Showing posts with label attacks on hindu. Show all posts
గుజరాత్ అల్లర్లు మోడీ భాగస్వామ్యం
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
గుజరాత్ అల్లర్ల పైన నరేంద్ర మోడీ ని నిందుతుడిగా చూపిస్తూ బిబిసి డాక్యుమెంటరీ చేసి కొన్ని యూనివర్సిటీ ల్లో ప్రదర్శించింది.కానీ భారత ప్రభుత్వం కేవలం భారత ప్రభుత్వం మరియు మోడీ పరువు తీయడానికి మాత్రమే ఏ మాత్రం ఆధారాలు లేని,నిరూపించలేని ఇటువంటి ప్రచారం చేస్తుందంటూ ఆ వీడియోలను బ్యాన్ చేసింది.ఆ వీడియోల్లో ఏముందో నాక్కూడా తెలియదు.కానీ అసలు గుజరాత్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
మనం ఈ విషయం గురించి జరిగిన చోట మాత్రమే మాట్లాడుకుంటే మనకి పూర్తి వివరాలు తెలియవు.ఈ సంఘటనకి అయోధ్య లో రామజన్మ భూమి గురించి జరిగిన గొడవల దగ్గర పునాది పడింది.
ఎన్నో సంవత్సరాలుగా రామజన్మ భూమి గురించి హిందువులు పోరాడిన తర్వాత 1992 డిసెంబర్ 6న పి.వి.నర్శింహారావు గారు ప్రధాన మంత్రిగా , కళ్యాణ్ సింగ్ గారు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశ్వ హిందూ పరిషత్ మరికొన్ని సంస్థలకు చెందిన వేలాది మంది హిందువులు సమూహం గా వెళ్లి ఆగ్రహావేశాలతో ఆ వివాదాస్పదమైన బాబ్రీ మసీదును పూర్తిగా కూల్చేసారు.రెండు వర్గాల వారు ఆ స్థలాన్ని తమకు చెందినదిగా చెప్పుకుంటూ కోర్టులో కేసు వేశారు.
2001 జూన్ లో శ్రీరామ మందిర నిర్మాణ సమితి ఢిల్లీ లో నిర్వహించిన సభలో ప్రజలను ఒప్పించడానికి ప్రజా ప్రతినిధులందర్నీ కలవాలని, వారికి శ్రీరామ జన్మభూమిని గురించిన వాస్తవాలన్నీ తెలియజేసి ఒప్పించాలనీ నిర్ణయించుకున్నారు.అప్పటి ప్రధాన మంత్రి వాజ్పాయ్ గారు ఈ విషయం లో మార్చి 12లోగా ఏదో ఒక పరిష్కారం కనుక్కుందామని అక్టోబర్ 10న పూజ్య మహంత్ పరమహంస దాస్ గారిని ఢిల్లీ లో కలిసినప్పుడు మీడియా తో చెప్పారు.
అక్టోబర్ 17న శ్రీరామ్ లల్లాకు దర్శనం కల్పించాలని లక్నో బెంచ్ ఆదేశాలు ఇచ్చినప్పటికీ దానిని అనుమతించలేదు.అశోక్ సింఘాల్ మరియు శ్రీస్ఛంద్ర దీక్షిత్ లు బారీకేడ్ నుండి కొన్ని అడుగుల లోపలికి వెళ్ళి గర్భగుడి వెలుపల నుండి స్పష్టమైన దర్శనం చేసుకోవడం నేరంగా పరిగణించబడింది.
జనవరి 26,2002న అయోధ్య నుండి లక్నో, కాన్పూర్ మీదుగా సాధువుల యాత్ర నిర్వహించారు.6500 మంది సాధువులు ఈ యాత్ర లో పాల్గొన్నారు.27న ఢిల్లీ లోని రాంలీలా మైదాన్ లో ఒక పెద్ద ధర్మ సభ నిర్వహించారు.మధ్యాహ్నం 12 గంటలకు సాధువుల బృందానికి ప్రతినిధులు ప్రధాన మంత్రిని కలిసారు.కానీ మార్చి 12 లోగా అని తాను మాట ఇవ్వలేదని ఆయన చెప్పారు.
పూజ్య మహంత్ పరమహంస రామచంద్ర దాస్ గారు తాను శ్రీరామ మందిర నిర్మాణం కోసం చెక్కిన శిల్పాలు క్రేన్ల ద్వారా తీసుకుని వస్తానని చెప్పారు.అంతేకాకుండా ఆ వివాద స్థలాన్ని న్యాస్ కి ఇవ్వవలసిందిగా ఆయన ప్రధాన మంత్రికి లేఖ రాశారు.
అయోధ్య లోని రాంఘాట్ వద్ద ఫిబ్రవరి 17,2002న శ్రీరామ మహాయజ్ఞం మొదలైంది.ఇది 24వ తారీఖు వరకు కొనసాగింది.24వ తారీఖున పూర్ణాహుతి మహాయజ్ఞానికి 8000 మంది రామసేవకులు హాజరు కావాలని కోరారు.25వ తారీఖున 6000 మంది భక్తులు మరియు కర సేవకులు హాజరయ్యారు.
25వ తారీఖున దాదాపుగా 1600 మంది భక్తులు మరియు కర సేవకులు అహ్మదాబాద్ కి వెళ్ళే సబర్మతీ ఎక్స్ప్రెస్ ఎక్కారు.అది 27వ తారీఖున 4 గంటలు ఆలస్యంగా ఉదయం 7 గంటల 43 నిమిషాలకు గోద్రా స్టేషన్ లో ఆగింది.ఆ సమయంలో కొంత మంది కర సేవకులకు మరియు స్టేషన్ లోని వ్యాపారులకు గొడవ అయ్యింది.అయితే కాసేపటికి ఆ గొడవ ఆగిపోయింది.
రైలు ప్లాట్ ఫాం పై నుండి బయలుదేరిన కాసేపటికి ఎవరో ఎమర్జెన్సీ చైన్ లాగారు.దాంతో ఫలియా ఏరియాలోని సిగ్నల్ పాయింట్ దగ్గర రైలు ఆగిపోయింది.ఆ రైలు డ్రైవర్ చెప్పిన మాటల ప్రకారం తమ దగ్గర ఉన్న పరికరాలలో ఆ ఎమర్జెన్సీ చైన్ ని ఒకసారి కంటే ఎక్కువ సార్లు లాగినట్టు వారికి సందేశం అందింది.
రైలు ఆగిన కాసేపటికి రైలుని రెండు వేల మంది ఉన్న ముస్లిం మూకలు రైలుని చుట్టుముట్టాయి.వాళ్ళు ముందుగా రైలు పైకి విచ్చలవిడిగా రాళ్ళని విసిరారు.తర్వాత కాసేపటికి రైలు యొక్క నాలుగు బోగీల్లో మంటలు చెలరేగాయి.ఆ బోగీలోని రామ భక్తులు బయటకి రావడానికి ప్రయత్నించినా దానికి వీలు లేకుండా తలుపులు బయట నుండి ఎవరో మూసేసి బంధించేసారు.
ఆ బోగీల్లో ఉన్న రామ భక్తులు అందరూ పెద్ద వాళ్ళే కాకుండా ఆడవాళ్ళు, చిన్న పిల్లలతో సహా అందరూ చూస్తూ ఉండగానే బయటకి రావడానికి ప్రయత్నిస్తూ, భయంతో కేకలు వేస్తూ ఆ మంటల్లో శరీరం మొత్తం కాలి నరకయాతన అనుభవించి మరణించారు.సజీవ దహనమయ్యారు.మొత్తం 59 మంది ఆ మంటల్లో కాలి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.ఇందులో 27 మంది మహిళలు,10 మంది చిన్న పిల్లలు ఉన్నారు.మరొక 48 మంది తీవ్ర గాయాల పాలయ్యారు.
కొంత మంది వాదన ప్రకారం ఈ సంఘటన పాకిస్థాన్ నుండి ఇక్కడ దాడి చేసిన వారికి అందిన ఆదేశాలతోనే చాలా పకడ్బందీ పథకం ప్రకారం జరిగిందని అంటారు.గుజరాత్ ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం కోచ్ లోకి దాడి చేసిన వారు మండే ద్రవాలను విసరడం వల్ల ఈ సంఘటన జరిగింది.అలాగే మంటలు మాత్రం ఖచ్చితంగా బోగీల లోపలి నుండే అంటుకున్నాయి.అందుకే బోగీల బయట కిటికీల కింద బూడిద చాలా తక్కువ ఉంది.
గుజరాత్ పోలీసుల నివేదిక ప్రకారం ఆ ఏరియాలోని మత గురువు మౌల్వీ హుస్సేన్ హజీ ఇబ్రహీం ఉమర్జీ మరియు విధుల నుండి తొలగించబడిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఆఫీసర్ నానుమియన్ ప్రధాన సూత్రధారులు మరియు ఫోరెన్సిక్ నివేదికలో చెప్పినట్టుగా ఈ దాడిలో ఉపయోగించిన మండే గుణం కలిగిన ద్రవం 140 లీటర్ల పెట్రోల్ ని రైలు రావడానికి కొన్ని గంటల ముందు కొని మరొక కీలక కుట్రదారుడు రజాక్ కుర్కూర్ గెస్ట్ హౌస్ లో దాచారు.ఈ దాడి లో అనేక వేల మంది ముస్లిం లు పాల్గొన్నారు.
కానీ సుప్రీం కోర్టు జడ్జి గా పని చేసిన ఉమేష్ చంద్ర ఛటర్జీ ఇచ్చిన దర్యాప్తు నివేదికలో మాత్రం ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే అని తెలిపారు.
రైలు దగ్ధమైన ఒకరోజు తర్వాత విశ్వ హిందూ పరిషత్ గుజరాత్ లో రాష్ట్ర వ్యాప్త బంద్ ని ప్రకటించారు.సుప్రీం కోర్టు ఇటువంటి బంద్ లు చట్టానికి వ్యతిరేకమైనవిగా పేర్కొంది.కానీ రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ బంద్ కి అనుకూలంగా మాట్లాడారు.దాంతో ఆ రిజు బంద్ ని నిర్వహించడానికి వారికి దారి సుగమం అయింది.అంతేకాదు ఆ రోజు బంద్ లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది హిందువులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు.అసలు ఊహించనంత మంది జనం ఆరోజు ఆ బంద్ లో పాల్గొన్నారు.
అయితే వారంతా ముందు రోజు హిందువులను సజీవ దహనం చేసారనే కోపం తో రగిలిపోతున్నారు.ఒక వర్గం పైన ఇలా దాడి చేసి స్త్రీలు, చిన్న పిల్లలలతో సహా చంపేయడం అనేది వాళ్ళలో ఆగ్రహావేశాలు పెరిగేలా చేసింది.అదీకాక ఇది హిందువుల పైన దాడులు చేయడానికి పాకిస్థాన్ నుండి అందిన ఆదేశాలతోనే ఇక్కడ ముస్లిం నాయకులు తమ అనుచరులతో కలిసి చేసారనీ, కొంత మంది ముస్లిం లు హిందూ మహిళలను అపహరించి మానభంగం చేసారనీ వార్తలు ప్రచారం అయ్యాయి.అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇది మత ఘర్షణ కాదనీ, ఉగ్రవాద చర్య అనీ పేర్కొన్నారు.ఈ వార్తలన్నీ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.
వీటన్నిటి కారణాలతో బంద్ లో పాల్గొన్న హిందువులలో కోపం కట్టలు తెంచుకుంది.ఒక్క సారిగా బంద్ హింసాత్మకంగా మారింది.చాలా మంది హిందువులు ముస్లిం ల పైన దాడులు చేయడం మొదలుపెట్టారు.అంతేకాక ట్రక్కులలో తలకి కాషాయ రిబ్బన్లు కట్టుకున్న కొంత మంది ముస్లిం లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళి వారి పైన దాడులు చేయడం మొదలుపెట్టారు.ముస్లిం ఇళ్ళ పైన,షాపుల పైన దాడి చేస్తూ మధ్యలో ఉన్న హిందువుల ఇళ్ళ పైన మాత్రం ఏ మాత్రం దాడి చేయకుండా తమ దాడులు కొనసాగించారు.
వారి చేతిలో ఓటర్ల జాబితా కూడా ఉందని బాధితులు తెలిపారు.కొంత మంది వాదన ప్రకారం ముస్లింల వివరాలు ప్రభుత్వం మరియు పోలీస్ యంత్రాంగమే దాడి చేసే వారికి ఈ ముస్లింల సమాచారాన్ని అందించారని అంటారు.అంతేకాక ఆందోళనకారులు సెల్ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఈ దాడులు చేసారనీ, పోలీసులకు ఫోన్ చేసినా రక్షణ కల్పించడానికి జాప్యం చేసారనీ కొంత మంది తెలిపారు.
28వ తారీఖున సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా దాడులను ఆపడానికి 27 పట్టణాలలో కర్ఫ్యూ విధించారు.సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం.డి.ఆంథానీ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇక ఈ దాడులు కొనసాగడానికి వీల్లేదనీ,కఠిన చర్యలు తీసుకోవాలనీ,అవసరం అయితే ఇండియన్ ఆర్మీ ని రంగంలోకి దించాలని పోలీసులకు తెలిపారు.చివరికి ఎవరైనా ఇంకా ఆందోళనకు దిగితే చంపడానికి కూడా వెనకాడవద్దని తెలిపారు.
ఒక అంచనా ప్రకారం 230 మసీదులు, 274 దర్గాలు,19 ఆలయాలు,3 చర్చిలు కూల్చివేయబడ్డాయి.100000 ఇళ్ళు,1100 హోటళ్ళు,15000 వ్యాపారాలు,3000 హస్తకళా తయారీ సంస్థలు,5000 వాహనాలు నష్టపోయాయి.200 మంది వరకు పోలీసులు కూడా ఈ గొడవలు ఆపడానికి ప్రయత్నాల్లో మరణించారు.250 మంది మహిళల పైన అత్యాచారాలు జరిగాయి.చాలా మంది హిందువులు (దళితులు, గిరిజనులతో సహా) చాలా మంది ముస్లిం లను కాపాడడానికి ప్రయత్నించారు,కాపాడారు.చివరికి 20000 మంది హిందువులు,7000 మంది ముస్లిం లు అరెస్టు చేయబడ్డారు.
ఇక్కడ వరకూ చాలా మందికి తెలిసిన విషయాలే.అందులోనూ మీడియా కవరేజీ కూడా గుజరాత్ అల్లర్లు అంటూ ఈ అల్లర్ల గురించి బాగా ప్రచారం చేసాయి.అలాగే ఈ అల్లర్లతో మోడీకి,మోడీ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేశారు.
కానీ అదే సమయంలో గోద్రా రైలు దగ్దం ఘటన తర్వాత జమల్పూర్ లోని ఒక హిందూ ఏరియాలో హిందువుల పైన ముస్లీంలు దాడులు మొదలుపెట్టారు.ఇళ్ళ పైన దాడులు చేసారు, మనుషుల పైన దాడి చేసారు.హిందువులను భయభ్రాంతులకు గురి చేసారు.అయితే పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.కానీ ఈ అల్లర్ల గురించి ఎక్కడా ప్రచారం కాలేదు.తర్వాత నరేంద్ర మోడీ కాలనీని సందర్శించి బాధితులకు భరోసా ఇచ్చారు.
ఏది ఏమైనప్పటికీ గోద్రా రైలు తగలబెట్టి హిందువులను చంపడంతో మొదలైన ఈ సంఘటనలు చివరికి దేశం లోనే బాధాకరమైన జ్జాపకాలను మిగిల్చి అటు ముస్లింలను,ఇటు హిందువులను ఎంతో మందిని బలి తీసుకున్నాయి.ఇంకెప్పుడూ,ఎక్కడా ఏ వర్గం పైన ఇతర వర్గాల వారు దాడులు చేయకూడదని, దాడులు,ప్రతి దాడులు, ప్రతీకార చర్యలు ఉండకూడదని అందరూ అన్నదమ్ముల లాగా ప్రశాంతంగా బ్రతకాలనీ కోరుకుందాం.ఎందుకంటే ఒకరు దాడి చేస్తే మరొకరు ప్రతి దాడి చేసే అవకాశం ఉండకపోదు.
చివరికి ఈ గొడవల్లో ఉన్న రెండు పెద్ద అపోహలు లేదా ఆధారాలు లేని వాస్తవాలు లేదా కొంత మంది నమ్మకాలు ఏంటంటే
పాకిస్థాన్ లోని ఇంటెలిజెన్స్ ఆదేశాలతో గోద్రా రైలు దగ్దం జరిగింది అనేది ఒకటి అయితే, నరేంద్ర మోడీ ప్రోత్సాహం తోనే గుజరాత్ అల్లర్లు జరిగాయి అనేది రెండోది.ఈ రెండూ కోర్టు లో నిరూపించబడలేదు.కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు నరేంద్ర మోడీ గారిని తమ దేశంలోకి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించాయి.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
గోవా ఇంక్విజిషన్ (విచారణ)
గోవా పురాతన హిందూ రాజ్యాలచే స్థాపించబడింది మరియు నిర్మించబడింది మరియు కదంబ రాజవంశం యొక్క రాజధానిగా పనిచేసింది.గోవాని పోర్చుగీస్ వారు ఆక్రమించుకున్నప్పుడు అక్కడ హిందువులను మతం మార్చడానికి వారిని చిత్ర హింసలకు గురి చేసారు.అలా మారని వారిని విచారణ (ఇంక్విజిషన్) పేరు తో చిత్ర హింసలకు గురి చేసి చూపేవారు.దానినే గోవా ఇంక్విజిషన్ (విచారణ) అంటారు.దీనికి వాస్కోడాగామా కాలికట్ కి చేరుకున్నప్పుడు బీజం పడింది.దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
వాస్కోడాగామా భారతదేశం చేరుకోవడం
15వ శతాబ్దం లో పోర్చుగల్ వారు తూర్పు మసాలా వ్యాపారంలో తమ ఉనికి కోసం ఆరాటపడతారు.కానీ అప్పటికే మమ్లుక్స్ మరియు ఒట్టొమన్ సామ్రాజ్యాల నుండి లవంగాలు, దాల్చిన చెక్క , జాజికాయ, మిరియాలు మరియు అల్లం లాంటి మసాలాలను దిగుమతి చేసుకుంటున్న వెనిస్ వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.
పోర్చుగల్ రాజు మాన్యుయల్ ఈ సుగంధ ద్రవ్యాలకు మార్గాలను కనుక్కోమని వాస్కోడాగామ ని అప్పగించారు.గామా నాలుగు అత్యుత్తమ నౌకలతో కూడిన స్క్వాడ్రన్ లతో కొన్ని సంవత్సరాల వ్యాపార వస్తువులతో 1497 జులై 8న బయలుదేరాడు.వారు దారి తప్పి 95 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత హెలెనా బే వద్ద 125 మైళ్ళ దూరంలో భూమి పైకి చేరుకున్నారు.
అయితే అప్పటికే గామా మరియు అతని సిబ్బంది మొత్తం స్కర్వీ వ్యాధి బారిన పడ్డారు.వాస్కోడాగామా ఆఫ్రికా లోని మొజాంబిక్ చేరినప్పుడు అక్కడ తన దగ్గర ఉన్న చౌకైన వస్తువులను అమ్మడానికి కొంత మంది వ్యాపారులతో మాట్లాడుతున్నాడు. ముందు వారు సుముఖత చూపించినప్పటికీ అతని వస్తువులలో నాణ్యత లేని కారణంగా అక్కడ వ్యాపారులతో తీవ్ర అవమానాలకు గురయ్యారు.అయితే ఇదే సమయంలో సముద్రంలో తిరుగుతుంటే గుజరాతీలు దారి చూపించారనీ వారి నౌకలు గామా నౌకల కంటే మూడు నాలుగు రెట్లు పెద్దగా ఉన్నాయనీ, వాటిని చూసి గామా ఆశ్చర్యపోయాడనీ కొంత మంది రాసారు.
మారిషస్ లో జరిగిన 5వ ప్రపంచ తమిళ మహా సభలో ఒక వ్యక్తి చెప్పిన దాని ప్రకారం
వాస్కోడాగామా దక్షిణాఫ్రికా లో తమిళ నావికుడైన కనక్కన్ అనే అతని సహాయం కోరాడు.ఆ కనక్కన్ అనే వ్యక్తి సహాయం వల్లనే అతని మార్గ నిర్దేశకత్వంలో వాస్కోడాగామా కేరళ తీరానికి చేరుకోగలిగాడు.నిజానికి అప్పటికే తమిళులకు అన్ని సముద్ర మార్గాలూ తెలుసు.ఎందుకంటే అప్పటికే మెసొపొటేమియా లాంటి సుదూర ప్రాంతాలకు కూడా సముద్ర మార్గం లో వ్యాపారాలు చేసేవారు.
1498 మే 18న 28 రోజుల పాటు ప్రయాణించిన తర్వాత వాస్కోడాగామ మొట్టమొదటి సారిగా ఇప్పటి కోజికోడ్ లో అడుగు పెట్టాడు. భారత దేశం లో అడుగు పెట్టిన మొదటి యురోపియన్ గా చరిత్ర గామ గురించి చెప్తుంది.
అయితే ఆ సమయంలో తుఫానులు రావడంతో నావికుడు తీరాన్ని చూడలేకపోతున్నారు.అప్పుడు 4 పడవలు వారి దగ్గరకు వచ్చి వారిని తీరానికి తీసుకొని వెళ్ళారు.గామా తాము సుగంధ ద్రవ్యాల కోసం ఇక్కడికి వచ్చామని చెప్పారు.
వాస్కోడ గామ వారిని ముందు క్రైస్తవులు అనుకున్నాడు.అక్కడి వారి గురించి వివరిస్తూ ముదురు గోధుమ రంగులో ఉండే క్రైస్తవులు అక్కడ నివసిస్తున్నారు.వారు కింద ఒక వస్త్రాన్ని కట్టుకుని ఉన్నారు.పైన నగ్నంగా వదిలేసారు.కానీ బాగా బంగారాన్ని ధరించారు. పేదవారు మాత్రం బంగారాన్ని ధరించలేదు. అందరూ శిరోముండనం చేయించుకుని వెనక మాత్రం కొంత జుట్టు (శిఖ) ఉంచుకున్నారు. స్త్రీలు పొట్టిగా ఉన్నారు అంటూ చెప్పాడు.అలాగే దేవి తల్లి ఆలయాన్ని చూసి మేరీమాత ఆలయంగా భావించాడు.
ఆ రాత్రి వారు తమ ఓడల్లో నిద్రించారు. ఉదయాన్నే లేచి మంచి దుస్తులు ధరించి 13 మంది బృందం తో కలిసి గామా కపువోలా అనే పట్టణానికి చేరుకున్నారు.అక్కడ వారు వెన్న మరియు ఉడికించిన చేపలతో అన్నం తిన్నారు. చివరికి గామా రాజ్యం యొక్క పాలకుడు జామోరిన్ కోర్టు కు చేరుకున్నారు.
రాజు సగం నగ్నంగా బంగారు ఆభరణాలు ధరించి,సంపన్నవంతుడిలా కనిపిస్తున్నాడు.చేతిలో బంగారు గిన్నె,దానిలో తమలపాకులు కనిపిస్తున్నాయి.రాజు చుట్టూ ఆ బంగారు గిన్నెలు, తమలపాకులు అమర్చబడి ఉన్నాయి.వాస్కోడగామని చూసిన వెంటనే రాజు నమస్కరించి ఒక కుర్చీని ఇచ్చి, తినడానికి పండ్లు ఇచ్చారు.
తాను పోర్చుగల్ నుండి సుగంధ ద్రవ్యాలు దొరికే రాజ్యాలు వెదుక్కుంటూ వచ్చాననీ,ఆ రాజ్యాలను కనుక్కోకుండా వెనక్కి వెళ్తే తన తల తీసివేయబడుతుందని చెప్పాడు.
డా గామా రాజుకు పన్నెండు చారల గుడ్డ, నాలుగు సింధూర వర్ణ టోపీ, ఆరు టోపీలు, నాలుగు పగడపు తీగలు, ఆరు చేతులు కడుక్కునే బేసిన్లు, ఒక పంచదార బస్తా, రెండు పీపాల నూనె మరియు రెండు తేనె సీసాలను అందించాడు.
రాజు వాటిని తీసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రజలంతా అతనిని చూసి నవ్వారు.ఎందుకంటే రాజు ఇతరుల నుండి బంగారం తప్పితే మరేమీ తీసుకోడు.ఆఖరికి తన రాజ్యంలోని పేదలు కూడా వాటిని ఇవ్వరు. దాంతో గామా అక్కడ నుండి నిరాశతో తమ నౌకల వద్దకు వెళ్ళిపోయాడు.
మళ్ళీ గామా జామెరిన్ దగ్గరకు వెళ్ళాడు. జామెరిన్ మీరు నిజంగా సంపన్న దేశం నుండి మాకోసం వస్తే ఏం తీసుకొని రాకుండా ఎందుకొచ్చారని అడిగారు.
మా రాజు కేవలం భారతదేశాన్ని కనుక్కోమని మాత్రమే మిమ్మల్ని పంపించారు. అందువల్ల మీ కోసం మేం ఏం తీసుకొని రాలేకపోయాం అని చెప్పారు.
జామెరిన్ మీ దేశంలో ఏం దొరుకుతాయని అడిగాడు.
దానికి వాస్కోడా గామా మొక్క జొన్న,వస్త్రం,కంచు, ఇనుము దొరుకుతాయనీ, తన దగ్గర వాటి నమూనాలు ఉన్నాయనీ,తమరు ఆదేశిస్తే మా దేశం నుంచి వాటిని తీసుకుని రావడానికి మనుషుల్ని పంపుతాడనీ చెప్పారు.
కానీ జామెరిన్ రాజు వద్దని చెప్పారు.కానీ తమ రాజ్యంలోని వస్తువులను మాత్రం మంచి ధరకు ఇస్తానని చెప్పారు.దాంతో వాస్కోడ గామ అతని మనుషులు సంతోషంగా వెనుదిరిగిరు.
చివరిగా తమ వద్ద ఉన్న వస్తువులను అతి తక్కువ ధరలకు అంటే 100 రూ. వస్తువులను 10 రూ. కే అమ్ముకుని ఆ ధనంతో ఇక్కడ వస్తువుల నమూనాలను తీసుకొని అప్పటి పోర్చుగల్ మొదటి రాజు మాన్యుయాల్
కు చూపించడానికి తీసుకొని వెళ్ళారు.భారతదేశానికి మార్గం కనిపెట్టినందుకు వాస్కోడగామాకు తమ రాజ్యం లో ఘన స్వాగతం లభించింది.
సంతోషంగా పోర్చుగల్ వచ్చి తమ రాజు మరియు రాణి లకు తమ పర్యటన గురించి వివరించారు.తను తెచ్చిన కొద్ది పాటి సుగంధ ద్రవ్యాలు తమ రాజుకి ఒక గొప్ప భవిష్యత్తుని, భారతావనికి అత్యంత దుర్భర పరిస్థితిని తీసుకొని వచ్చాయి.
భారత దేశం పైన దాడి చేసి ఆక్రమించుకోవడం
వాస్కోడాగామా పోర్చుగల్ కి తిరిగి వచ్చిన తరువాత హిందూ మహాసముద్రం ఓడ రేవులను అయితే చర్చల ద్వారా లేదా బలవంతంగా తమ ఆధీనంలో తెచ్చుకోవాలని అనుకున్నారు.
దీని కోసమే పెడ్రో అల్వారిస్ కాబ్రోల్ నాయకత్వం లో 13 ఓడల ఒక పెద్ద నౌకాదళం 9 మార్చి 1500న బయలుదేరింది.జామెరిన్ ను తమకు అనుగుణంగా పనిచేసేలా ఒప్పించమనీ అలాగే సరుకుతో ఉన్న ఓడని తీసుకొని రమ్మని పంపించారు.అలాగే మత మార్పిడి చేయడానికి ఫ్రాన్సిస్కన్ మిషనరీ బృందాలను అక్కడికి పంపాలని కూడా చెప్పారు.
వారు ముందుగా మలింది వెళ్ళి అక్కడ నీటిని మరియు తాజా ఉత్పత్తులను తీసుకొని భారత్ వైపు బయలురారు.సెప్టెంబర్ 13న వారు కాలికట్ చేరుకుని జామెరిన్ కి విలాసవంతమైన బహుమతులు మరియు కింగ్ మాన్యువల్ నుండి ఒక లేఖ తీసుకొని వచ్చారు.చర్చలు విజయవంతమయ్యాయి.అతను సుగంధ ద్రవ్యాలు శుద్ధి చేసే కర్మాగారాన్ని నెలకొల్పడానికి అనుమతి పొందాడు.అయితే ఒకేసారి సుగంధ ద్రవ్యాలతో నిండిన అరబ్ వ్యాపారి నౌకను స్వాధీనం చేసుకోవడం తో మొత్తం మారిపోయింది.దాంతో కాబ్రిల్ మరియు అరబ్బుల మధ్య ఘర్షణకు దారి తీసింది.కాలికట్ తీరం వెంబడి బాంబు దాడులు కూడా జరిగాయి.వెంటనే కాబ్రెల్ కొచ్చిన్ కి పారిపోయి అక్కడ వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.కానీ జామెరిన్ తన మీదకు 80 యుద్ధ నౌకలను పంపుతున్నాడని తెలుసుకుని అక్కడ నుండి లిస్బన్ కు పారిపోయాడు.
కానీ పోర్చుగల్ రాజు కి హిందూ మహాసముద్రం లో తన ఆధిపత్యాన్ని చెలాయించాలని మళ్ళీ వాస్కోడా గామా ని ఆఫ్రికా సుల్తానులను మరియు కాలికట్ జామెరిన్ ని తమ శక్తి కి తల వంచేలా చేయమని 10 నౌకలతో పంపారు.
వాస్కోడా గామ ఆఫ్రికా ముస్లిం ఓడ రేవుల పైన దాడిని ఆరంభించి, వారిని భయపెట్టి స్వాధీనం చేసుకున్న తర్వాత,ఒక అరబ్ నౌకని స్వాధీనం చేసుకుని దానిలోని యాత్రికులందర్నీ చిన్న పిల్లలతో సహా కాల్చేసారు.తర్వాత అతను కాలికట్ లోని జామెరిన్ పైన దాడి చేయడానికి బయలుదేరారు.
గామా జామెరిన్ భయపెట్టడానికి ఒక ప్రధాన పూజారిని ఎత్తుకెళ్లి పెదవులు, చెవులు కోసి,కుక్క చెవులను కుట్టాడు.నౌకల్లో ఉన్న మరెంతో మంది ముక్కు, చెవులు కోసి వాటిని జామెరీన్ వద్దకు పంపాడు.కాలికట్ ఓడ రేవుల పైన బాంబు దాడులు చేశారు.గామా తన నౌకలతో వెనుతిరిగి పారిపోతుంటే పట్టుకోడానికి జామెరిన్ నౌకలను పంపారు.కానీ గామా కొచ్చిన్ మరియు కాననూర్ తీరాల్లో సుగంధ ద్రవ్యాలను తన ఓడలోకి ఎక్కించుకొని వెళ్తూ వెళ్తూ మలబార్ తీరం వెంబడి దాడులు చేస్తూ, అనేక ముస్లిం ఓడలను దోచుకుంటూ వెళ్ళాడు.కానీ జామెరీన్ ని ఓడించడంలో మళ్ళీ విఫలమయ్యాడు.
1505 లో కింగ్ మాన్యుయెల్ హిందూ మహా సముద్రంలో తన శాశ్వత ఉనికిని నెలకొల్పడానికి 22 ఓడలు,1000 మంది నావికులు మరియు 1500 మంది సైనికులతో ఫ్రాన్సిస్కో డి అల్మెయిడా భారతదేశ వైశ్రాయ్ గా నియమించబడ్డాడు. అయితే అల్మెయిడా ఆఫ్రికా మరియు భారత తీరం వెంబడి ముస్లిం వ్యాపారుల పైన దాడులు చేస్తూ కోటలు నిర్మించారు.ఆఫ్రికా తీరం లో 1000 మైళ్ళ విస్తీర్ణంలో పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు.అక్కడ నుండి కొచ్చిన్ కి బయలుదేరాడు.అక్కడ కొన్ని పోరాటాలు జరిగాయి.ఈ పోరాటాల్లో వైస్రాయ్ కొడుకు మరణించాడు.
2 ఫిబ్రవరి 1409న వైశ్రాయై తన బలగాలతో ఈజిప్టు మరియు భారత సంకీర్ణాన్ని దెబ్బ తీసి, దొరికిన ఈజిప్టు బందీలను సజీవ దహనం చేశారు.కొంత మందిని ఉరి తీసి చంపారు.మొత్తానికి అల్మెడా హిందూ మహాసముద్రం లో పోర్చుగీసు ఆధిపత్యాన్ని విజయవంతంగా నెలకొల్పాడు.కానీ వారికి మొత్తం నావికా వ్యవస్థ ని చూసుకోడానికి ఒక నావికా స్థావరం అవసరమైంది.
దీని కోసం అల్బుకెర్కీ మరియు మార్షలై ఫెర్నావో కౌటిన్హో ఆధ్వర్యంలో జామరిన్ ని ఓడించడానికి నౌకాదళంతో కాలికట్ చేరుకుని జామెరిన్ ని ఓడించి అతని కోటని స్వాధీనం చేసుకున్నారు.కానీ ప్రజలు వారి పైన తిరగబడి కౌటిన్హో ని చంపి,అల్బుకెర్కీని తీవ్ర గాయాల పాలు చేసారు.ఒక చిన్న సమూహం మాత్రం అల్బుకెర్కీని తీసుకొని పారిపోయారు.మళ్ళీ జామెరిన్ ని ఓడించడంలో విఫలమయ్యారు.(తర్వాత ఒక శతాబ్దం పాటు జామెరిన్ పైన దాడులు చేస్తూనే ఉన్నారు.)
కొన్ని రోజులకి అల్బుకెర్కీ పూర్తిగా కోలుకుని వేరొక ప్రణాళిక సిద్ధం చేశారు.ఈ ప్రణాళిక ప్రకారం తిమోజీ అనే ఒక హిందూ మహా సముద్రపు దొంగ సహాయంతో 2000 మంది సైనిక దళంతో, స్థానిక హిందువుల సహాయం తీసుకుని 1510లో బీజాపూర్ సుల్తానేట్ పైన దాడి చేసి గోవాని స్వాధీనం చేసుకున్నారు.
అల్మేడా హిందూ మహాసముద్రంలో పోర్చుగీస్ సముద్ర శక్తిని విజయవంతంగా స్థాపించిన తర్వాత సురక్షితమైన నావికా స్థావరం స్థాపించబడలేదు. హిందూ మహాసముద్ర సముద్ర మార్గాలన్నింటినీ నియంత్రించడానికి పోర్చుగీస్ శాశ్వత నౌకాదళాన్ని నిర్వహించగలిగే కేంద్ర నావికా స్థావరం అవసరం.ఈ స్థావరాన్ని గోవాలో స్థాపించారు.ఇది మంచి నౌకాశ్రయం, చురుకైన నౌకానిర్మాణ పరిశ్రమ మరియు ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉంది.
గోవా క్రైస్తవీకరణ మరియు విచారణ (ఇంక్విజిషన్)
అల్బుకెర్కీ కేవలం సుగుధ ద్రవ్యాల కోసం మాత్రమే కాదు.అరబ్ నుండి దిగుమతి చేసుకునే మేలు రకం గుర్రాల గురించి కూడా హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం చెలాయించాలనుకున్నాడు.అనుకున్నట్టుగానే జరిగింది.భారతదేశం మరియు మిగిలిన దేశాలు ఈ రెండు వస్తువుల గురించి పోర్చుగల్ వారి డిమాండ్లకు ఒప్పుకోవలసి వచ్చేది.ఇదంతా పక్కన పెడితే
అప్పుడే జరిగిన యుద్ధం లో ప్రాణాలను కోల్పోయిన లేదా బంధీలు కాబడ్డ హిందూ మరియు ముస్లింల భార్యలను తిరిగి వివాహం చేసుకుని రోమన్ కాథలిక్ మతంలోకి మార్చమని అల్బుకెర్కీ తన సైన్యానికి చెప్పారు.దాంతో మొత్తం పోర్చుగల్ సైన్యం మొత్తం అదే విధానాన్ని అనుసరించారు.అలా చేసిన వారందరికీ గోవాలో ఆస్తులు ఇవ్వబడ్డాయి.పైగా పోర్చుగీసు కార్యాలయాల్లో వారికి మంచి స్థానాలు లభిస్తాయి.కానీ చాలా మంది స్త్రీలు మతం మారడం ఇష్టం లేక ఆత్మహత్యలు చేసుకున్నారు.గ్రామ సంఘాలు మునుపటిలా నిర్వహించగలిగినా అక్కడ కూడా క్రైస్తవులకే ప్రాధాన్యత లభించింది.అయితే హిందువులు మాత్రం మతం మారడం ఇష్టం లేక తమ సంస్కృతిని పాటించారు.
పోర్చుగీసు వారి ప్రధాన లక్ష్యం గోవా హిందువుల మతం మార్చాలి.దీని కోసం మొదటి బిషప్ 1538లో గోవా కి వచ్చారు. అప్పటి వరకు క్రైస్తవులు మరియు హిందువులు (హిందువుల కంటే క్రైస్తవులకు ఎక్కువ సౌలభ్యాలు ఉన్నప్పటికీ,క్రైస్తవులకి ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ) స్వతంత్రంగానే బతికేవారు.కానీ అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి.హిందూ దేవాలయాల పైన దాడులు చేయడం మరియు దేవాలయాల ఆస్తులు చర్చిలు ఆక్రమించుకోవడం జరిగేది.
కానీ 1542లో మొదటి జెస్యూట్ గోవాకి వచ్చాడు.అతను ఒకే నెలలో ఒక గ్రామం లోని 10000 మందిని మతం మార్చాడని చెప్పుకుంటారు.చాలాసార్లు గోవా లో ఒక రోజు లోనే వందల మందిని మతం మారుస్తూ ఉండేవాడు.దానికి సంబంధించిన మిషనరీ స్కూళ్లను స్థాపించేవాడు.పైగా ప్రభుత్వం నుంచి కూడా బహుమతులు లాంటివి అందడం మరొక కలిసొచ్చే అంశం గా మారింది.క్రిస్టియన్ మిషనరీలు,చర్చ్ లు, కాన్వెంట్ లు విచ్చలవిడిగా వచ్చాయి.అలాగే కొంత మంది క్రిస్టయన్ తల్లి తండ్రులకు పుట్టామని చెప్పుకుంటే ఆస్థి వస్తుందని కుటుంబాలను మతం మార్చేవారు.ఇంత జరిగినా కొంత మంది మతం మారలేదు.మరికొంత మంది బయటకి మారినట్టు కనిపించినా రహస్యంగా తమ ఆచారాలను పాటించేవారు.
కానీ క్రైస్తవాన్ని విస్తరించాలనే లక్ష్యం తో అప్పటికే 1497లో యూదులను బలవంతంగా మతం మార్చాలని పోర్చుగల్ లో ఆదేశాలిచ్చారు.తర్వాత అక్కడ కూడా యూదుల పైన విచారణ చేపట్టి శిక్షలు విధించారు.అప్పటికే భారత్ లో యూదుల ఉండడంతో వారితో కలిసి నిర్భయంగా,స్వేచ్ఛగా తమ సంస్కృతిని పాటించవచ్చని వారు కూడా గోవాకి వచ్చారు.కానీ ఇక్కడ కూడా వాళ్ళు క్రైస్తవ్యాన్ని ప్రజల పైన రుద్దటం మొదలుపెట్టారు.అయితే ఇంకా మారని వాళ్ళు చాలా మంది ఉండడంతో వారి పైన ఆంక్షలు విధించటం మొదలుపెట్టారు.
హిందూ ఆలయాల పైన దాడులు చేసి వాటి ఆస్థులను కబ్జా చేసారు మరియు వాటిని క్యాథలిక్ చర్చ్ లకు రాసిచ్చారు.హిందూ పండుగలను జరుపుకోవడం, హిందూ పద్ధతిలో వివాహాలు చేసుకోవడం నిషేధించారు.కొంకణీ,ఉర్దూ, ఆంగ్ల భాషలను కూడా నిషేధించారు.ఆ భాషలలోని పుస్తకాలను, గ్రంధాలను తగలబెట్టారు మరియు అందకుండా చేసారు.అలాగే కొత్త రచనలు రాకుండా చేసారు. హిందువుల పైన జిజియా పన్ను లాగా క్జెండి పన్ను విధించారు.
1546న, హిందూ మతాన్ని నిషేధించాలని, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలని, హిందూ విందులను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిషేధించాలని, హిందూ పూజారులను బహిష్కరించాలని మరియు కఠినంగా శిక్షించాలని ఒక ఉత్తర్వు జారీ చేశాడు.క్రైస్తవేతరులకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎటువంటి పదవి లభించదు.కేవలం క్రైస్తవులకు మాత్రమే లభిస్తుంది.గ్రామ సభలలో హిందువుల స్థానాలను క్రిస్టియన్ లతో భర్తీ చేసారు.హిందువులు లేకుండా విచారణ, తీర్పు ఇవ్వొచ్చు, కానీ క్రిస్టియన్ లు లేకుండా అలా చేయకూడదు.క్రిస్టియన్లు మెజారిటీ ఉన్న గ్రామాలకు హిందువులు వెళ్ళకూడదు.న్యాయ విచారణలో హిందువుల సాక్ష్యం చెల్లదు.క్రిస్టియన్ల సాక్ష్యం మాత్రమే చెల్లుతుంది. చాలా ఆలయాలను కూల్చివేశారు.కొత్తవి కట్టకూడదు,పాతవి మరమ్మతులు చేయకూడదు అనే చట్టం చేశారు.హిందూ పూజారుల పైన దాడులు జరిగాయి.
తండ్రి లేని హిందువుల పిల్లలు, అనాధలు చర్చికి ఇచ్చేయాలి.క్రైస్తవ్యంలోకి మారిన హిందూ స్త్రీలకు తండ్రి ఆస్థి మొత్తం సంక్రమిస్తుంది.
ఇలా హిందువులను క్రైస్తవ్యంలోనికి మార్చడానికి అన్ని రకాల చట్టలు చేసారు. హిందువులను చిత్ర హింసలకు గురి చేస్తూ, వారికి ఏ హక్కూ లేకుండా చేసారు.అయినా చాలా మంది మారలేదు.మరికొంత మంది క్రైస్తవులుగా మారినట్టు నటిస్తూ తమ ఆచారాలను పాటించేవారు.ఇలాంటి వారిని శిక్షించడం కోసం గోవా విచారణను(గోవా ఇంక్విజిషన్) చేపట్టారు.
1560లో సుల్తాన్ ఆదిల్ షా పాత రాజ భవనంలో విచారణ మొదలు పెట్టారు.ఈ విచారణ కోసం అనేక మంది హిందువులను ఖైదీలుగా చేసారు.ఒకవేళ తమ మత చట్టాలకు వ్యతిరేకంగా నేరం ఋజువైనట్టయితే వారిని అత్యంత పాశవికమైన పద్ధతుల్లో హింసించి, చూపేవారు.
ఖైదీలకు భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు.కొరడాలతో కొట్టేవారు,మిషనరీల చేత కర్కశంగా హిందువుల గోళ్ళు మరియు కళ్ళు పీకేవారు.చెక్క పైన కట్టేసి సజీవంగా కాల్చేసేవారు,శరీరాలను నలిపివేసేవారు, చిన్న పిల్లలు స్త్రీలు తో సహా ఊళ్ళకు ఊళ్ళు తగలబడిపోయాయి.
పెద్ద పెద్ద చక్రాల మధ్య కట్టేసి తిప్పేవారు.అమాయక హిందూ, యూదుల ప్రతి ఎముక నుజ్జు నుజ్జుయ్యే వరకూ అలా చేసేవారు.హిందూ పిల్లలను దూరంగా తీసుకు పోయేవారు.తల్లిదండ్రుల ఎదురుగా పిల్లలను రాక్షసుల్లా సజీవ దహనం చేసేవారు.స్త్రీల స్థనాలను పట్టకారు లాంటి వస్తువుతో పట్టుకుని మెలి తిప్పి వాటిని పీకేసేవారు.
ఈ విచారణ మధ్యలో సరస్వత్ బ్రాహ్మణులు కొంత మంది తప్పించుకొని శివలింగాన్ని తమతో పాటు తీసుకొని పోయి హిందూ రాజ్యానికి చెందిన సోండే గ్రామంలో ఆలయాన్ని నిర్మించారు.యురోపియన్లు అనాగరికంగా హిందువుల గ్రామాలు నాశనం చేసి వారిని చిత్ర హింసలకు గురి చేసి చంపారు. అయినప్పటికీ చాలా మంది హిందూ మతాన్ని విడువలేదు మరియు అయిష్టంగానే విడిచిన వాళ్ళు తమ సంస్కృతి పైన ప్రేమని పోగొట్టుకోలేదు.మరికొంత మంది హిందూ మతాన్ని విడవడం ఇష్టం లేక,అలాగని ఈ శిక్షలు అనుభవించలేక గోవాని వదిలి పారిపోయారు,సరిగా తిండి లేక ఖైదీలుగా చనిపోయిన వారిని కూడా వదలలేదు.ఎలాగో వారిని ఏం చేయలేము కాబట్టి వారి దిష్టి బొమ్మలను తగలబెట్టేవారు.హిందుత్వం పైన అంత విద్వేషంతో రగిలిపోయారు వాళ్ళు..
1560లో మొదలైన ఈ విచారణ 1812 వరకు కొనసాగింది మరియు అనేక మంది హిందువులను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా వారి ప్రాణాలను సైతం తీసింది.చిన్న పిల్లలు,స్త్రీలు అని కూడా చూడకుండా ఎంతో మంది ప్రాణాలను కర్కశంగా తీసింది.
1812లో ఈ విచారణ నిలిపివేసిన తర్వాత దీనికి సంబంధించిన పత్రాలను అన్నింటినీ తగలబెట్టారు.దాని వలన ఎంత మంది ఈ విచారణ వల్ల బాధితులయ్యారో సరిగ్గా తెలుసుకోవడానికి వీలు లేకుండా పోయింది.దాదాపుగా 16000 మంది ఈ శిక్షలు అనుభవించారు అని ఒక అంచనా.కానీ ఆ పత్రాలు ఉంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చు.ఇంకా ఎన్ని రకాలుగా శిక్షలు అనుభవించారు అనేది కూడా తెలిసేది.చివరికి 2,50,000 మంది జనాభాలో 20,000 మంది కూడా హిందువులు లేకుండా పోయారు.ఈ విచారణ 1812 లో ఆగినప్పటికీ 1961లో గోవాని భారత్ విముక్తి చేసే వరకూ ఎన్నో దారుణాలను హిందువులు చవి చూడాల్సి వచ్చింది.
కానీ ఆ తర్వాత గోవా వాసులు కొంకణి భాషను తమ మాతృ భాష గా ఎంచుకున్నారు.మరియు ప్రేమించారు.అలాగే 1920ల చివరలో చాలా మంది క్యాథలిక్ గౌడ సరస్వతులు తిరిగి హిందూ మతం లోకి మారారు.
వారు బ్రిటిష్ బొంబాయి సతారా జిల్లా మసూర్ లోని ఆశ్రమ గురువు వినాయక్ మహరాజ్ మసుర్కర్ ని అభ్యర్ధించారు.అతను కాథలిక్ గౌడ మరియు కుంబిస్ ల హిందూ మతం పునరాగమనానికి అంగీకరించి శిష్యులతో కలిసి భక్తి గీతాలు పాడుతూ, పూజలు చేస్తూ గౌడ గ్రామాలలో తిరిగారు.దాని వల్ల చాలా మంది తిరిగి హిందూ మతం లోకి రావడానికి సుముఖత చూపారు.
రోమన్ కాథలిక్ చర్చి మరియు పోర్చుగీసు అధికారుల తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ 1928 ఫిబ్రవరి 23న భారీ ఎత్తున తిరిగి హిందూ మతం లోకి చేరారు.వారి పేర్లను కూడా మార్చుకున్నారు.మొత్తం 8,000 మంది వరకు ఈ సంఖ్య ఉంటుంది.
దురదృష్టం ఏంటంటే ఇంత దారుణమైన సంఘటన గురించి మన చరిత్ర లో ఎక్కడా చెప్పలేదు, ఎవ్వరికీ తెలియదు.
ఈ అమానుష చర్య పైన మీ అభిప్రాయం తెలియజేయండి.
Share on:
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
1947-1948 భారత్-పాకిస్థాన్ మొదటి యుద్ధం
కాశ్మీర్ ని కాపాడడానికి భారత్ పాకిస్థాన్ తో చేసిన మొదటి యుద్ధాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం.
స్వాతంత్ర్యం తర్వాత భారత సైన్యం చేసిన మొట్టమొదటి యుద్ధం గురించి మీకు తెలుసా?
స్వాతంత్ర్యం తర్వాత కాశ్మీర్ ని ఏ దేశం లోనూ కలపము,స్వతంత్రంగానే ఉంచుతామన్న కాశ్మీర్ చివరి రాజు మహారాజ హరి సింగ్ అక్టోబర్ 27,1947లో భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా ఎందుకు సంతకం చేయాల్సి వచ్చింది?
1815 ముందు జమ్మూ కాశ్మీర్ 22 చిన్న స్వతంత్ర్య రాజ్యాలుగా ఉండేవి.16 హిందూ రాజ్యాలు మరియు 6 ముస్లిం రాజ్యాలు ఉండేవి.వీటన్నింటినీ కలిపి పంజాబ్ లోని కొండ రాజ్యాలుగా పిలిచేవారు.1757 నుండి 1857 వరకూ రాజ్ పుత్రులు మొఘల్ సామ్రాజ్యం లో భాగంగా వారి రాజ్యాలను పాలించారు.తర్వాత బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చింది.బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆవిర్భావం మరియు మొఘల్ సామ్రాజ్య పతనం తర్వాత కొండ రాజ్యాల అధికారం క్షీణించింది.తర్వాత ఒక్కొక్కటిగా మొత్తం జమ్మూని సిక్కు నాయకుడు రంజింత్ సింగ్ స్వాధీనం చేసుకున్నారు.1845-46 మధ్య జరిగిన మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం లో ఈస్ట్ ఇండియా కంపెనీ కాశ్మీర్ పైన సార్వభౌమాధికారం సాధించింది.1846 లో లాహోర్ లో జరిగిన ఒప్పందం ప్రకారం సిక్కులు బ్యూస్ మరియు సట్లెజ్ నదుల మధ్య విలువైన భూమితో పాటు 12 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.కానీ అంత డబ్బు లేనందున సిక్కు రాజ్యం లోని కాశ్మీర్ ప్రాంతాన్ని డోగ్రా నాయకుడు గులాబ్ సింగ్ కి 7,50,000 రూపాయలకు అప్పగించింది. డోగ్రా రాజు స్వయం ప్రతిపత్తి కలిగిన కాశ్మీర్ రాజ్యానికి మొదటి రాజయ్యాడు.ఒక కొత్త రాజ వంశాన్ని స్థాపించాడు.
భారత్ కి స్వాతంత్ర్యం వచ్చి పాకిస్థాన్ భారత్ విభజన తర్వాత రెండు దేశాలూ జమ్మూ కాశ్మీర్ తమతో కలుస్తుందని కోరుకున్నాయి.భారత్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ భవిష్యత్తు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.కానీ కాశ్మీర్ మహారాజ హరిసింగ్ గారు మాత్రం ఏ వైపుకి వెళ్ళకుండా స్వతంత్రం గా ఉండాలని కోరుకున్నారు.దాని కోసం రెండు దేశాల నుండి నిలుపుదల ఒప్పందం కావాలని కోరాడు.పాకిస్థాన్ ఆ నిలుపుదల ఒప్పందం పై సంతకం చేసింది.
కానీ భారత్ మాత్రం దానికి ఒప్పుకోలేదు.తదుపరి చర్చల కోసం తమ ప్రతినిధిని ఢిల్లీ పంపాలని కోరారు.కానీ కాశ్మీర్ నుండి ఎవ్వరూ రాలేదు.మరొక వైపు షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కాశ్మీర్ పేరుతో ముస్లిం గిరిజనులు కాశ్మీర్ కి స్వతంత్రం కావాలని నిరసనలు మొదలుపెట్టారు.ఈ గొడవల వల్ల మహారాజ షేక్ అబ్దుల్లా ని అరెస్టు చేశారు.నెహ్రూ కూడా ఇది ముస్లిం ల పైన జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.ఈ దాడిని ఆపాలంటూ కాశ్మీర్ రాజుకి వ్యతిరేకంగా మాట్లాడారు.నెహ్రూ తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా ని విడుదల చేయాలని కోరారు.మౌంట్ బాటన్ మరియు పటేల్ కూడా కోరారు.కానీ మహారాజ దానికి ఒప్పుకోలేదు.దాంతో గిరిజనులలో తిరుగుబాటు మరింత ఆగ్రహం మొదలయ్యింది.
అలాగే పాకిస్థాన్ శాసనసభ ఏర్పడేంత వరకూ ఏ దేశంలో కలవాలి?లేదా నిశ్చలంగా ఉండాలని నిర్ణయం తీసుకోవద్దని మౌంట్ బాటన్ కోరారు.ముఖ్యంగా నెహ్రూ తన కాశ్మీర్ మూలాలు అలాగే తన స్నేహితుడు షేక్ అబ్దుల్లా కోసం కాశ్మీర్ భారత్ లో కలవాలి అని కోరుకున్నాడు.
అదే సమయంలో భారత్ జమ్మూ కాశ్మీర్ యొక్క నిలుపుదల ఒప్పందం ఇంకా ఎటూ తేలలేదని తెలిసి జిన్నా తన ప్రైవేటు సెక్యూరిటీ ఖుర్షీద్ హసన్ ని శ్రీనగర్ పంపి పాకిస్థాన్ తో విలీన ఒప్పందం గురించి మాట్లాడించారు."మీరు సార్వభౌమ అధికారం కలిగి ఉన్నారనీ,ఎవరి అనుమతి తీసుకోనవసరం లేదనీ, షేక్ అబ్దుల్లా లేదా నేషనల్ కాన్ఫరెన్స్ కి సమాధానం చెప్పనక్కర్లేదు అని రాసిన లేఖను ఖుర్షీద్ మహారాజ కి ఇచ్చాడు.నిలుపుదల ఒప్పందం పై పాకిస్థాన్ సంతకం చేసిన 12 రోజుల లోపునే హెచ్చరికను పంపించారు.మీరు పాకిస్థాన్ ని ఎంచుకోవలసిన సమయం ఆసన్నమైంది. పాకిస్థాన్ తో కలవాడానికి మీరు ఒప్పుకోకపోతే తీవ్ర ఇబ్బందుల్లో పడతారు అని హెచ్చరిస్తూ లేఖ రాసారు.మరోవైపు జవహార్ లాల్ నెహ్రూ మరియు గాంధీ కూడా కాశ్మీర్ భారత్ తో కలవాలని కోరుకున్నారు.నెహ్రూ మూలాలు కాశ్మీర్ లో ఉండడం, షేక్ అబ్దుల్లా తన మిత్రుడు కావడం కూడా కారణాలే.కానీ పాకిస్థాన్ లో కలవాలి అనుకున్న హైదరాబాద్ సంస్థానం నిజాం గురించి ఆలోచిస్తున్నారు ఆ సమయంలో.
జిన్నా షేక్ అబ్దుల్లా ని కూడా కాశ్మీర్ ని పాకిస్థాన్ తో కలపడానికి సహకరించాలని కోరారు.మత ప్రాతిపదికన,వస్తు సరఫరా మరియు భౌగోళికంగా కూడా కాశ్మీర్ పాకిస్థాన్ తోనే కలుస్తుందని జిన్నా ఆశపడ్డాడు.కానీ అబ్దుల్లా కూడా దానికి ఒప్పుకోలేదు.జిన్నా ఇస్లాం కి ఏకైక ప్రతినిధిగా మరియు ఇస్లాం రాజ్యం మొత్తానికి తనే అధికారంలో ఉండాలని కోరుకోవడం దానికి కారణం.జిన్నా ఇవన్నీ ఆలోచించి ఇక కాశ్మీర్ భారత్ తో కలిసిపోతుందని భయపడి చివరిగా బల ప్రయోగం చేసి కాశ్మీర్ ని లాక్కోవాలని అనుకున్నాడు.పైగా షేక్ అబ్దుల్లా కి కూడా తన స్నేహితుడు ప్రధాన మంత్రి గా ఉన్న భారత్లో కలిస్తేనే అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుంది అని అనుకున్నాడు.
1947 జూన్ లో 60,000 మంది మాజీ సైనికులు (ఎక్కువగా పూంఛ్ కి చెందిన వారు) మహారాజ కు వ్యతిరేకంగా పన్ను వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ ప్రచారం ఆగస్టు 14 మరియు 15 న పూంచ్ ముస్లిం లు పాకిస్థాన్ జెండా ఎగురవేయడంతో ఇది వేర్పాటు వాద ఉద్యమం గా మారింది.దాంతో మహారాజ అక్కడ మార్షల్ లా విధించారు.దాంతో మరింత కోపం తెచ్చుకున్న ముస్లిం లు NWFP యొక్క గిరిజనులు కూడా కలిసి వీరు తెచ్చిన మందు గుండు సామగ్రి తో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
సెప్టెంబర్ 4 1947న జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర దళాల కమాండర్ జనరల్ హెన్రీ స్కాట్ అనేక చోట్ల పాకిస్థానీలు చొరబడి ఆ ఉద్యమం లో కలుస్తున్నారనీ, వారి గురించి పాకిస్థాన్ తో చర్చించాలని చెప్పారు.అదే రోజున జమ్మూ కాశ్మీర్ ప్రధాని జనక్ సింగ్ ఈ విషయం అధికారికంగా పాకిస్థాన్ కి తెలియజేసి సరైన చర్యలు తీసుకోవాలని కోరారు.అయితే జమ్మూ నుండి కూడా చాలా మంది హిందువులు సియాల్ కోట్ లో చొరబడుతున్నారంటూ ఆరోపణ చేసి ఆ విషయాన్ని పట్టించుకోలేదు.కానీ పాకిస్థాన్ ప్రోత్సాహం తో రెచ్చిపోయిన తిరుగుబాటు దారులు అనేక దాడులకు పాల్పడుతున్నారు. పైగా అందులో చాలా మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ప్రపంచ యుద్ధం లో పాల్గొన్నవారే కావడంతో,వాళ్ళకి యుద్ధ విద్యలు, ఆయుధాలను ఉపయోగించడం తెలియడం వల్ల ఆ దాడులు మరింత దారుణంగా తయారయ్యాయి.
ఇక ఇవన్నీ చూస్తూ విసిగిపోయిన మహారాజ చివరికి కాశ్మీర్ చేజారిపోతుంది, పాకిస్థాన్ చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని భయపడి షేక్ అబ్దుల్లా ని విడుదల చేసారు.అతను విడుదలైన వెంటనే మహారాజ కు వ్యతిరేకంగా కాశ్మీర్ స్వేచ్ఛ ని కోరుకుంటుందని బహిరంగ సభలో పునరుద్ఘాటించారు.
22 అక్టోబర్ 1947న పాకిస్థాన్ NWFP నుండి గిరిజనులను కలుసుకుని ఆపరేషన్ గుల్మార్గ్ ప్రారంభించారు.పాకిస్థాన్ ఆర్మీ జనరల్ ప్రత్యక్ష నియంత్రణలో ఆధునిక ఆయుధాలను అందించి సుమారు 2000 మంది గిరిజనులు బస్సుల్లోనూ నడక మార్గం లోనూ ముజఫరాద్ కి పంపారు.ఈ ఆక్రమణదారులు అక్కడ నుండి ఉరి మరియు బారాముల్లా చేరుకుని అక్కడ మహారాజ సైన్యం పైన దాడులు చేసి తమ స్వాధీనం చేసుకున్నారు.దాంతో శ్రీనగర్ ని కూడా స్వాధీనం చేసుకోవడానికి పెద్ద గా సమయం పట్టదని మహారాజ సైనిక సహాయం కోసం భారత్ కి విజ్ఞప్తి చేశారు.
ఈ అభ్యర్ధన అక్టోబర్ 25న మౌంట్ బాటన్ నేతృత్వంలో నెహ్రూ,పటేల్,బల్దేవ్ సింగ్ ,పోర్ట్ ఫోలియో లేని మంత్రి గోపాలస్వామి అయ్యంగార్ మరియు సైన్యం, వైమానిక దళం, నావికా దళాల బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ తో సహా జరిగిన భారత రక్షణ కమిటీ సమావేశంలో పరిగణించబడింది.
లెఫ్టినెంట్ జనరల్ కె.కె. ప్రకారం కాశ్మీర్ ప్రభుత్వం అప్పటికే అభ్యర్ధించిన ఆయుధాలు మరియు మందు గుండు సామగ్రి పంపడం తక్షణ అవసరమని ఇవి శ్రీనగర్ ప్రజలని రైడర్ ల నుండి కొంత వరకూ కాపాడుతుందని నిర్ణయించారు.కానీ మౌంట్ బాటన్ మాత్రం కాశ్మీర్ ని భారత్ లో కలిపేంత వరకు సైన్యాన్ని పంపడం సరైన నిర్ణయం కాదని చెప్పారు.అలా చేస్తే భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.అలాగే ఆ చేరికని తాత్కాలికంగా భావించాలనీ, కాశ్మీర్ లో శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా దాని భవిష్యత్తు నిర్ణయించవచ్చని చెప్పారు.అదేరోజు స్పాట్ అధ్యయనం కోసం రాష్ట్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి వి.పి.మీనన్ గారిని శ్రీనగర్ కి పంపారు.మరుసటి రోజు తిరిగి వచ్చిన ఆయన అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ వెంటనే దళాలను పంపి రైడర్ల నుండి కాశ్మీర్ ని కాపాడడం చాలా అత్యంత అవసరమనీ తెలియజేశాడు.
ఈలోగా కాశ్మీర్ కొత్త ప్రధాని మెహర్చంద్ మహజన్ గారు మేము 25 సాయంత్రం లోపు విమానం వస్తే భారత్ కి వస్తామనీ, లేకపోతే పాకిస్థాన్ తో కలిసిపోతామనీ హెచ్చరించారు.
మహారాజ కు ప్రభుత్వ అభిప్రాయాలు తెలియజేసేందుకు మీనన్ ని జమ్మూ కి పంపారు. చివరికి అక్టోబర్ 26న మహారాజ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ పైన సంతకం చేసి,మహజన్ తో కలిసి మీనన్ తిరిగి ఢిల్లీ వచ్చారు.ఈ విలీన సాధనం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రక్షణ, కమ్యూనికేషన్ మరియు విదేశీ వ్యవహారాల విషయాలలో భారత్ కి పరిమిత ప్రవేశం ఉంటుంది.ఈ పరికరంలో ఉన్నవి
నిబంధన 4: మహారాజ భారతదేశం లో తన రాజ్య విలీనాన్ని ప్రకటించారు.
నిబంధన 5: వాయిద్యం యొక్క నిబంధనలు మారవు మరియు ఏదైనా చట్టం చేయాలంటే/ మార్చాలంటే దానికి జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఆమోదించాలి.
నిబంధన 6: భూసేకరణ కి సంబంధించి రాష్ట్రంలో చట్టాలు చేసే అధికారం భారత యూనియన్ కి లేదు.మరియు చట్టాలు అనుమతిస్తే తప్ప జమ్మూ కాశ్మీర్ లో భూమిని కొనడం అసాధ్యం.
నిబంధన 7: మహారాజ భవిష్యత్తు భారత రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన అవసరం లేదు మరియు మహారాజ ని ఈ విషయంలో బలవంతం చేయడానికి భారత్ కి హక్కు లేదు.
నిబంధన 8: ఈ నిబంధన లో ఏ విషయం కూడా మహారాజ సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేయలేదు.
నిబంధన 9: రాష్ట్రం తరపున సంతకం చేశారు కాబట్టి మహారాజ ని జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రతినిధి గా గుర్తించడం జరుగుతుంది.
నవంబర్ 1,1947లో మొదటి సారిగా లాహోర్ లో భారత దేశ గవర్నర్ లార్డ్ మౌంట్ బాటన్ మరియు పాకిస్థాన్ గవర్నర్ మహమ్మద్ అలీ జిన్నా తో సమావేశం జరిగింది.దానిలో ప్రజాభిప్రాయ సేకరణ చేద్దామన్నారు.షేక్ అబ్దుల్లా అధికారిగా ఉండడం వల్ల కాశ్మీర్ భారత్లో కలుస్తుందని నమ్మకం తో ఉన్నారు నెహ్రూ.కానీ అదే కారణంతో జిన్నా దీనికి ఒప్పుకోలేదు.
ఎట్టకేలకు గిరిజనుల దండయాత్ర తిప్పికొట్టేందుకు భారత సైన్యాన్ని విమానంలో శ్రీనగర్ కి పంపారు.షేక్ అబ్దుల్లా చే నియమించిన మిలీషియా సైన్యం ద్వారా శిక్షణ పొందారు.
జనవరి 1 1948న నెహ్రూ అధికారికంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కి తీసుకెళ్ళారు.1948 లో జమ్మూ కాశ్మీర్ ఆజాద్ కాశ్మీర్ సైన్యం మరియు భారత సైన్యం మధ్య యుద్ధం జరిగింది అని పేర్కొన్నారు.
మే 1948 నాటికి పూంచ్-పశ్చిమ పంజాబ్ సరిహద్దు లో భారత సైన్యం విజయం సాధించింది.ఆజాద్ కాశ్మీర్ సైన్యానికి అండగా పంపడానికి పాకిస్థాన్ తన సైన్యాన్ని బహిరంగంగా సిద్ధం చేసింది.
కానీ 1948 ఆగస్టు 13న పాకిస్థాన్, భారత్ తమ సైన్యాలను వెనక్కి తీసుకోవాలని, ఆజాద్ కాశ్మీర్ సైన్యం ఉపసంహరించుకోవాలని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసింది.అలాగే కాశ్మీర్ లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని అందులో ఉంది.
భారతీయ సైనిక వర్గాల ప్రకారం పాక్ ఆర్మీ ఆపరేషన్ గుల్మార్గ్ అనే ప్రణాళికను సిద్ధం చేసింది.1947 ఆగస్టు 27 నాటికి దీన్ని అమలులోకి తీసుకొని వచ్చింది.
బన్నూ బ్రిగేడ్ లో పని చేస్తున్న OS.కల్కట్ అధికారికి అనుకోకుండా తెలిసింది.పథకం ప్రకారం పష్తూన్ గిరిజనులతో కూడిన 20 గిరిజన మిలీషియా లష్కర్లు ఒక్కొక్క దానిలో 1000 మందితో బయలుదేరారు.వీరందరూ ఆయుధాలను కలిగి ఉన్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో పెషావర్, కోహట్,థాల్ మరియు నౌషేరా, అక్టోబర్ 18 న అబోటాబాద్ లాంచింగ్ పాయింట్ కి, జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళాలని అనుకున్నారు.అక్టోబర్ 22కి 10 లష్కర్లు ముజఫరాబాద్ మీదగా కాశ్మీర్ లోయ పై దాడి చేయాలని ఊహించారు. మరో పది లష్కర్లు పూంఛ్,భీంబర్ మరియు తిరుగుబాటు దారులతో చేరాలని ఆలోచన. జమ్మూ కాశ్మీర్ కి వెళ్ళడానికి ఆయుధాలతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు కదిలారు.
కాశ్మీర్ లో ఈ అలజడుల వల్ల మహారాజ హరిసింగ్ భయపడ్డారు.అక్టోబర్ 24,1947న భారతదేశానికి ఈ దండయాత్ర గురించి మొదటి సమాచారం అందింది.ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తుంది భారత్.వెంటనే అదే రోజు రాత్రి 11.00 గంటలకు భారత్ ని అత్యవసరంగా సహాయం కోసం అడిగారు.షేక్ అబ్దుల్లా కూడా ఎక్కడ పాకిస్థాన్ కాశ్మీర్ ని చేజిక్కించుకుంటుందోనని భయపడి సైనిక సహాయం అడిగారు.కానీ భారత్ మాత్రం కాశ్మీర్ ని విలీనం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.తర్వాత రోజు మధ్యాహ్నం వి.పి.మీనన్ గారు జమ్మూ కి చేరుకుంటారు మరియు మహారాజ సంతకం చేసిన ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎక్సెషన్ తో ఢిల్లీ కి తిరిగి వస్తారు.
భారత గవర్నర్ ఈ పత్రాన్ని ఆమోదించడంతో అక్టోబర్ 26న కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమైంది.దీంతో మరింత కోపానికి గురైన జిన్నా ఇంకా ఆక్రమణదారులను పంపించింది.
భారత రక్షణ(భారత్-పాక్ యుద్ధం 1947-48):
1947 అక్టోబర్ 27 న రాష్ట్రాన్ని ఆక్రమణదారుల నుండి కాపాడడానికి గుర్గావ్ లో లెఫ్టినెంట్ కల్నల్ దివాన్ రంజిత్ రాయ్ ఆజ్జాపనతో ఢిల్లీ లోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం నుండి 5.00 గంటలకు 1 సిఖ్ఖు బెటాలియన్ భారత సైన్యం నాలుగు డకోటా విమానాల్లో బయలుదేరి 8.30 గంటలకు శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంది.ఈ మిషన్ కి ఆపరేషన్ జాక్ అనే పేరు పెట్టారు.అలా యుద్ధానికి మొదటి అడుగు పడింది.
భారత రెస్క్యూ మిషన్ మొదటి నుండి తీవ్ర ఇబ్బందులతోనే ముందుకు సాగింది. శ్రీనగర్ భారత్ సరిహద్దు కి 480 కి.మీ. దూరం లో పంజాబ్ దళాలు శరణార్ధలను కాపాడడంలో, శాంతి భద్రతల పరిరక్షణలో నిమగ్నమై ఉండటం వల్ల వాయు రవాణా ఒక్కటే మార్గం ఉంది.కానీ అధ్వాన్నమైన విషయం ఏంటంటే? అక్కడ విమానాల ల్యాండింగ్ కి అస్సలు అనుకూలంగా లేదు.అయినా తప్పని సరి పరిస్థితుల్లో దాన్నే ఎంచుకోవాల్సి వచ్చింది.
శ్రీనగర్ కి చేరుకున్న వెంటనే శత్రువులు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నారు.మొదటి కంపెనీని బారాముల్లా పొలిమేరలకు తరలించారు.నాలుగువేల మంది బలవంతులైన రైడర్స్ దాడులు చేస్తున్నారక్కడ.వారి పైన పోరాడుతున్న డోగ్రా దళాలకు ఈ కంపెనీ సహాయం గా నిలిచింది. దళాలు ముందుకు సాగుతూ శ్రీనగర్ ని రక్షించాయి.1947 నవంబర్ 13న ఉరి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంతో శ్రీనగర్ కి ముప్పు తప్పింది.పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో కూడా రైడర్లు దోపిడీలు, మానభంగాలు వదిలేసి పారిపోయారు.
దీనిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన లెఫ్టినెంట్ కల్నల్ రాయ్ గారికి మహావీర చక్ర అవార్డు ఇవ్వబడింది.
ఈ క్రమంలో అక్కడ జరిగిన యుద్ధాలు:
బద్గాం,ఝాంగర్ ని స్వాధీనం చేసుకోవడం,నౌషారా యుద్ధం తితావల్ కి చేరుకోవడం, పూంచ్ లో ఉపశమనం మరియు చంబ్ నుండి తిత్వాల్ కి చేరుకున్న యుద్ధం.
బద్గాం యుద్ధం:
నవంబర్ 3న 4 కుమవోలు,3 కంపెనీలు బద్గాం వద్ద పెట్రోలింగ్ విధుల్లో పాల్గొన్నారు.
ఒక గిరిజన లష్కర్ 700 మంది చొరబాటు దారులు గుల్మార్గ్ నుండి బద్గామ్ చేరుకున్నారు.స్థానికుల ఇళ్ళ నుండి సుమారు 2.30 గంటల సమయంలో అకస్మాత్తుగా కంపెనీ పై కాల్పులు జరిపారు.సైన్యం 7:1 నిష్పత్తి లో చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. మేజర్ సోమనాథ్ శర్మ.డి సైనికులను ధైర్యం గా పోరాడమని కోరారు.1 కుమవోన్, రిలీఫ్ కంపెనీ తోడయ్యారు.బద్గాంని స్వాధీనం చేసుకున్నారు.కానీ దాదాపుగా 200 మంది రైడర్ల చేతిలో చనిపోయారు.
ఝంగర్ పతనం ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడం:
1947 డిసెంబర్ 24న ఝంగర్ ని శత్రువులు ఆక్రమించారు.ఈ ప్రాతం శత్రువులకు చాలా
ప్రయోజనకరంగా మారింది.అందుకే ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం భారత్ కి చాలా అత్యవసరమైనదిగా మారింది.
ఝంగర్ ని స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించి, రెండు దశల్లో పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేసారు.
మొదట దశలో ఒక రాజ్ పుత్,ఒక డోగ్రా,ఒక కుమవోన్ తో కూడిన 19వ స్వతంత్ర బ్రిగేడ్ మరియు అనుబంధ యూనిట్లు,pt.3327 మరియు 3283.
రెండవ దశలో 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠా Li,3(పారా) రాజ్ పుత్,1 పటియాల మరియు అనుబంధ యూనిట్లు,Pt.2701,ఝంగర్,Pt.3399 మరియు Pt.3374, 7ఆశ్విక దళాన్ని కూడా నియమించారు.
ఆపరేషన్ సమయంలో కీలకమైన, వ్యూహాత్మక పాయింట్లలో ఒకటైన పీర్ థిల్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.
మార్చి 15న మరాఠ Li పీర్ థిల్ లో ప్రమాదకర నిఘా కోసం పంపబడింది.మార్చి 17కి పీర్ థిల్ ని విజయవంతంగా కైవసం చేసుకున్నారు.దాంతో ఝంగర్ పైన చివరి దాడికి మార్గం సుగమమైంది.
మార్చి 18న దాడి మొదలయ్యింది.అదే రోజున 3(పారా) రాజ్ పుత్ సైన్యం,Pt.3477 ఝంగర్ ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత 50 పారా బ్రిగేడ్ గ్రూప్,3(పారా) మరాఠ Li, 3(పారా) రాజ్ పుత్,1 పాటియాలా ఈ ప్రాంతంపై కేంద్రీకృతమై ఉంటాయి.
నౌషేరా లో విజయం:
ఫిబ్రవరి 6,1948 న నౌషేరాలో యుద్ధం చేయడానికి వ్యూహం సిద్ధమైంది.బెరి పట్టాన్ చుట్టు పక్కల నుండి శత్రువులను తరిమివేయడానికి ఆపరేషన్ సత్యనాస్ ప్రారంభించి జాట్ 2 యొక్క కో లెఫ్టినెంట్ కల్నల్ ఆర్.జి.నాయుడిని నియమించారు. జనవరి 23న దళాలు తుంగ్ ని ఆక్రమించాయి మరియు జనవరి 25న ఉదయం సియోట్ మరియు పండిట్ పైన దాడి చేయడానికి వెళ్ళారు.Pt.2502 వారు అక్కడికి వచ్చారు మరియు శత్రువులతో భీకరంగా పోరాడారు. చివరికి శత్రువులు అక్కడ నుండి పారిపోయారు.100 మంది శత్రువులు మరణించి ఉంటారని లేదా గాయపడి ఉంటారని అంచనా.
తిత్వాల్ యుద్ధం:
మొత్తం కాశ్మీర్ లో జరిగిన ఆపరేషన్ లలో ఈ తిత్వాల్ చాలా భయంకరమైనది మరియు సుదీర్ఘమైనది.పష్టూన్ గిరిజన మిలీషియా 1947-48 ప్రాంతంలో పాకిస్థాన్ సరిహద్దుని దాటి ఆక్రమించింది.ఈ తిత్వాల్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన గ్రామం. 1948 అక్టోబర్ 13న పాకిస్థాన్ సైన్యం భారీ దాడిని ప్రారంభించింది,భారత సైన్యం ఉన్న పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆ దాడులు జరిగాయి.కానీ భారత సైన్యం ప్రదర్శించిన పరాక్రమం వలన భారీ ప్రాణ నష్టం తో ఘౌరంగా విఫలమయ్యారు.భారత సైన్యం యొక్క ఆత్మ స్థైర్యం మరియు సంకల్పం వలన తిత్వాల్ ను మనం కాపాడుకోగలిగాం.
1 సిక్కు,1 మద్రాస్,6 రాజ్ పుత్ రైఫిల్స్ బెటాలియన్స్ పాల్గొన్నారు.1948 జూలై 18న సీహెచ్ఎం పీర్ 6 రాజతానా రైఫిల్స్ కి చెందిన సింగ్ శత్రువులు ఆక్రమించిన దాడి చేసి కాపాడే పనిలో ఉన్నారు.అత్యంత శౌర్యాన్ని ప్రదర్శించినందుకు, ధైర్య సాహసాలనతో పరాక్రమవంతంగా పోరాడినందుకు అతనికి పరమ వీర చక్ర లభించింది.
ఉత్తర రంగం:
లడఖ్ ప్రావిన్స్ లోని ఈ పశ్చిమ భాగం ఇరవయ్యవ శతాబ్దపు ముందు రోజుల్లో డోగ్రా రాజుల పాలనలో ఉండేది.తర్వాత మహారాజ హరిసింగ్ బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చారు.బ్రిటిష్ ఇండియా మరియు రష్యన్ సామ్రాజ్యం మధ్య ఎత్తైన రక్షణాత్మక ప్రాంతంగా ఉండేది.గిల్గిట్ మరియు బాల్టిస్థాన్ నుండి ఈ ప్రాంతం గ్రేట్ హిమాలయాలలోని నంగా పర్వతాల మీదుగా 4000 మీటర్ల ఎత్తులో ఉన్న బుర్జిల్ పాస్ గుండా వేరు చేయబడింది.ఈ ప్రాంతంలో చాలా గొప్ప యుద్ధం జరిగింది.
కాశ్మీర్ యొక్క ఉత్తర ఫ్రంట్ లో గురైస్,స్కర్డ్,ద్రాస్, కార్గిల్ మరియు ద్రాస్ సెక్టార్ లు ఉన్నాయి.నవంబర్ 1947 నుండి ఆగస్టు 1948 వరకు ఈ ప్రాంతంలో శత్రువులు గొప్ప విజయం సాధించారు.దక్షిణం వైపు తొలి విజయం తో ఉబలాటంతో తీవ్రవాదులు అండగా నిలిచారు. తిరుగుబాటు చేయడంలో గిరిజనులు ప్రముఖ పాత్ర వహించారు.గిల్గిట్ 1947 అక్టోబర్ 31న గిల్టిట్ స్కౌట్స్ యొక్క పెద్ద విభాగం తో బలోపేతం చేయబడింది.దీనిలో ఒక రెజిమెంట్ స్థానిక షియా ముస్లిం మెజారిటీ జమ్మూ కాశ్మీర్ దళాలలో ఒక భాగం.ఈ దళానికి బ్రిటిష్ అధికారి మేజర్ బ్రౌన్ నాయకత్వం వహించారు.బ్రిటిష్ సైన్యం చేసిన అనేక సైనిక చర్యల్లో ఇది ఒకటి.తదుపరి దశల్లో రైడర్లు చేసిన తిరుగుబాటు దాడులకు పాకిస్థాన్ సైన్యం సహాయం చేసింది.అయితే వారికి వ్యతిరేకంగా భారత సైన్యం తన అసమాన శౌర్యం,పరాక్రమం చెప్పుకోదగ్గది.
స్కార్డ్ ముట్టడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 11 ఫిబ్రవరి 1948 న స్టార్డ్ పైన శత్రువులు దాడి చేశారు.ఆ రోజు నుండి ఆగస్టు 13 వరకు ఆరు నెలలు పాటు స్టార్డ్ శత్రువుల చేతిలో ఉండిపోయింది.శత్రువులు ఫిబ్రవరి 1948 లో 16000 ఎత్తులో ఉన్న జోజిలా పాస్ ని దాటడానికి ప్రయత్నించారు.కానీ ఆ సమయంలో భారత సైన్యం అసమానమైన శౌర్యాన్ని కనబరచి అడ్డుకున్నారు.
నవంబర్ 1947న లెఫ్టినెంట్ కల్నల్ షేర్ జంగ్ థాపా 6 జమ్మూ కాశ్మీర్ పదాతిదళానికి చెందిన అతని సైన్యం బయలుదేరి డిశంబర్ 3న ఒక కోటకి చేరుకుని స్థిరపడ్డారు.శత్రువులు ఆధునిక రైఫిల్స్ ని కలిగి వాటిని ఉపయోగించడంలో నిపుణుల నాయకత్వం లో ఉన్నారు.మొత్తం 285 సైన్యం తో కెప్టెన్ థాపా 600 మంది శత్రువుల పైన పోరాడి గెలిచారు.
శత్రువులు లేహ్ పైన దాడి చేయడానికి లేహ్ మరియు కార్గిల్ ని దాటారు.వ్యవస్థీకృత రక్షణ ఉన్నప్పటికీ మే మూడో వారం నాటికి పరిస్థితి చాలా ప్రమాదకరం గా తయారైంది. కానీ అప్పుడు సైనికులకు శత్రువుల పైన దాడి చేయడానికి మిగిలిన ఏకైక మార్గం వాయు మార్గం.
భారత దేశం లో సైనిక విమానయాన రెడ్ లెటర్ సమయానికి ఎయిర్ కమాండర్ మెహర్ సింగ్ కూడా ఉన్నారు.24 మే 1948న మేజర్ తిమ్మయ్యతో కలిసి లేహ్ లో దిగారు. తర్వాత రెండు వారాల్లో మరిన్ని విమానాల్లో సైన్యం లేహ్ కి చేరుకుంటాయి.2/4 గూర్ఖా రైఫిల్స్ ని కూడా చేర్చారు.మెహర్ సింగ్ ధృడ నాయకత్వం లో పైలట్లు చేసిన సాహసోపేతమైన విన్యాసాలకు మహావీర చక్ర అందించబడింది.తర్వాత 2/8 గూర్ఖా రైఫిల్స్ ను చేర్చారు.
1948 వేసవిలో రైడర్లు కార్గిల్ మరియు ద్రాస్ చుట్టుపక్కల పట్టుని బిగించారు.పాకిస్థాన్ ఫ్రాంటియర్ రైఫిల్స్ గన్స్కర్ ఆశ్రమానికి చెందిన లామాని చంపారు. కార్గిల్ లో బౌద్ధ సన్యాసులను సామూహికంగా హత్యలు చేసారు.లడఖ్ లో రెండవ అతి పెద్ద మఠమైన్ రంగ్ డమ్ డొంపాని అపవిత్రం చేసి, ధ్వంసం చేశారు.
జోజిలా పాస్ ని స్వాధీనం చేసుకోవడానికి 77వ పారా బ్రిగేడ్ పదాతి దళాలు పదే పదే చేసిన దాడులు విఫలమయ్యాయి.
1948 ఆగస్టు-సెప్టెంబర్ మధ్య జనరల్ తిమ్మయ్య ఒక సాహసోపేతమైన ఆపరేషన్ ని ప్లాన్ చేసారు.
అక్టోబర్ 1948 మధ్యలో జమ్మూ నుండి 7వ లైట్ కావల్రీకి చెందిన స్టువర్ట్ లైట్ ట్యాంకులు శ్రీనగర్ కి రహస్యంగా కదిలాయి. శ్రీనగర్ నుండి ఈ ట్యాంకులు 80 కి.మీ. దూరంలో కల బాల్తాల్ వైపుకి రవాణా చేయబడ్డాయి.వీరికి మేజర్ తంగరాజు ఆధ్వర్యంలోని మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూపు ఇంజనీర్లు మాత్రమే కాదు రెండు కంపెనీలు అద్భుతంగా సహకరించాయి.జమ్మూ నుండి శ్రీనగర్ వరకు చెక్క వంతెనల మీద మార్గం సుగమమైంది.కానీ బాల్టాల్ నుండి జోజిలా పాస్ వరకు ట్యాంక్ రవాణాకి ఉపయోగపడే ట్రాక్ లను రోడ్డు చివరన కొన్ని గజాల వరకూ వేసారు.ట్రాక్ వేస్తున్నప్పుడు లెఫ్టినెంట్ కల్నల్ రాజేందర్ సింగ్ స్పారో ఆధ్వర్యంలో రెజిమెంట్ కొన్ని రోజుల పాటు గడ్డ కట్టే చలిలో శత్రువుల కాల్పులను తిప్పికొట్టారు.
1 నవంబర్ 1948న జొజిలా పాస్ నుండి శత్రువులను దిగ్భ్రాంతికి గురి చేస్తూ వారిని తరిమి కొట్టారు.తర్వాత రెండు వారాల్లో ట్యాంకులు మరియు యుద్ధ విమానాల ద్వారా సంయుక్తంగా దాడులు చేశారు.హోరాహోరీ పోరు తర్వాత భారత సైన్యం లేహ్ మరియు ద్రాస్ లను స్వాధీనం చేసుకున్నారు.కార్గిల్ దండుకి చెందిన కాశ్మీర్ పదాతి దళాలు మరియు లేహ్ దండుతో కలిసి పాకిస్థాన్ సైనికులు మరియు రైడర్స్ పదే పదే చేసే దాడులను ఆపడానికి పట్టణం ముందు రక్షణగా నిలబడ్డారు.
పాకిస్థాన్ తో భారత సైన్యం ఇలా వీరోచితంగా పోరాడుతూ కాశ్మీర్ ని కాపాడుతున్న సమయంలో నెహ్రూ 13 ఆగస్టు 1948న యునైటెడ్ నేషన్స్ కి చేసిన ఫిర్యాదుతో 5 జనవరి 1949న సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చింది.దీని వలన రెండు దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకున్నారు.దాంతో కాశ్మీర్ లో దాదాపు 30 శాతం భూభాగం పాకిస్థాన్ చేతిలో ఉండిపోయింది.కానీ కాశ్మీర్ రక్షణ కోసం భారత బలగాలను అనుమతిస్తారు.
మొత్తానికి 15 నెలల పాటు తీవ్రంగా కష్టపడి, కఠినమైన మార్గంలో కష్టపడి భయంకరమైన యుద్ధాలు చేసి శ్రీనగర్, బారాముల్లా,నౌషేరా,ఝంగర్,రాజౌరి,మెంథార్,పూంఛ్,స్క్వార్డ్,లేహ్, జోజిలా పాస్ ఇలా శత్రువుల చేతిలో చిక్కిన ఎన్నో ప్రాంతాలను ఆలస్యం గా అయినా సమర్ధవంతంగా స్వాధీనం చేసుకోగలిగారు.సరైన ఎయిర్ బేస్ లు, కమ్యూనికేషన్ లేకపోయినా వాటి సమర్ధవంతమైన సిబ్బంది,సైనికులు పటిష్టమైన నాయకత్వం లో కాశ్మీర్ ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.వారి శారీరక మరియు మానసిక ధైర్యం, వృత్తి నైపుణ్యం, అంకిత భావం, సంకల్పం, నిబద్ధత ప్రతికూ మరియు కఠినతరమైన వాతావరణంలో శత్రువులను తిప్పి కొట్టడంలో విజయం సాధించేలా చేసాయి.
మన సైన్యం ధైర్య సాహసాలు మన దేశానికి గర్వకారణంగా నిలిచాయి.
మేజర్ సోమనాథ్ శర్మ, లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే,నాయక్ జాదునాథ్ సింగ్,L/Nk కరమ్ సింగ్ మరియు CHM పిరు సింగ్ వారి అసమానమైన ధైర్య సాహసాలకు పరమ వీర చక్ర ని పొందారు.
ఇంత వీరోచితంగా పోరాడిన మన సైన్యం గురించి,ఈ యుద్ధం గురించి మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత విభజన సమయంలో మారణహోమం
ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే
ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం ఒక మతాన్ని విమర్శించడం,ఒక వర్గాన్ని తప్పు పప్పడం కాదు.యుగయుగాలుగా ఎన్నో దాడులను ఎదుర్కొని ఇప్పటికీ ఈ ఈ భూమి పైన నిలబడిన ఒకే ఒక్క పురాతన ధర్మం పైన దాడుల గురించి మరీ ముఖ్యంగా దేశ విభజన సమయంలో జరిగిన అమానుష దాడులను తెలియజెప్పడానికి.ఎందుకంటే భారత సైన్యం భారత దేశం ఏర్పడిన తర్వాత చేసిన మొట్టమొదటి యుద్ధం నుండి వివరంగా చెప్పాలని ప్రయత్నించినప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు ఈ అంశం నాకు ఎదురుపడింది.అవును భారత దేశం ఏర్పడిన తర్వాత మొట్టమొదట జరిగిన ఈ మారణహోమం గురించి తెలియజేసి ముందుకు వెళ్ళాలని కొన్ని ఆధారాలను సేకరించి వాటిని జాగ్రత్తగా ఒక కథ రూపంలో రాసి మీ ముందుకు తీసుకు రావాలనేదే నా ప్రయత్నం.ఇక్కడ నేను చెప్పింది లెక్కల్లో చూపించిన, దాడులు జరిగిన కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు మాత్రమే.నిజానికి వాస్తవికత ఇంతకంటే మహా దారుణంగా ఉంటుంది.అవి నాకు తెలిసినప్పటికీ సరైన ఆధారాలు లేక ఇవి మాత్రమే రాస్తున్నాను.అర్ధం చేసుకోగలరు.
1947 అగస్టు 15వ తారీఖున భారత దేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చి దేశం విడిచి వెళ్ళితామని సంవత్సరం ముందు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది.
అప్పటి వరకు బ్రిటిష్, ఫ్రెంచ్, పోర్చుగీసు మొదలైన నిరంకుశ పాలనలో బానిసలుగా బ్రతికిన భారతీయులు, స్వాతంత్ర్యం కోసం ఎంతో ప్రాణ త్యాగం చేసి, మరెంతో మంది జైలు లో అత్యంత కఠిన శిక్షలు అనుభవించి,మరి కొందరు ఇంకా ఎన్నో త్యాగాలు చేసి ఎంతో ఆనందంగా వచ్చే స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా అప్పటి వరకు హిందువులు మొఘలుల, తురుష్కుల, ముస్లిం ల పాలనలో
ADVERTISEMENT
మంచి ఆకర్షణీయమైన క్యారియర్ చాలా తక్కువ ధరకే అమెజాన్ లో లభిస్తుంది.త్వరపడండి.
SOPL-OLIVEWARE Alloy Steel Teso Pro Lunch Box with Bottle, 3 Stainless Steel Containers, Plastic Pickle Box | Steel Spoon & Fork | Insulated Fabric Bag | Leak Proof | Microwave Safe | Full Meal | Blue
సబక్తజిన్ పెషావర్ వద్ద జయపాలుని ఓడించి,15000 మంది హిందువులను ఓడించి,5,00,000 మంది పిల్లలు,స్త్రీలతో సహా బందీలుగా చేసి హింసించాడు, తర్వాత బులందషహర్ వద్ద కుల చంద్రుని ఓడించి 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ బిన్ ఖాసిం బ్రాహ్మణబాద్ లో 16,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘజినీ సోమనాథ్ దేవాలయంలో 50,000 మంది హిందువులను చంపాడు,
మహమ్మద్ ఘోరీ సరైన లెక్కలు లేవు,
అల్లావుద్దీన్ ఖిల్జీ కంబయత్ లో 20,000 మంది హిందువులను చంపించి,20,000 మంది స్త్రీలను బందీలుగా తీసుకుని వెళ్ళాడు,చిత్తోర్ లో వీడి వల్ల 20,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు,
ఒడిశా జాజ్ నగర్ లో ఫిరోజ్ షా తుగ్లక్ 1,00,000 మంది హిందువులను చంపించాడు,
ఢిల్లీలో తైమూర్ లంగ్ 1,00,000 మంది హిందువులను చంపించాడు, భువనగిరి లో మాలిక్ కాఫుర్, ఓరుగల్లు లో ఉలుఘ్ ఖాన్,మధుర దేవాలయములో మాలిక్ కాఫుర్, మలబార్ లో మాలిక్ కాఫుర్ లక్షల మంది హిందువులను చంపించారు, విజయనగరం లో ముహమ్మద్ షా 5,00,000 మంది హిందువులను చంపించాడు,తళ్ళికోట యుద్ధం తర్వాత హంపి లో 1,00,000 మంది పైనే మారణహోమం జరిగింది,1568లో చిత్తోర్ ఘఢ్ లో అక్బర్ 30,000 మందిని చంపిస్తే,8,000 మంది స్త్రీలు ఆత్మహత్య చేసుకున్నారు, ఔరంగజేబు దక్షిణ భారత దేశం పైన చేసిన దండ యాత్ర లో 26,00,000 మందికి పైగా చంపించాడు,మొఘలులకు మరాఠాలకు జరిగిన యుద్ధం లో సంవత్సరానికి లక్ష మంది మరణించారు, కర్ణాటక లో హైదర్ అలీ,టిప్పు సుల్తాన్, గోవాలో పోర్చుగీసు వారు,ఇంకా లెక్కల్లో లేని ఆంగ్లేయుల పాలన లో అకృత్యాలు భారతదేశంలో హిందువుల పైన అత్యంత పైశాచిక దాడులు చేసి, చివరికి ఆడవారిని బహిరంగంగా గుంపులుగా చచ్చే వరకు అత్యాచారాలు చేసి, వారి అవయవాలను వేరు చేసి,జిజియా పన్ను రూపంలో హిందువులను కాల్చుకు తిని, రాక్షసత్వాన్ని చూపించి ఒక్కొక్క పాలకులు లక్షల మందిని చంపి,లక్షల మందిని భయభ్రాంతులకు గురి చేసి,మత మార్పిడిలు చేసి అతలాకుతలం చేసారు.నిజానికి కొన్ని యుగాల ముందు రాక్షసులు కూడా సనాతన ధర్మాన్ని పాటించే హిందువులను చంపించారు.వాళ్ళు కనుమరుగైపోయారు.కానీ సనాతన ధర్మం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది.ఇన్ని దారుణాలను చవి చూసిన హిందువులు స్వాతంత్ర్యం మాట వినగానే ఎంతో ఆనందంగా ఎదురు చూసారు.కానీ మహమ్మద్ అలీ జిన్నా రూపంలో మళ్ళీ వాళ్ళ మాన ప్రాణాలతో ఆడుకుంటారని ఊహించలేకపోయారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ పుత్రుడని బ్రతికుండగానే తలకిందులుగా వేలాడదీసి ఛర్మం వలిచి మతం మారమన్నా మారలేదు.ఇటువంటి ఎన్నో సందర్భాలు తెలియజేయాలి.కానీ ఇక్కడ అసలైన ఆర్టికల్ విభజన సమయంలో మారణహోమం కనుక చిన్నగా చెప్పి ముందుకు వెళ్తున్నాను.
ఈ రెండూ కలకత్తా అల్లర్లు మరియు జిన్నా గురించి, మరొకటి లో నోఖాలీ హత్యాకాండ గా ఉంది.
భారత దేశానికి స్వాతంత్ర్యం వస్తుంది అనగానే మహమ్మద్ అలీ జిన్నా తమకు ముస్లీం ల మెజారిటీ ఉన్న ప్రత్యేక దేశం కావాలని కోరాడు.కానీ జాతీయ కాంగ్రెస్ దానికి అంగీకరించలేదు.దాంతో
మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మీకు యుద్ధమే కావాలంటే మేము దానికి సిద్ధమే అంటూ తన పైశాచికత్వాన్ని బయటపెట్టాడు.అయితే భారతదేశాన్ని విభజిస్తాము లేదా నాశనం చేసేస్తాము అంటూ బెదిరించాడు.
ADVERTISEMET
మీ పిల్లలకు నచ్చే మంచి అందమైన ఆట వస్తువు.
Wembley Toys Talking Cactus Baby Toys for Kids Dancing Cactus Toys Can Sing Wriggle & Singing Recording Repeat What You Say Funny Education Toys for Children Playing Home Decor Items for Kids
ఆగస్టు 16,1946 ని డైరెక్ట్ ఏక్షన్ డే గా ప్రకటించి,ప్రణాళికా ప్రకారం కలకత్తా లో తన అనుచరులను ఉసిగొల్పాడు మరియు మతం పేరుతో ముస్లీమేతరుల ప్రాణాలను మాత్రమే కాదు,మన దారిలో లేని ముస్లీం లను కూడా చంపండి,మతం మార్చండి అంటూ పిలుపునిచ్చాడు.ముస్లీమేతరుల పైన జీహాద్ ని ప్రకటించాడు.
రక్తపాతం ఒక గొప్ప కారణం కోసం చేసినట్లయితే అది అసలు తప్పే కాదనీ, ఇప్పుడు మనకు ప్రత్యేక పాకిస్థాన్ ని సాధించడం కంటే ముఖ్యమైన పని మరొకటి లేదు అని వాళ్ళకి నూరి పోసారు.
దాంతో రెచ్చిపోయిన ముస్లీం అతివాదులు రోడ్ల పైకి వచ్చి తమ రాక్షసత్వాన్ని బయటపెట్టారు.
కనిపించిన వారిని కనిపించినట్టు ముస్లీమేతరులని నరికేసారు,పాడిచి చంపారు.చంపారు అనడం కంటే వారికి ఈ భూమి పైనే ప్రత్యక్ష నరకాన్ని చవి చూపారు,స్త్రీలను బహిరంగంగా సామూహిక అత్యాచారాలకు గురి చేసారు.బజార్లలో విధ్వంసం సృష్టించారు.వీధుల్లో వరుసగా ఉండే దుకాణాల గోడలు పడగొట్టారు,వాటికి నిప్పంటించారు, ఆ దుకాణాల్లోని కొత్త కొత్త వస్తువులు రోడ్ల పైకి విసిరికొట్టారు, ఫర్నిచర్, కాంక్రీటు బ్లక్ లు,ఇటుకలు,గాజు, ఇనుప కడ్డీలు, మెషీన్ టూల్స్ అన్నింటినీ రోడ్ల పైన చెల్లాచెదురుగా పడేసారు,పైపు లైన్లు బద్దలుగొట్టడంతో నీరు రోడ్ల పైకి ప్రవహిస్తుంది, ఆటోలు,ఇతర వాహనాలు తగలబెట్టారు,కాలిన వాటి నుండి వచ్చే పొగ చుట్టు పక్కల కమ్మేసింది.
కలకత్తా,హౌరా,హుగ్లీ,మెటియాబుర్జ్,24 పరగణాల్లో ఈ విధ్వంసం కొనసాగింది.మనం పాకిస్థాన్ ని పొందే వరకూ ఈ మారణహోమం కొనసాగాలని పిలుపునిచ్చాడు.
"లాడ్ కె లేంగే పాకిస్థాన్","మార్ కే లేంగే పాకిస్థాన్" అంటూ నినాదాలు చేస్తూ ఆ రాక్షసులు ఈ మారణహోమాన్ని కొనసాగించారు.
జిన్నా ఒక బహిరంగ సభలో రంజాన్ మాసం లో జిహాద్ చాలా గొప్ప పని అని వివరించాడు.మనం వర్షాకాలం మరియు రంజాన్ మాసంలో ఉన్నాం,ఇది దేవుని దయ, దేశాన్ని ప్రక్షాళన చేయడానికి, జిహాద్ పాటించడానికి ఎంతో గొప్ప సమయం ఇది, ముస్లిం లు వర్షాలను లెక్క చేయకుండా ఈ ఏక్షన్ డే ని జరపండి,ఇదే రంజాన్ మాసం లో ఖురాన్ అవతరించింది,బదర్ యుద్ధం, ఇస్లాం మరియు హీథనిజం మధ్య మొదటి సంఘర్షణ యుద్ధం 313 మంది ముస్లిం లు పోరాడి గెలిచారు.ప్రవక్త ఆధ్వర్యంలో 10,000 మంది ముస్లిం లు మక్కాను స్వాధీనం చేసుకుని ఇస్లాం ను స్థాపించి స్వర్గరాజ్యాన్ని ఏర్పాటు చేశారు.అటువంటి పవిత్ర మాసంలో మనం జిహాద్ చేయడం మన అదృష్టం అన్నాడు.అలాగే ముస్లిం లీగ్ కౌన్సిల్ జారీ చేసిన ఒక పత్రం ముస్లిం ల మధ్య పంపిణీ చేయబడింది,దానిలో ఎప్పుడు? ఎక్కడ?దాడి చేయాలో స్పష్టంగా ఉంది,
1.భారతదేశంలోని ముస్లిం లందరూ పాకిస్థాన్ కోసం చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి.
2.పాకిస్థాన్ ఏర్పాటు తర్వాత భారతదేశం మొత్తం మనం జయించాలి.
3.భారతదేశంలోని ప్రజలందరినీ ఇస్లాం లోకి మార్చాలి.
4.మొత్తం అన్ని ముస్లిం రాజ్యాలు చేతులు కలపాలి.
5.ప్రతి ఒక్క ముస్లీం ఐదుగురు హిందువుల బాధ్యత తీసుకోవాలి.
6.పాకిస్థాన్ మరియు భారత ముస్లీం సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేంత వరకు ప్రతి ఒక్క ముస్లీం ఈ క్రింది చర్యలు తీసుకోవాలి:-
(ఎ) హిందువుల యాజమాన్యం లోని ప్రతి ఒక్క కర్మాగారం మరియు దుకాణాలలో దోపిడీలు చేయాలి, వాటిని నాశనం చేయాలి,దోచుకున్న సొమ్ము లీగ్ కార్యాలయానికి ఇవ్వాలి.
(బి) ముస్లిం లీగర్లందరూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉండాలి.
(సి) జాతీయ వాద ముస్లీం లు ఎవరైనా లీగ్ లో చేరకపోతే వారిని చంపాలి.
(డి) హిందువులను క్రమంగా హత్య చేయాలి మరియు వారి సంఖ్య తగ్గించాలి.
(ఇ) దేవాలయాలన్నీ నాశనం చేయాలి.
(ఎఫ్) భారతదేశం లోని ప్రతి గ్రామంలో ముస్లీం లీగ్ యొక్క గూఢచారులు ఉండాలి.
(జి) కాంగ్రెస్ నాయకులను నెలకొకరిని రహస్యంగా హత్య చేయాలి.
(హెచ్) కాంగ్రెస్ ఉన్నత కార్యాలయాలను వాటిలో రహస్యంగా పని చేస్తున్న ముస్లిం వ్యక్తి నాశనం చేయాలి.
(ఐ)కరాచీ,ముంబై,కలకత్తా, మద్రాస్,గోవా, విశాఖపట్నం నగరాలను ముస్లీం లీగ్ వాలంటీర్లచే డిసెంబర్ 1946 నాటికి స్తంభింపజేయాలి.
(జె)ఆర్మీ,నేవీ, ప్రభుత్వ సర్వీసులు లేదా ప్రైవేటు సంస్థల్లో హిందువుల కింద పని చేయడానికి ముస్లీం లను అనుమతించకూడదు.
(కె) ముస్లీం లు భారత దేశం పై చివరి దండయాత్ర కోసం భారతదేశాన్ని మరియు కాంగ్రెసు ప్రభుత్వాన్ని ముస్లీం లు విధ్వంసం చేయాలి.
(ఎల్) పంజాబ్,సింధ్ మరియు బెంగాల్ లో ముస్లీం లీగర్లకి ఆయుధాలను తయారు చేసి ఇవ్వడానికి ముస్లీం లీగ్ ద్వారా ఆర్ధిక వనరులు అందించబడతాయి.**
(ఎం)ముంబై, కలకత్తా, ఢిల్లీ, లాహోర్,కరాచీ ముస్లిం లీగ్ శాఖలకు ఆయుధాలను పంపిణీ చేయాలి.
(ఎన్) హిందువులను నాశనం చేయడానికి మరియు వారిని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి ముస్లీం లీగ్ లోని అన్ని విభాగాలు కనీస ఆయుధాలు, సామగ్రిని,కనీసం జేబులో కత్తిని కలిగి ఉండాలి.
(పి) అక్టోబర్ 18,1946 నుండి హిందూ స్త్రీలు మరియు బాలికలను అత్యాచారం చేసి, కిడ్నాప్ చేసి, ముస్లీం లుగా మార్చాలి.
(క్యూ) హిందూ సంస్కృతి ని నాశనం చేయాలి.
(ఆర్)లీగర్లందరూ హిందువుల పట్ల అన్ని సమయాల్లో కౄరంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి మరియు సామాజికంగా, ఆర్థికంగా అనేక ఇతర మర్గాల్లోనూ వారిని బహిష్కరించాలి.
(ఎస్) హిందూ డీలర్ల నుండి ఏ ముస్లీం కొనుగోలు చేయకూడదు. హిందువులు తయారు చేసే వస్తువులన్నీ బహిష్కరించాలి.ముస్లీం లీగర్లందరూ ఈ సూచనలను పాటించి సెప్టెంబర్ 15,1946 లోగా అమలులోకి తీసుకొని రావాలి.
ఇవే కాకుండా బహిరంగంగా
డైరెక్ట్ ఏక్షన్ అంటే రాజ్యాంగేతర పద్ధతులను పాటిస్తూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎటువంటి మార్గంలో అయినా వెళ్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించాలని చెప్పారు.
ఈ మాటలు విన్న లీగ్ సభ్యులందరూ హిందువుల పైన మరింత రెచ్చిపోయారు.అత్యంత దారుణంగా, బహిరంగంగా హత్యలు, మానభంగాలు జరిగాయి.హిందువుల ఆర్తనాదాలు వినే నాధుడే లేకుండా పోయాడు.వారు తమ జీవితాల్లోనే అత్యంత దుర్మార్గమైన రోజులను చవి చూసారు.ఏ పక్క నుండి చావు వస్తుందో?అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలియక వణికిపోయారు.వాళ్ళు ఇప్పుడు కేవలం వాళ్ళ ప్రాణాలను కాపాడుకునేందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఎటు చూసినా దౌర్జన్యాలు, దుర్మార్గులు.దయ,కరుణ అనేవి ఎక్కడా కనబడడం లేదు.హిందువులను కాపాడడానికి ఎవ్వరూ రాలేదు.
కలకత్తా లో ఈ హింసాకాండ 72 గంటలు కొనసాగింది.తర్వాత కలకత్తా లో ఎటు చూసినా అత్యంత భయంకరమైన దృశ్యాలే కనిపించాయి.రోడ్లు నిర్మానుష్యంగా తయారయ్యాయి.వ్యాపార సంస్థలు నాశనమయ్యాయి, వాటిలోని వస్తువులు రోడ్ల పైన పడి ఉన్నాయి.భవనాలు కాలిపోయాయి.నీటి పంపులు పగలగొట్టబడ్డాయి.ట్రాఫిక్ లో ఎక్కడ చూసినా కాలి పోయిన ఆటోలు, వాహనాలు అడ్డంగా ఉన్నాయి.
ADVERTISEMET
పిల్లల మెదడుకు మేత లాంటీది ఈ గేమ్.అమేజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
FunBlast DIY Plastic Building Blocks for Kids Building Blocks Toy for Kids Puzzle Games for Kids, Toys for Children Educational & Learning Toy for Kids, Girls & Boys - (250+ Blocks with 38 Wheels)
Brand
FunBlast
Manufacturer Minimum Age
36.00
Material
Plastic
Colour
Multicolor
Educational Objective
Logical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination DevelopmentLogical Thinking, Counting Skills, Hand-Eye Coordination, Creative Thinking, Motor Skills, Sorting Skills, Imagination Development
ఇక శవాలు, అప్పుడే చనిపోయిన శవాలు కొన్ని,ఉబ్బిపోయిన శరీరాలు కొన్ని, నరికివేయబడిన శరీరాలు కొన్ని, కాలవల్లో కొట్టుకుని పోతున్న శరీరాలు కొన్ని,ఖాళీ స్థలాల్లో పేర్చబడిన శరీరాలు కొన్ని ఎటు చూసినా శరీరాలే.ఏ తప్పూ చేయకుండా, ఎందుకు చస్తున్నామో కూడా తెలియకుండా, వాళ్ళ రాక్షసత్వానికి బలైపోయిన అమాయక హిందూ జనాల శరీరాలే ఎటు చూసినా కనిపిస్తున్నాయి.ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి.ఒక ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం అతను ఎటు చూసినా 3 అడుగుల ఎత్తు పేర్చబడిన శరీరాలే కనిపించాయట.ఆ దృశ్యాలు తాను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు.తర్వాత 3500 వరకు మృత దేహాలను సేకరించారు.ఇంకా వేల మంది మంటల్లో కాలిపోయారు, కాలవల్లో కొట్టుకుని పోయారు, మురుగు కాలువల్లో మునిగి పోయారు, అలాగే కొన్నింటిని బంధువులు తీసుకొని పోయారు,ఒక అంచనా ప్రకారం ఆ మూడు రోజుల్లోనే దాదాపు 10,000 మంది మరణించి ఉంటారు, మరొక 1,00,000 మంది గాయాలపాలయ్యారు, నిరాశ్రయులయ్యారు,ఏ ఆధారం లేని వారయ్యారు, స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది, బంధువులను, కుటుంబ సభ్యులను కోల్పోయారు.వారి బాధని చూడడానికి,పట్టించుకోడానికి కూడా ఎవరూ లేరు.వారి రోదన అరణ్య రోదన.ఎంతో మంది బలవంతంగా ముస్లిం మతం లోకి మార్చబడ్డారు.
చివరిగా ది గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే అని దీనికి పేరు పెట్టారు.ఇది హిందువులను ఊచకోత కోసిన అనాగరిక కౄరత్వం.కానీ ఈ చరిత్రని సామాన్యులకు తెలియకుండా దాచి పెట్టారు.
నోఖాలీ మారణహోమం
1937లో భారతదేశం లోని ప్రావిన్స్ లలో ఎన్నికలు జరిగినప్పుడు, బెంగాల్ ప్రావిన్స్ అధికారం ముస్లీం లకు దక్కింది.కానీ హిందూ జమీందారీ వ్యవస్థ కూడా పాలక వర్గం గా ఉండేది.అంతేకాకుండా వీరు విద్య మరియు ఆర్ధికంగా ఎప్పుడూ అభివృద్ధిలోనే ఉన్నారు.కానీ ముస్లిం పాలకులు కొత్త చట్టాలను ఇష్టం లేకపోయినా పాటించవలసి వచ్చింది.హిందువులను ప్రభుత్వ ఉద్యోగాలకు రాకుండా అడ్డుకున్నారు.అప్పటికే ఎప్పటి నుండో అభివృద్ధి చెందిన హిందూ కుటుంబాల పైన,జమీందారుల పైన మనోవేదన తో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముస్లీం మూకలు 1946లో బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని ప్రకటించడం, వారికి అధికారం లభించడంతో ఇక తమ మనసులో దాగిన కోపాన్ని బయటపెట్టడానికి సరైన సమయం లభించింది అనుకున్నారు.
1946 అక్టోబర్ 10 బెంగాలీ హిందువులంతా ఎంతో పవిత్రంగా, ఆనందంగా జరుపుకునే కోజాగారీ లక్ష్మీ పూజా పవిత్ర దినం అది.ఆ రోజున బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ కూడా) హిందువులంతా స్వాతంత్ర్య ప్రకటన కూడా రావడంతో ప్రతి సంవత్సరం కంటే మరింత ఆనందంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అదే సమయంలో వారు ఊహించని విధంగా ముస్లీం మూకలు తమ అల్లర్లను మొదలుపెట్టారు.తమ పాత ఈర్షతో పాటు కొత్తగా ముస్లీం లీగ్ నాయకులు రెచ్చగొట్టే ఉపన్యాసాలు, ముస్లీం సామ్రాజ్య స్థాపన అనే మత్తు ఎక్కిన ఆ రాక్షస మూకలు రెచ్చిపోయి హిందువుల పైన దాడులు మొదలుపెట్టారు.తమ అరాచకాలకు అడ్డు చెప్పేవారు లేకపోవడంతో అంతకు ముందు కలకత్తా లో జరిగిన "గ్రేట్ కలకత్తా కిల్లింగ్ డే"ని మరవక ముందే దానికి మించిన దారుణ కాండ అక్కడ చోటు చేసుకుంది.పూజ రోజున మొదలైన ఆ దాడులు కొన్ని రోజులు పాటు నిరంతరాయంగా సాగుతూనే ఉన్నాయి.
హిందూ జమీందార్ల పైన, మార్కెట్ లలోని హిందూ దుకాణాల పైన దాడులు చేసి వారి ఆస్తులు,వస్తువులు దోచుకున్నారు.ఈ దాడులు చాలా ప్రణాళికా బద్ధంగా చోటు చేసుకున్నాయి.ఈ అల్లర్లు నోఖాలీ జిల్లాలో రామ్ గంజ్,బేగంగంజ్,రాయ్ పూర్, లక్ష్మీ పూర్,ఛగల్ నయ్య మరియు శాండ్ విప్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు మరియు తిప్పేరా జిల్లాలోని హజిగంజ్,ఫరీద్ గంజ్,చాంద్ పూర్,లక్షం మరియు చౌద్ధగ్రామ్ పోలీస్ స్టేషన్ల పరిధి ప్రాంతాల్లో మొత్తం 2000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఈ అల్లర్లు కొనసాగాయి.
ఇవి చాలా ప్రణాళికా బద్ధంగా, హిందూ మతాన్ని నాశనం చేయాలి అనే లక్ష్యంతో చేసిన దాడులు.
ఈ దాడుల్లో హిందూ పురుషులను,పిల్లలను అత్యంత పాశవికంగా చంపారు,వారి ఆస్తులను,డబ్బును దోచుకున్నారు.వారి ఇళ్ళని వస్తువులను తగలబెట్టారు.వారి కుటుంబ సభ్యుల ముందే వారిని హత్య చేసారు.మహిళల పైన సామూహిక అత్యాచారాలు, దాడులు జరిగేవి.హిందువుల ఆర్త నాదాలు ఎవ్వరికీ వినిపించలేదు.ఆ ప్రాంతాల్లోని ఎటు వైపు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి.హిందువుల శవాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.మార్కెట్లు నాశనం చేయబడ్డాయి.
మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.వారి కళ్ళ ముందే వారి కుటుంబ సభ్యులను,భర్తలను హింసించి, హింసించి చంపారు.జీవచ్ఛవాలుగా ఉన్న ఆ మహిళల పైన బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసారు.వారి తాళిబొట్లు, నుదుటన బొట్టు తొలగించి ముస్లీం లు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నారు.అది వారికి ఎన్నో వివాహమో తెలియదు.కేవలం వారిని తమ ఇళ్ళలో ఇష్టమొచ్చినట్లు వాడుకోవచ్చు అని వారి సొంతం చేసుకున్నారు.అప్పటి వరకు తమ గృహాల్లో ఎంతో గౌరవంగా బ్రతికిన ఆ స్త్రీలు అత్యంత అవమానకరమైన జీవితాలను పొందారు.
ఎటు చూసినా ప్రాణ భయంతో హిందువులు పారిపోతున్నారు.తమ ఆస్తులు,సొమ్ము,ఇళ్ళు అన్నింటినీ వదిలి పారిపోవలసిన దుస్థితి వారికి దాపురించింది.తమ ప్రాణాలను,స్త్రీలను ఎలా కాపాడుకోవాలో తెలియక బెంబేలెత్తిపోయారు.
ఈ హత్యా కాండకి తోడు భయ కంపితులైన హిందువులను మత మార్పిడులు చేసారు.దాదాపుగా 90 శాతం పైనే హిందువులను బలవంతంగా ఇస్లాం మతం లోకి మార్చారు.
మహాత్మా గాంధీ మత సామరస్యం పేరు తో శాంతిని పునరుద్ధరించాలి అని నాలుగు నెలల పాటు నోఖాలీలో పర్యటించారు.కానీ హిందువులకు మాత్రం వారి పైన నమకం కలగలేదు.ఎందుకంటే అతను పర్యటిస్తుండగానే హిందువుల పైన దాడులు కొనసాగాయి,హత్యలు జరిగాయి,స్త్రీల మానభంగాలు ఆగలేదు,బలవంతపు మత మార్పిడులూ పెరిగాయితం మారిన వారి చేత వారి గొడ్లనే చంపి గొడ్డు మాంసం తినిపించారు.పైగా వీటన్నిటికీ తోడు గాంధీ పైన ముస్లీం మూకల కోపం పెరిగింది,తిరిగి వెళ్ళిపోవాలనే డిమాండ్ మొదలైంది, చివరికి అతను నడుస్తున్న దారులను అశుభ్రం చేసేవారు.అతను పర్యటనకి వచ్చారే కానీ హింసని ఆపడానికి ఎటువంటి బలగాలను అక్కడకు పంపలేదు.
హిందువుల పైన ఈ పైశాచిక దాడులు కొనసాగుతూనే, హిందూ ఆలయాల పైన దాడులు చేశారు, తగలబెట్టారు,విగ్రహాలను దొంగిలించారు లేదా పగులగొట్టారు. ఇలా ఈ రాక్షస క్రీడ హిందువులను భయకంపితులను చేస్తూ,వారి మాన ప్రాణాలను దోచుకుంటూ,వారి ఆస్తిపాస్తులను దొంగలిస్తూ కొనసాగింది.గ్రామాల్లో హిందూ వ్యతిరేక పద్యాలు,పాటలు రాస్తూ బహిరంగంగా బజార్లలో వాటిని పాడేవారు.మత్స్యకారుల పైన కూడా నదుల్లో వేట కొనసాగిస్తుండగానే దాడులు చేసేవారు.కాంగ్రేస్ నాయకులను కూడా హత్య చేసి,కార్యాలయాలను దగ్ధం చేశారు.అక్టోబర్ 14 వరకు ఎలాంటి బలగాలను ఆ ప్రాంతాలకు పంపలేదు. అక్టోబర్ 16న బెంగాల్ ప్రధాన మంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రవర్ధి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, దాడులు జరిగాయి అని చెప్తూనే ఎందుకు జరిగాయో తనకు తెలియదని చెప్పాడు.కాలువలు జామ్ అయ్యి, రోడ్లు, వంతెనలు పాడవ్వడం వల్ల బలగాలు వెళ్ళలేకపోయాయి అని చెప్పారు.
దాడుల తర్వాత నోఖాలీలో 30 సహాయ సంస్థలు మరియు ఆరు వైద్య మిషన్ లు సహాయక చర్యలు చేపట్టారు.20శిబిరాలు ఏర్పాటు చేశారు.సహాయ సరుకులు రైలు ద్వారా పంపబడ్డాయి.కోల్కత్తా వచ్చిన బాధితులకు 60 శిబిరాలను ఏర్పాటు చేశారు.అపహరణకి గురైన మహిళలను తిరిగి తీసుకొని రావడం, రైల్వే స్టేషన్ లలో తల దాచుకున్న బాధితులకు సహాయం చేయడం వంటివి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసాయి. గాంధీ హిందూ మహిళల దుస్థితి,బాధితుల గురించి వివరిస్తూ శాంతియుతంగా మత సామరస్యం ఉండాలని కోరారు.
ప్రాణాలతో బయటపడిన వారు తిప్పేరా మరియు నౌఖాలీ నుండి పారిపియారు.ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినప్పుడు ఈ వలసలు ఆగాయి.కానీ 1947 మార్చిలో కాంగ్రెస్ భారత విభజనకి అంగీకరించినప్పుడు మాత్రం భయంతో వారు మళ్ళీ త్రిపుర, అస్సాం మరియు బెంగాల్ నుండి పశ్చిమ బెంగాల్ గా మారబోయే ప్రాంతాలకం భయంతో పారిపోయారు.దాదాపుగా 50,000 మంది శరణార్థులు అస్సాం లోని గౌహతికి పారిపోయారు.వీరిని తీసుకొని వెళ్తున్నప్పుడు కూడా వీరి పైన దాడులు జరిగాయి.కానీ తర్వాత ఎవ్వరూ తమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళలేదు.బెంగాల్ ప్రభుత్వం ఏ వార్తా పత్రికలో ఈ వార్తలు రాకుండా చేసారు.పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు అపవిత్రం చేయబడ్డాయి,అవమానించబడ్డాయి.అలా ఐదు నెలలు కంటే ఎక్కువ కాలమే ఈ ఊచకోతలు,బలవంతపు మత మార్పిడులు, మానభంగాలు కొనసాగుతూనే ఉన్నాయి.
మార్చి 20న గ్రామాలలో ముస్లీం లు ఆ నెల 23వ తారీఖున పాకిస్థాన్ దినోత్సవం గా జరుపుకోవాలనీ, ప్రజలంతా రామ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనాపూర్ లో చేరుకోవాలనీ ప్రకటించి గులాం సర్వర్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశాడు.ఈ బహిరంగ సభని అప్శటి గాంధీ శాంతి మిషన్ లోని సభ్యులు, గాంధీ ఆపాలనుకున్నారు.కానీ మదర్సాలు,మసీదుల్లో చేసుకోవాలని కోరారు.కానీ పోలీస్ అధికారులు రెహన్ అలీ ఆ సభ ప్రైవేటు స్థలం అమ్తాలి మైదానంలో జరుగుతుందనీ, ప్రభుత్వం దాన్ని ఆపలేదనీ చెప్పారు.ఆరోజు 5000 మంది వరకూ ఆ సభకి హాజరయ్యారు.
ADVERTISEMET
వాటర్ హీటర్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Pigeon Amaze Plus Electric Kettle (14289) with Stainless Steel Body, 1.5 litre, used for boiling Water, making tea and coffee, instant noodles, soup etc. 1500 Watt (Silver)
మొత్తానికి ఈ ఊచకోత లో 5000 మంది హిందువులు చంపబడ్డారు, దాదాపుగా 4 లక్షల హిందూ జనాభా లో 3.5 లక్షల మంది మతం మార్చబడ్డారు.స్త్రీల పైన జరిగిన దాడులకు లెక్కే లేదు. ఇవి కొన్ని లెక్కలు మాత్రమే.
భారత విభజన సమయంలో మారణహోమం
విభజన సమయంలో పాకిస్తాన్ లో 7 మిలియన్ ల హిందువులు, సిక్కు లు చంపబడ్డారు, పారిపోయారు మరియు బలవంతంగా మతం మార్చబడ్డారు.
విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్ లోని హిందువులు, సిక్కులు తీవ్రంగా నష్టపోయారు, ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.
భారత దేశాన్ని భారత్, పాకిస్థాన్ గా విభజించినప్పుడు 4 మిలియన్ల మంది ముస్లీం లు ఆ దేశం పైన ప్రేమతో పాకిస్థాన్ వెళ్ళిపోయారు.అయితే అక్కడ 7 మిలియన్ ల మంది హిందువులు, సిక్కులు ఆ దేశం నుండి తరిమివేయబడ్డారు.1946 నుండి ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ దాడులు పాకిస్థాన్ విభజన తర్వాత మరింతగా పెరిగిపోయాయి.18/12/1946లో మన్సేరా తహసీల్ లోని గర్హి హబిబుల్లాలో ఒక హిందువుని అపహరించి,హత్య చేసారు.అప్పటి నుండి హిందువుల పైన దాడులు పెరుగుతూనే వచ్చాయి.మిలటరీ సకాలంలో రాలేకపోయింది.దాంతో హిందూ, సిక్కులు ఊచకోతకు గురయ్యారు.విచ్చలవిడిగా హత్య గావించబడ్డారు.1946 డిసెంబర్ చివరి నాటికి హవేలియన్ ప్రాంతంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.ముస్లీం దోపిడీదారుల వల్ల హిందూ, సిక్కులు తమ ఇళ్ళను మరియు ఆస్తులను వదిలి పారిపోవలసి వచ్చింది.పంజాబ్ కి వచ్చి శరణు కోరాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది.
అక్కడ హిందువులు మరియు సిక్కులు తమ పైన జరిగే దాడుల గురించి తెలియక ఆనందంగా గడుపుతున్నారు.వారు విభజన తర్వాత తమ ఆస్తులను,ఇళ్ళను చూసుకుంటూ తమ జన్మభూమి లోనే ఉండాలని పాకిస్థాన్ లోనే ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.కానీ వారు ఊహించని విధంగా వారి పైన మెరుపు దాడులు జరిగాయి.
పశ్చిమ పంజాబ్ లోని అనేక ప్రాంతాలు హిందువులు మరియు సిక్కులను చంపడానికి లేదా తరిమివేయడానికి చేయవలసిన అన్ని కౄర చర్యలను అవలంబించారు ముస్లీం గూండాలు.
షేక్ పురా హిందువులు మరియు సిక్కులను రావల్పిండి మరియు ముల్తాన్ పాకిస్థానీ మతోన్మాదుల చేతిలో అత్యంత దారుణంగా బాధింపబడ్డారు.అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిన ఈ దాడులు వల్ల రెండు రోజుల్లోనే 10,000 నుండి 20,000 మంది చనిపోయారు.వారు పారిపోవడానికి కూడా వారి వద్ద చాలా తక్కువ సమయం ఉంది.అయినా సాధ్యమైనంత మంది అక్కడ అన్నింటినీ వదిలి పారిపోయారు.దురదృష్టం ఏంటంటే?దీనిలో పాకిస్థాన్ ఆర్మీ కూడా పాలు పంచుకుంది.ప్రణాళిక ప్రకారం వాళ్ళు ముస్లీమేతరులను తరిమి కొట్టడానికి ఈ దాడులు చేశారు.అక్కడ నుండి శరణార్ధ శిబిరాలకు తరలివెళ్లారు.అక్కడి నుండి కూడా తరిమివేయబడ్డారు.ప్రతి చోట హిందూ, సిక్కులు పైన దాడులు చేయబడుతున్నాయి,హత్యలు, మానభంగాలు,దహనాలు, దోపిడీలు సర్వసాధారణం అయిపోయాయి.
చివరికి అక్కడ ఇక ఉండలేమనీ, ప్రాణాలు కాపాడుకోవాలంటే పాకిస్థాన్ వదిలి పోవాలనీ నిర్ణయించుకుని హిందూ, సిక్కులు కాలి నడకన భారత్ కి బయలుదేరారు.వారి పైన కూడా దారిలో దాడులు,లూటీలు జరిగాయి.వారు కనీసం తిండి కూడా లేకుండా ఆకలి కడుపులతో, బాధాతప్త హృదయాలతో సర్వం కోల్పోయి అలా నడుచుకుంటూ వస్తున్నారు.చాలా మంది ముఖ్యంగా చిన్న పిల్లలు,ముసలి వాళ్ళు మార్గ మధ్యలో ఆకలితో చనిపోయారు.దారంతా శవాలు కుళ్ళిన కంపు కొడుతోంది.జంతువుల కళేబరాలు మార్గం మొత్తం ఉన్నాయి.ఏ కష్టం తెలియని గొప్ప ధనవంతులు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కొంత మంది రైళ్ళలో ప్రయాణిస్తున్న శరణార్థుల పైన కూడా దాడులు ఆగలేదు.వారు అప్పటికే ఆకలితో అలమటిస్తున్నారు.వాళ్ళని కాల్చి లేదా కత్తులతో చంపి వారి శవాలను రైళ్ళ నిండా భారత్ కి బహుమతి గా పంపారు ఆ రాక్షసులు.
కామోకే వద్ద ఇలాగే ఒక రైలుని ఆపి మగవాళ్ళని చంపి, చిన్న పిల్లలను దయా దాక్షణ్యాలు లేకుండా నేలకేసి కొట్టి చంపి స్త్రీలను ఎత్తుకుపోయారు.శవాలను భారత్ కి పంపారు.వారికి పాకిస్థాన్ మిలట్రీ సహాయపడింది.ముస్లీం మిలిటెంట్ల ఈ దుశ్చర్యలతో పంజాబ్ దగ్దమయ్యింది.
ముస్లీం ల దుశ్చర్యల వల్ల 70 లక్షల మంది ఇలా హత్య చేయబడి,తరిమివేయబడి, అత్యాచారాలకు గురై,అపహరణలకు గురై,తరిమివేయబడినప్పటికీ ఈ దుశ్చర్యల గురించి ఎక్కడా చరిత్రలో రాయలేదు.ఏ మానవ హక్కుల సంఘం దీన్ని ఖండించలేదు.ఎవ్వరూ దీనిని గురించి పట్టించుకోలేదు.ఇది యూదుల పైన జరిగిన దాడుల కంటే పెద్దది.అంతెందుకు ఆ దురదృష్టవంతుల తర్వాత తరాల వారికి కూడా వారి పూర్వీకుల కష్టాల గురించి తెలియదు.
మీర్పూర్ ఊచకోతలు
1947లో పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత అక్కడ హింస నుండి పారిపోయి హిందూ, సిక్కులు కాశ్మీర్ లోని మీర్పూర్ కి తరలి వచ్చారు.1947 ఆగస్టు నుండి మళ్ళీ అక్కడ హింస మొదలైంది.
అబ్దుల్ ఖయ్యూమ్ నాయకత్వం లో ముస్లీం మతోన్మాదులు గ్రూపులుగా ఏర్పడ్డారు.కాశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలి అంటూ రెచ్చిపోయిన ముస్లీం మూకలు హింసని మొదలుపెట్టారు.దీనిలో బ్రిటిష్ తరపున రెండవ ప్రపంచ యుద్ధంలో పని చేసిన మాజీ సైనికులు కూడా అందులో ఉన్నారు.ఈ తిరుగుబాటు దారుల్లో చాలా మంది తమ కుటుంబాలను పాకిస్థాన్ లోని పంజాబ్ లో వదిలిపెట్టి కాశ్మీర్ లో విధ్వంసం సృష్టించడానికి ఆయుధాలు, మందుగుండు సామగ్రి తీసుకొని వచ్చారు.
పరిస్థితి చేయి దాటిపోయింది అని మహారాజ హరిసింగ్ మార్షల్ లా ని విధించారు.కాశ్మీర్ లోని డోగ్రా దళాలు సెప్టెంబర్ నెలల్లో తిరుగుబాటు దారులను ఎదుర్కోన్నారు.కానీ ముస్లీం లు తమ పైన దాడి చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేశారు.ఆ వాదనలు అర్ధం లేనివి.దళాలు తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుని వారి ఆధీనంలో ఉన్న నగరాలను స్వాధీనం చేసుకున్నారు.
కానీ తర్వాత పాకిస్థాన్ నుంచి వచ్చిన ముస్లీం తిరుగుబాటుదారులు వచ్చారు.వారిని నియంత్రించడంలో విఫలమయ్యారు.వారు మిలట్రీ లో ఆరితేరిన వారు మరియు ఆధునిక ఆయుధాలను ఉపయోగించడం కూడా తెలుసు.వాళ్ళు 5000 కంటే ఎక్కువ మంది 300 లారీలలో కాశ్మీర్ లోయలోకి ప్రవేశించారు.వారు ఎంత కౄరమైన దాడులు చేసారంటే 14000 మంది హిందూ జనాభా ఉండే బారాముల్లా లో ఊచకోత తర్వాత కేవలం 1000 మాత్రమే మిగిలారు.
కాశ్మీర్ యొక్క చివరి రాజు అయిన మహారాజ హరిసింగ్ ఎలాగైనా జనాన్ని కాపాడాలని అత్యవసర సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసాడు.అయితే నెహ్రూ మరియు లార్డ్ మౌంట్ బాటన్ కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేసిన తర్వాత మాత్రమే సైన్యాన్ని పంపుతామన్నారు.
అక్టోబర్ 27,1947 లో కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేస్తున్నట్లుగా పత్రం పై సంతకం చేశారు.కానీ అప్పటికే మీర్పూర్ లో హిందువులు మరియు సిక్కులు ఊచకోతకు గురయ్యారు.
పాకిస్థాన్ నుండి వచ్చిన మతోన్మాదులు మీర్ పూర్ లో ఇళ్ళకు నిప్పు పెట్టి తీవ్రమైన దాడులు చేశారు, దీనికి కాశ్మీర్ సైన్యం తగినంత వేగంగా స్పందించ లేకపోయారు.పాకిస్తాన్ నుండి ఫిరంగులు కూడా కాల్చారు.ఆ దాడిలో వందల మంది అమాయకులు నరకయాతన అనుభవిస్తూ మరణించారు.దాదాపుగా ఇరవై వేల మంది హిందూ సిక్కులను పాకిస్థాన్ సైన్యం అరెస్టు చేసి అలీబేగ్ వైపు ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు.దారిలో పది వేల మంది పురుషులను చంపేశారు,ఐదు వేల మంది స్త్రీలను అపహరించి తీసుకొని వెళ్ళారు.మరొక ఐదు వేల మంది పురుషులు కొండలు,కోనలు దాటుకుంటూ చివరికి జైలు పాలయ్యారు.
ఈ దాడుల్లో పాకిస్థాన్ శరణార్ధులతో సహా దాదాపు ఇరవై వేల మందికి పైగా హత్య చేయబడ్డారు.
అలీబేగ్ గురుద్వారా సాహెబ్ జైలు గా మార్చబడింది.అక్కడ తప్పించుకున్న శరణార్ధులంతా బంధించబడ్డారు తర్వాత ఒకరి తర్వాత ఒకరిని హత్య చేసారు.లైంగిక దాడులు నుండి కాపాడుకోవడానికి ఆర్య సమాజ్ నిర్వహిస్తున్న హాస్టల్ లోని పాఠశాల విద్యార్థినులను బావిలోకి దూకి ప్రాణ త్యాగం చేసుకోమని చెప్పారు.అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ముస్లీం మతోన్మాదులు ఊచకోతకి పాల్పడిన తర్వాత వేల కోట్ల రూపాయల విలువైన బంగారం,నగలు ఇళ్ళ నుండి దోచుకున్నారు.మార్చి 1948లో ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC)చే అలీబేగ్ జైలు నుండి రక్షించబడే సరికి 1600 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలారు.1951 నాటికి ఆజాద్ కాశ్మీర్ లో మొత్తం 1,14,000 మంది నివాసితులు ఉండగా ఊచకోత తర్వాత 791 మంది సిక్కులు మరియు హిందువులు మాత్రమే మిగిలారు.శరణార్ధులుగా మిగిలిన వారు ఇప్పటికీ అలానే ఉన్నారు.ఎందుకంటే తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లే ధైర్యం కూడా లేదు వారికి.
ఈ అత్యంత పాశవికమైన ఆటవిక దాడులను ఏ మానవ హక్కుల సంస్థ గుర్తించలేదు.ఏ వార్తా పత్రికలో లేదా ప్రసార మాధ్యమాల్లో వీటి గురించి రాయలేదు,ప్రసారం చేయలేదు.వారికి ఎవ్వరూ అండగా నిలబడలేదు.ఇది ఊచకోతకు పాల్పడిన దుర్మార్గుల కంటే అన్యాయం.
ADVERTISEMET
అమేజాన్ లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది.
Dry Fruit Hub Healthy Raw Seeds Combo For Eating 600gms Pack OF 6 Each 100 gram, (Pumpkin Seeds, Sunflower, Sesame, Chia, Flax Seeds, Watermelon Seeds), Seeds Mix for Eating, All Seeds Combo Pack
మరి ఇప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో సహా ఎన్నో దేశాల్లో హిందువుల పైన జరుగుతున్న దాడులు ఏ మీడియా సంస్థ చూపించదు.భూమి పైన అత్యధిక దాడులు ఎదుర్కొని నిలబడి ఉన్న పురాతన ధర్మం హైందవ ధర్మం.ఈ ధర్మం పైన దాడులు ఎప్పుడు ఆగుతాయో? ప్రపంచం హిందువులు అనుభవిస్తున్న బాధలు ఎప్పుడు గుర్తిస్తుందో?ఈ రోజు కేవలం హిందూ మతమే కాదు.చాలా సంస్కృతులు దాడులను ఎదుర్కొంటున్నారు.అలా ఇస్లామిక్ దాడులు ఎదుర్కుంటున్న వారిలో టర్కీ,ఇరాక్ మరియు సిరియా దేశాల్లో ఉగ్రవాద సంస్థ ISIS దయ వల్ల అతికొద్ది మంది మాత్రమే మిగిలి అంతరించిపోడానికి సిద్ధంగా ఉన్న యాజ్డి జాతి ఒకటి.వీరి సాంప్రదాయాలు మనకి దగ్గరగా ఉంటాయి.
కొన్ని వెబ్సైట్లు వికీపీడియా తో సహా, మరికొన్ని మీడియా సంస్థలు కలకత్తా లో జరిగిన దాడులు హిందూ ముస్లీం లకు జరిగిన మత కల్లోలాలుగా రాసాయి.అలాగే పాకిస్థాన్ లో హిందువుల పైన జరిగిన దాడులు ప్రతీకార చర్యలు అని రాసాయి.వాటి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఈ దుశ్చర్య గురించి మీ అభిప్రాయాలు కామెంట్ చేయడం మర్చిపోకండి.
చరిత్రలో ఎక్కడా చెప్పని ఈ మారణహోమాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది.ఖచ్చితంగా మీ గ్రూప్స్ లో షేర్ చేయడం మర్చిపోకండి.