గోవా ఇంక్విజిషన్ (విచారణ)
గోవా పురాతన హిందూ రాజ్యాలచే స్థాపించబడింది మరియు నిర్మించబడింది మరియు కదంబ రాజవంశం యొక్క రాజధానిగా పనిచేసింది.గోవాని పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నప్పుడు అక్కడ హిందువులను మతం మార్చడానికి వారిని చిత్ర హింసలకు గురి చేసారు.అలా మారని వారిని విచారణ (ఇంక్విజిషన్) పేరు తో చిత్ర హింసలకు గురి చేసి చూపేవారు.దానినే గోవా ఇంక్విజిషన్ (విచారణ) అంటారు.దీనికి వాస్కోడాగామా కాలికట్ కి చేరుకున్నప్పుడు బీజం పడింది.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాస్కోడాగామా భారతదేశం చేరుకోవడం
15వ శతాబ్దం లో పోర్చుగల్ వారు తూర్పు మసాలా వ్యాపారంలో తమ ఉనికి కోసం ఆరాటపడతారు.కానీ అప్పటికే మమ్లుక్స్ మరియు ఒట్టొమన్ సామ్రాజ్యాల నుండి లవంగాలు, దాల్చిన చెక్క , జాజికాయ, మిరియాలు మరియు అల్లం లాంటి మసాలాలను దిగుమతి చేసుకుంటున్న వెనిస్ వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
పోర్చుగల్ రాజు మాన్యుయల్ ఈ సుగంధ ద్రవ్యాలకు మార్గాలను కనుక్కోమని వాస్కోడాగామ ని అప్పగించారు.గామా నాలుగు అత్యుత్తమ నౌకలతో కూడిన స్క్వాడ్రన్ లతో కొన్ని సంవత్సరాల వ్యాపార వస్తువులతో 1497 జులై 8న బయలుదేరాడు.వారు దారి తప్పి 95 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత హెలెనా బే వద్ద 125 మైళ్ళ దూరంలో భూమి పైకి చేరుకున్నారు.
అయితే అప్పటికే గామా మరియు అతని సిబ్బంది మొత్తం స్కర్వీ వ్యాధి బారిన పడ్డారు.వాస్కోడాగామా ఆఫ్రికా లోని మొజాంబిక్ చేరినప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న చౌకైన వస్తువులను అమ్మడానికి కొంత మంది వ్యాపారులతో మాట్లాడుతున్నాడు. ముందు వారు సుముఖత చూపించినప్పటికీ అతని వస్తువులలో నాణ్యత లేని కారణంగా అక్కడ వ్యాపారులతో తీవ్ర అవమానాలకు గురయ్యారు.అయితే ఇదే సమయంలో సముద్రంలో తిరుగుతుంటే గుజరాతీలు దారి చూపించారనీ వారి నౌకలు గామా నౌకల కంటే మూడు నాలుగు రెట్లు పెద్దగా ఉన్నాయనీ, వాటిని చూసి గామా ఆశ్చర్యపోయాడనీ కొంత మంది రాసారు.
మారిషస్ లో జరిగిన 5వ ప్రపంచ తమిళ మహా సభలో ఒక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం
వాస్కోడాగామా దక్షిణాఫ్రికా లో తమిళ నావికుడైన కనక్కన్ అనే అతని సహాయం కోరాడు.ఆ కనక్కన్ అనే వ్యక్తి సహాయం వల్లనే అతని మార్గ నిర్దేశకత్వంలో వాస్కోడాగామా కేరళ తీరానికి చేరుకోగలిగాడు.నిజానికి అప్పటికే తమిళులకు అన్ని సముద్ర మార్గాలూ తెలుసు.ఎందుకంటే అప్పటికే మెసొపొటేమియా లాంటి సుదూర ప్రాంతాలకు కూడా సముద్ర మార్గం లో వ్యాపారాలు చేసేవారు.
1498 మే 18న 28 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత వాస్కోడాగామ మొట్టమొదటి సారిగా ఇప్పటి కోజికోడ్ లో అడుగు పెట్టాడు. భారత దేశం లో అడుగు పెట్టిన మొదటి యురోపియన్ గా చరిత్ర గామ గురించి చెప్తుంది.
అయితే ఆ సమయంలో తుఫానులు రావడంతో నావికుడు తీరాన్ని చూడలేకపోతున్నారు.అప్పుడు 4 పడవలు వారి దగ్గరకు వచ్చి వారిని తీరానికి తీసుకొని వెళ్ళారు.గామా తాము సుగంధ ద్రవ్యాల కోసం ఇక్కడికి వచ్చామని చెప్పారు.
వాస్కోడ గామ వారిని ముందు క్రైస్తవులు అనుకున్నాడు.అక్కడి వారి గురించి వివరిస్తూ ముదురు గోధుమ రంగులో ఉండే క్రైస్తవులు అక్కడ నివసిస్తున్నారు.వారు కింద ఒక వస్త్రాన్ని కట్టుకుని ఉన్నారు.పైన నగ్నంగా వదిలేసారు.కానీ బాగా బంగారాన్ని ధరించారు. పేదవారు మాత్రం బంగారాన్ని ధరించలేదు. అందరూ శిరోముండనం చేయించుకుని వెనక మాత్రం కొంత జుట్టు (శిఖ) ఉంచుకున్నారు. స్త్రీలు పొట్టిగా ఉన్నారు అంటూ చెప్పాడు.అలాగే దేవి తల్లి ఆలయాన్ని చూసి మేరీమాత ఆలయంగా భావించాడు.
ఆ రాత్రి వారు తమ ఓడల్లో నిద్రించారు. ఉదయాన్నే లేచి మంచి దుస్తులు ధరించి 13 మంది బృందం తో కలిసి గామా కపువోలా అనే పట్టణానికి చేరుకున్నారు.అక్కడ వారు వెన్న మరియు ఉడికించిన చేపలతో అన్నం తిన్నారు. చివరికి గామా రాజ్యం యొక్క పాలకుడు జామోరిన్ కోర్టు కు చేరుకున్నారు.
రాజు సగం నగ్నంగా బంగారు ఆభరణాలు ధరించి,సంపన్నవంతుడిలా కనిపిస్తున్నాడు.చేతిలో బంగారు గిన్నె,దానిలో తమలపాకులు కనిపిస్తున్నాయి.రాజు చుట్టూ ఆ బంగారు గిన్నెలు, తమలపాకులు అమర్చబడి ఉన్నాయి.వాస్కోడగామని చూసిన వెంటనే రాజు నమస్కరించి ఒక కుర్చీని ఇచ్చి, తినడానికి పండ్లు ఇచ్చారు.
తాను పోర్చుగల్ నుండి సుగంధ ద్రవ్యాలు దొరికే రాజ్యాలు వెదుక్కుంటూ వచ్చాననీ,ఆ రాజ్యాలను కనుక్కోకుండా వెనక్కి వెళ్తే తన తల తీసివేయబడుతుందని చెప్పాడు.
డా గామా రాజుకు పన్నెండు చారల గుడ్డ, నాలుగు సింధూర వర్ణ టోపీ, ఆరు టోపీలు, నాలుగు పగడపు తీగలు, ఆరు చేతులు కడుక్కునే బేసిన్లు, ఒక పంచదార బస్తా, రెండు పీపాల నూనె మరియు రెండు తేనె సీసాలను అందించాడు.
రాజు వాటిని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలంతా అతనిని చూసి నవ్వారు.ఎందుకంటే రాజు ఇతరుల నుండి బంగారం తప్పితే మరేమీ తీసుకోడు.ఆఖరికి తన రాజ్యంలోని పేదలు కూడా వాటిని ఇవ్వరు. దాంతో గామా అక్కడ నుండి నిరాశతో తమ నౌకల వద్దకు వెళ్ళిపోయాడు.
మళ్ళీ గామా జామెరిన్ దగ్గరకు వెళ్ళాడు. జామెరిన్ మీరు నిజంగా సంపన్న దేశం నుండి మాకోసం వస్తే ఏం తీసుకొని రాకుండా ఎందుకొచ్చారని అడిగారు.
మా రాజు కేవలం భారతదేశాన్ని కనుక్కోమని మాత్రమే మిమ్మల్ని పంపించారు. అందువల్ల మీ కోసం మేం ఏం తీసుకొని రాలేకపోయాం అని చెప్పారు.
జామెరిన్ మీ దేశంలో ఏం దొరుకుతాయని అడిగాడు.
దానికి వాస్కోడా గామా మొక్క జొన్న,వస్త్రం,కంచు, ఇనుము దొరుకుతాయనీ, తన దగ్గర వాటి నమూనాలు ఉన్నాయనీ,తమరు ఆదేశిస్తే మా దేశం నుంచి వాటిని తీసుకుని రావడానికి మనుషుల్ని పంపుతాడనీ చెప్పారు.
కానీ జామెరిన్ రాజు వద్దని చెప్పారు.కానీ తమ రాజ్యంలోని వస్తువులను మాత్రం మంచి ధరకు ఇస్తానని చెప్పారు.దాంతో వాస్కోడ గామ అతని మనుషులు సంతోషంగా వెనుదిరిగిరు.
చివరిగా తమ వద్ద ఉన్న వస్తువులను అతి తక్కువ ధరలకు అంటే 100 రూ. వస్తువులను 10 రూ. కే అమ్ముకుని ఆ ధనంతో ఇక్కడ వస్తువుల నమూనాలను తీసుకొని అప్పటి పోర్చుగల్ మొదటి రాజు మాన్యుయాల్
కు చూపించడానికి తీసుకొని వెళ్ళారు.భారతదేశానికి మార్గం కనిపెట్టినందుకు వాస్కోడగామాకు తమ రాజ్యం లో ఘన స్వాగతం లభించింది.
సంతోషంగా పోర్చుగల్ వచ్చి తమ రాజు మరియు రాణి లకు తమ పర్యటన గురించి వివరించారు.తను తెచ్చిన కొద్ది పాటి సుగంధ ద్రవ్యాలు తమ రాజుకి ఒక గొప్ప భవిష్యత్తుని, భారతావనికి అత్యంత దుర్భర పరిస్థితిని తీసుకొని వచ్చాయి.
భారత దేశం పైన దాడి చేసి ఆక్రమించుకోవడం
వాస్కోడాగామా పోర్చుగల్ కి తిరిగి వచ్చిన తరువాత హిందూ మహాసముద్రం ఓడ రేవులను అయితే చర్చల ద్వారా లేదా బలవంతంగా తమ ఆధీనంలో తెచ్చుకోవాలని అనుకున్నారు.
దీని కోసమే పెడ్రో అల్వారిస్ కాబ్రోల్ నాయకత్వం లో 13 ఓడల ఒక పెద్ద నౌకాదళం 9 మార్చి 1500న బయలుదేరింది.జామెరిన్ ను తమకు అనుగుణంగా పనిచేసేలా ఒప్పించమనీ అలాగే సరుకుతో ఉన్న ఓడని తీసుకొని రమ్మని పంపించారు.అలాగే మత మార్పిడి చేయడానికి ఫ్రాన్సిస్కన్ మిషనరీ బృందాలను అక్కడికి పంపాలని కూడా చెప్పారు.
వారు ముందుగా మలింది వెళ్ళి అక్కడ నీటిని మరియు తాజా ఉత్పత్తులను తీసుకొని భారత్ వైపు బయలురారు.సెప్టెంబర్ 13న వారు కాలికట్ చేరుకుని జామెరిన్ కి విలాసవంతమైన బహుమతులు మరియు కింగ్ మాన్యువల్ నుండి ఒక లేఖ తీసుకొని వచ్చారు.చర్చలు విజయవంతమయ్యాయి.అతను సుగంధ ద్రవ్యాలు శుద్ధి చేసే కర్మాగారాన్ని నెలకొల్పడానికి అనుమతి పొందాడు.అయితే ఒకేసారి సుగంధ ద్రవ్యాలతో నిండిన అరబ్ వ్యాపారి నౌకను స్వాధీనం చేసుకోవడం తో మొత్తం మారిపోయింది.దాంతో కాబ్రిల్ మరియు అరబ్బుల మధ్య ఘర్షణకు దారి తీసింది.కాలికట్ తీరం వెంబడి బాంబు దాడులు కూడా జరిగాయి.వెంటనే కాబ్రెల్ కొచ్చిన్ కి పారిపోయి అక్కడ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.కానీ జామెరిన్ తన మీదకు 80 యుద్ధ నౌకలను పంపుతున్నాడని తెలుసుకుని అక్కడ నుండి లిస్బన్ కు పారిపోయాడు.
కానీ పోర్చుగల్ రాజు కి హిందూ మహాసముద్రం లో తన ఆధిపత్యాన్ని చెలాయించాలని మళ్ళీ వాస్కోడా గామా ని ఆఫ్రికా సుల్తానులను మరియు కాలికట్ జామెరిన్ ని తమ శక్తి కి తల వంచేలా చేయమని 10 నౌకలతో పంపారు.
వాస్కోడా గామ ఆఫ్రికా ముస్లిం ఓడ రేవుల పైన దాడిని ఆరంభించి, వారిని భయపెట్టి స్వాధీనం చేసుకున్న తర్వాత,ఒక అరబ్ నౌకని స్వాధీనం చేసుకుని దానిలోని యాత్రికులందర్నీ చిన్న పిల్లలతో సహా కాల్చేసారు.తర్వాత అతను కాలికట్ లోని జామెరిన్ పైన దాడి చేయడానికి బయలుదేరారు.
గామా జామెరిన్ భయపెట్టడానికి ఒక ప్రధాన పూజారిని ఎత్తుకెళ్లి పెదవులు, చెవులు కోసి,కుక్క చెవులను కుట్టాడు.నౌకల్లో ఉన్న మరెంతో మంది ముక్కు, చెవులు కోసి వాటిని జామెరీన్ వద్దకు పంపాడు.కాలికట్ ఓడ రేవుల పైన బాంబు దాడులు చేశారు.గామా తన నౌకలతో వెనుతిరిగి పారిపోతుంటే పట్టుకోడానికి జామెరిన్ నౌకలను పంపారు.కానీ గామా కొచ్చిన్ మరియు కాననూర్ తీరాల్లో సుగంధ ద్రవ్యాలను తన ఓడలోకి ఎక్కించుకొని వెళ్తూ వెళ్తూ మలబార్ తీరం వెంబడి దాడులు చేస్తూ, అనేక ముస్లిం ఓడలను దోచుకుంటూ వెళ్ళాడు.కానీ జామెరీన్ ని ఓడించడంలో మళ్ళీ విఫలమయ్యాడు.
1505 లో కింగ్ మాన్యుయెల్ హిందూ మహా సముద్రంలో తన శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి 22 ఓడలు,1000 మంది నావికులు మరియు 1500 మంది సైనికులతో ఫ్రాన్సిస్కో డి అల్మెయిడా భారతదేశ వైశ్రాయ్ గా నియమించబడ్డాడు. అయితే అల్మెయిడా ఆఫ్రికా మరియు భారత తీరం వెంబడి ముస్లిం వ్యాపారుల పైన దాడులు చేస్తూ కోటలు నిర్మించారు.ఆఫ్రికా తీరం లో 1000 మైళ్ళ విస్తీర్ణంలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు.అక్కడ నుండి కొచ్చిన్ కి బయలుదేరాడు.అక్కడ కొన్ని పోరాటాలు జరిగాయి.ఈ పోరాటాల్లో వైస్రాయ్ కొడుకు మరణించాడు.
2 ఫిబ్రవరి 1409న వైశ్రాయై తన బలగాలతో ఈజిప్టు మరియు భారత సంకీర్ణాన్ని దెబ్బ తీసి, దొరికిన ఈజిప్టు బందీలను సజీవ దహనం చేశారు.కొంత మందిని ఉరి తీసి చంపారు.మొత్తానికి అల్మెడా హిందూ మహాసముద్రం లో పోర్చుగీసు ఆధిపత్యాన్ని విజయవంతంగా నెలకొల్పాడు.కానీ వారికి మొత్తం నావికా వ్యవస్థ ని చూసుకోడానికి ఒక నావికా స్థావరం అవసరమైంది.
దీని కోసం అల్బుకెర్కీ మరియు మార్షలై ఫెర్నావో కౌటిన్హో ఆధ్వర్యంలో జామరిన్ ని ఓడించడానికి నౌకాదళంతో కాలికట్ చేరుకుని జామెరిన్ ని ఓడించి అతని కోటని స్వాధీనం చేసుకున్నారు.కానీ ప్రజలు వారి పైన తిరగబడి కౌటిన్హో ని చంపి,అల్బుకెర్కీని తీవ్ర గాయాల పాలు చేసారు.ఒక చిన్న సమూహం మాత్రం అల్బుకెర్కీని తీసుకొని పారిపోయారు.మళ్ళీ జామెరిన్ ని ఓడించడంలో విఫలమయ్యారు.(తర్వాత ఒక శతాబ్దం పాటు జామెరిన్ పైన దాడులు చేస్తూనే ఉన్నారు.)
కొన్ని రోజులకి అల్బుకెర్కీ పూర్తిగా కోలుకుని వేరొక ప్రణాళిక సిద్ధం చేశారు.ఈ ప్రణాళిక ప్రకారం తిమోజీ అనే ఒక హిందూ మహా సముద్రపు దొంగ సహాయంతో 2000 మంది సైనిక దళంతో, స్థానిక హిందువుల సహాయం తీసుకుని 1510లో బీజాపూర్ సుల్తానేట్ పైన దాడి చేసి గోవాని స్వాధీనం చేసుకున్నారు.
అల్మేడా హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ సముద్ర శక్తిని విజయవంతంగా స్థాపించిన తర్వాత సురక్షితమైన నావికా స్థావరం స్థాపించబడలేదు. హిందూ మహాసముద్ర సముద్ర మార్గాలన్నింటినీ నియంత్రించడానికి పోర్చుగీస్ శాశ్వత నౌకాదళాన్ని నిర్వహించగలిగే కేంద్ర నావికా స్థావరం అవసరం.ఈ స్థావరాన్ని గోవాలో స్థాపించారు.ఇది మంచి నౌకాశ్రయం, చురుకైన నౌకానిర్మాణ పరిశ్రమ మరియు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.
గోవా క్రైస్తవీకరణ మరియు విచారణ (ఇంక్విజిషన్)
అల్బుకెర్కీ కేవలం సుగుధ ద్రవ్యాల కోసం మాత్రమే కాదు.అరబ్ నుండి దిగుమతి చేసుకునే మేలు రకం గుర్రాల గురించి కూడా హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు.అనుకున్నట్టుగానే జరిగింది.భారతదేశం మరియు మిగిలిన దేశాలు ఈ రెండు వస్తువుల గురించి పోర్చుగల్ వారి డిమాండ్లకు ఒప్పుకోవలసి వచ్చేది.ఇదంతా పక్కన పెడితే
అప్పుడే జరిగిన యుద్ధం లో ప్రాణాలను కోల్పోయిన లేదా బంధీలు కాబడ్డ హిందూ మరియు ముస్లింల భార్యలను తిరిగి వివాహం చేసుకుని రోమన్ కాథలిక్ మతంలోకి మార్చమని అల్బుకెర్కీ తన సైన్యానికి చెప్పారు.దాంతో మొత్తం పోర్చుగల్ సైన్యం మొత్తం అదే విధానాన్ని అనుసరించారు.అలా చేసిన వారందరికీ గోవాలో ఆస్తులు ఇవ్వబడ్డాయి.పైగా పోర్చుగీసు కార్యాలయాల్లో వారికి మంచి స్థానాలు లభిస్తాయి.కానీ చాలా మంది స్త్రీలు మతం మారడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.గ్రామ సంఘాలు మునుపటిలా నిర్వహించగలిగినా అక్కడ కూడా క్రైస్తవులకే ప్రాధాన్యత లభించింది.అయితే హిందువులు మాత్రం మతం మారడం ఇష్టం లేక తమ సంస్కృతిని పాటించారు.
పోర్చుగీసు వారి ప్రధాన లక్ష్యం గోవా హిందువుల మతం మార్చాలి.దీని కోసం మొదటి బిషప్ 1538లో గోవా కి వచ్చారు. అప్పటి వరకు క్రైస్తవులు మరియు హిందువులు (హిందువుల కంటే క్రైస్తవులకు ఎక్కువ సౌలభ్యాలు ఉన్నప్పటికీ,క్రైస్తవులకి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ) స్వతంత్రంగానే బతికేవారు.కానీ అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి.హిందూ దేవాలయాల పైన దాడులు చేయడం మరియు దేవాలయాల ఆస్తులు చర్చిలు ఆక్రమించుకోవడం జరిగేది.
కానీ 1542లో మొదటి జెస్యూట్ గోవాకి వచ్చాడు.అతను ఒకే నెలలో ఒక గ్రామం లోని 10000 మందిని మతం మార్చాడని చెప్పుకుంటారు.చాలాసార్లు గోవా లో ఒక రోజు లోనే వందల మందిని మతం మారుస్తూ ఉండేవాడు.దానికి సంబంధించిన మిషనరీ స్కూళ్లను స్థాపించేవాడు.పైగా ప్రభుత్వం నుంచి కూడా బహుమతులు లాంటివి అందడం మరొక కలిసొచ్చే అంశం గా మారింది.క్రిస్టియన్ మిషనరీలు,చర్చ్ లు, కాన్వెంట్ లు విచ్చలవిడిగా వచ్చాయి.అలాగే కొంత మంది క్రిస్టయన్ తల్లి తండ్రులకు పుట్టామని చెప్పుకుంటే ఆస్థి వస్తుందని కుటుంబాలను మతం మార్చేవారు.ఇంత జరిగినా కొంత మంది మతం మారలేదు.మరికొంత మంది బయటకి మారినట్టు కనిపించినా రహస్యంగా తమ ఆచారాలను పాటించేవారు.
కానీ క్రైస్తవాన్ని విస్తరించాలనే లక్ష్యం తో అప్పటికే 1497లో యూదులను బలవంతంగా మతం మార్చాలని పోర్చుగల్ లో ఆదేశాలిచ్చారు.తర్వాత అక్కడ కూడా యూదుల పైన విచారణ చేపట్టి శిక్షలు విధించారు.అప్పటికే భారత్ లో యూదుల ఉండడంతో వారితో కలిసి నిర్భయంగా,స్వేచ్ఛగా తమ సంస్కృతిని పాటించవచ్చని వారు కూడా గోవాకి వచ్చారు.కానీ ఇక్కడ కూడా వాళ్ళు క్రైస్తవ్యాన్ని ప్రజల పైన రుద్దటం మొదలుపెట్టారు.అయితే ఇంకా మారని వాళ్ళు చాలా మంది ఉండడంతో వారి పైన ఆంక్షలు విధించటం మొదలుపెట్టారు.
హిందూ ఆలయాల పైన దాడులు చేసి వాటి ఆస్థులను కబ్జా చేసారు మరియు వాటిని క్యాథలిక్ చర్చ్ లకు రాసిచ్చారు.హిందూ పండుగలను జరుపుకోవడం, హిందూ పద్ధతిలో వివాహాలు చేసుకోవడం నిషేధించారు.కొంకణీ,ఉర్దూ, ఆంగ్ల భాషలను కూడా నిషేధించారు.ఆ భాషలలోని పుస్తకాలను, గ్రంధాలను తగలబెట్టారు మరియు అందకుండా చేసారు.అలాగే కొత్త రచనలు రాకుండా చేసారు. హిందువుల పైన జిజియా పన్ను లాగా క్జెండి పన్ను విధించారు.
1546న, హిందూ మతాన్ని నిషేధించాలని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని, హిందూ విందులను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించాలని, హిందూ పూజారులను బహిష్కరించాలని మరియు కఠినంగా శిక్షించాలని ఒక ఉత్తర్వు జారీ చేశాడు.క్రైస్తవేతరులకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి పదవి లభించదు.కేవలం క్రైస్తవులకు మాత్రమే లభిస్తుంది.గ్రామ సభలలో హిందువుల స్థానాలను క్రిస్టియన్ లతో భర్తీ చేసారు.హిందువులు లేకుండా విచారణ, తీర్పు ఇవ్వొచ్చు, కానీ క్రిస్టియన్ లు లేకుండా అలా చేయకూడదు.క్రిస్టియన్లు మెజారిటీ ఉన్న గ్రామాలకు హిందువులు వెళ్ళకూడదు.న్యాయ విచారణలో హిందువుల సాక్ష్యం చెల్లదు.క్రిస్టియన్ల సాక్ష్యం మాత్రమే చెల్లుతుంది. చాలా ఆలయాలను కూల్చివేశారు.కొత్తవి కట్టకూడదు,పాతవి మరమ్మతులు చేయకూడదు అనే చట్టం చేశారు.హిందూ పూజారుల పైన దాడులు జరిగాయి.
తండ్రి లేని హిందువుల పిల్లలు, అనాధలు చర్చికి ఇచ్చేయాలి.క్రైస్తవ్యంలోకి మారిన హిందూ స్త్రీలకు తండ్రి ఆస్థి మొత్తం సంక్రమిస్తుంది.
ఇలా హిందువులను క్రైస్తవ్యంలోనికి మార్చడానికి అన్ని రకాల చట్టలు చేసారు. హిందువులను చిత్ర హింసలకు గురి చేస్తూ, వారికి ఏ హక్కూ లేకుండా చేసారు.అయినా చాలా మంది మారలేదు.మరికొంత మంది క్రైస్తవులుగా మారినట్టు నటిస్తూ తమ ఆచారాలను పాటించేవారు.ఇలాంటి వారిని శిక్షించడం కోసం గోవా విచారణను(గోవా ఇంక్విజిషన్) చేపట్టారు.
1560లో సుల్తాన్ ఆదిల్ షా పాత రాజ భవనంలో విచారణ మొదలు పెట్టారు.ఈ విచారణ కోసం అనేక మంది హిందువులను ఖైదీలుగా చేసారు.ఒకవేళ తమ మత చట్టాలకు వ్యతిరేకంగా నేరం ఋజువైనట్టయితే వారిని అత్యంత పాశవికమైన పద్ధతుల్లో హింసించి, చూపేవారు.
ఖైదీలకు భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు.కొరడాలతో కొట్టేవారు,మిషనరీల చేత కర్కశంగా హిందువుల గోళ్ళు మరియు కళ్ళు పీకేవారు.చెక్క పైన కట్టేసి సజీవంగా కాల్చేసేవారు,శరీరాలను నలిపివేసేవారు, చిన్న పిల్లలు స్త్రీలు తో సహా ఊళ్ళకు ఊళ్ళు తగలబడిపోయాయి.
పెద్ద పెద్ద చక్రాల మధ్య కట్టేసి తిప్పేవారు.అమాయక హిందూ, యూదుల ప్రతి ఎముక నుజ్జు నుజ్జుయ్యే వరకూ అలా చేసేవారు.హిందూ పిల్లలను దూరంగా తీసుకు పోయేవారు.తల్లిదండ్రుల ఎదురుగా పిల్లలను రాక్షసుల్లా సజీవ దహనం చేసేవారు.స్త్రీల స్థనాలను పట్టకారు లాంటి వస్తువుతో పట్టుకుని మెలి తిప్పి వాటిని పీకేసేవారు.
ఈ విచారణ మధ్యలో సరస్వత్ బ్రాహ్మణులు కొంత మంది తప్పించుకొని శివలింగాన్ని తమతో పాటు తీసుకొని పోయి హిందూ రాజ్యానికి చెందిన సోండే గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు.యురోపియన్లు అనాగరికంగా హిందువుల గ్రామాలు నాశనం చేసి వారిని చిత్ర హింసలకు గురి చేసి చంపారు. అయినప్పటికీ చాలా మంది హిందూ మతాన్ని విడువలేదు మరియు అయిష్టంగానే విడిచిన వాళ్ళు తమ సంస్కృతి పైన ప్రేమని పోగొట్టుకోలేదు.మరికొంత మంది హిందూ మతాన్ని విడవడం ఇష్టం లేక,అలాగని ఈ శిక్షలు అనుభవించలేక గోవాని వదిలి పారిపోయారు,సరిగా తిండి లేక ఖైదీలుగా చనిపోయిన వారిని కూడా వదలలేదు.ఎలాగో వారిని ఏం చేయలేము కాబట్టి వారి దిష్టి బొమ్మలను తగలబెట్టేవారు.హిందుత్వం పైన అంత విద్వేషంతో రగిలిపోయారు వాళ్ళు..
1560లో మొదలైన ఈ విచారణ 1812 వరకు కొనసాగింది మరియు అనేక మంది హిందువులను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా వారి ప్రాణాలను సైతం తీసింది.చిన్న పిల్లలు,స్త్రీలు అని కూడా చూడకుండా ఎంతో మంది ప్రాణాలను కర్కశంగా తీసింది.
1812లో ఈ విచారణ నిలిపివేసిన తర్వాత దీనికి సంబంధించిన పత్రాలను అన్నింటినీ తగలబెట్టారు.దాని వలన ఎంత మంది ఈ విచారణ వల్ల బాధితులయ్యారో సరిగ్గా తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది.దాదాపుగా 16000 మంది ఈ శిక్షలు అనుభవించారు అని ఒక అంచనా.కానీ ఆ పత్రాలు ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు.ఇంకా ఎన్ని రకాలుగా శిక్షలు అనుభవించారు అనేది కూడా తెలిసేది.చివరికి 2,50,000 మంది జనాభాలో 20,000 మంది కూడా హిందువులు లేకుండా పోయారు.ఈ విచారణ 1812 లో ఆగినప్పటికీ 1961లో గోవాని భారత్ విముక్తి చేసే వరకూ ఎన్నో దారుణాలను హిందువులు చవి చూడాల్సి వచ్చింది.
కానీ ఆ తర్వాత గోవా వాసులు కొంకణి భాషను తమ మాతృ భాష గా ఎంచుకున్నారు.మరియు ప్రేమించారు.అలాగే 1920ల చివరలో చాలా మంది క్యాథలిక్ గౌడ సరస్వతులు తిరిగి హిందూ మతం లోకి మారారు.
వారు బ్రిటిష్ బొంబాయి సతారా జిల్లా మసూర్ లోని ఆశ్రమ గురువు వినాయక్ మహరాజ్ మసుర్కర్ ని అభ్యర్ధించారు.అతను కాథలిక్ గౌడ మరియు కుంబిస్ ల హిందూ మతం పునరాగమనానికి అంగీకరించి శిష్యులతో కలిసి భక్తి గీతాలు పాడుతూ, పూజలు చేస్తూ గౌడ గ్రామాలలో తిరిగారు.దాని వల్ల చాలా మంది తిరిగి హిందూ మతం లోకి రావడానికి సుముఖత చూపారు.
రోమన్ కాథలిక్ చర్చి మరియు పోర్చుగీసు అధికారుల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ 1928 ఫిబ్రవరి 23న భారీ ఎత్తున తిరిగి హిందూ మతం లోకి చేరారు.వారి పేర్లను కూడా మార్చుకున్నారు.మొత్తం 8,000 మంది వరకు ఈ సంఖ్య ఉంటుంది.
దురదృష్టం ఏంటంటే ఇంత దారుణమైన సంఘటన గురించి మన చరిత్ర లో ఎక్కడా చెప్పలేదు, ఎవ్వరికీ తెలియదు.
ఈ అమానుష చర్య పైన మీ అభిప్రాయం తెలియజేయండి.
0 $type={blogger}