ఛత్రపతి శివాజి మహరాజ్ - ధీర సైనికా.... నీకు వందనం....

ఛత్రపతి శివాజి మహరాజ్

ఛత్రపతి శివాజి మహరాజ్

 NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language. 

           ఛత్రపతి శివాజి మహరాజ్.భారతీయులకు పరిచయం అక్కరలేని పేరు.ముస్లీం ఆక్రమమదారులను గడగడలాడించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన యోధుడు.విదేశీ శక్తుల చెర నుండి భరత మాతను రక్షించిన ధీరుడు.ప్రతి భారతీయుడి గుండె ల్లో  చిరకాలం నిలిచిపోయే మహనీయుడు.ఈరోజు ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం.

        నిజానికి శివాజీకి ఉన్న దేశభక్తి మొత్తం తన తల్లి దగ్గర నుండి వచ్చినదే.శివాజీ తల్లి జిజియా బాయ్ శివాజీ మహారాజు ని గొప్ప దేశ భక్తుడిగా, యోధుడిగా తయారు చేసి ఈ దేశాన్ని,మ రక్కసి మూకల నుండి కాపాడి, ధర్మాన్ని రక్షించాలని చెప్పేది. 



         జిజియా బాయి 1598లో మహారాష్ట్ర లోని విదర్భలోని సింధ్ఖేడ్ ప్రాంతంలో లఖోజీరాజే జాదవ్ కి జన్మించింది.నిజానికి జిజియా బాయి దేవగిరి యువరాణి.కానీ లఖోజీరాజే మరియు అతని ముగ్గురు కుమారులు సుల్తాన్ సైన్యం లో అధిపతులుగా పని చేయడానికి ఒప్పుకున్నారు.దాంతో జిజియాబాయి చాలా కోపానికి గురి అయింది.

         అక్కడ ఉన్న బ్రాహ్మణులు కూడా ఆక్రమమదారులకు విధేయత కలిగి ఉండేవారు, క్షత్రియుల భార్యలను సుల్తాన్ సైన్యం అపహరిస్తూ ఉండేవారు.కానీ క్షత్రియులు లంచం ఇచ్చి వారిని తిరిగి తీసుకొని వస్తూ ఉండేవారు.ఇక సామాన్య ప్రజల దుస్థితి చెప్పనక్కర్లేదు.హిందువులను ఇన్ని రకాలుగా హింసిస్తున్న ఆ సుల్తాన్ ల పైన జిజియా బాయి ఆక్రోశాన్ని పెంచుకుంది.

            జిజియా బాయి సుల్తాన్ సైన్యం లోని అత్యంత పరాక్రమవంతుడు అయిన షహాజీ రాజ భోంస్లే ను వివాహం చేసుకున్నారు.

          తర్వాత తన తండ్రి తో మీరు మీ జీవనాధారం కోసం ఆ సుల్తాన్ దగ్గర పని చేయబం సరైన పద్ధతి కాదు.మీరు ధర్మాన్ని కాపాడడానికి పోరాడాలని చెప్పింది.మరాఠాలు మూర్ఖత్వపు అహంకారానికి తమలో తామే కొట్టుకోవడం ఆపాలి,ఒకవేళ మరాఠాలు మొత్తం కలిసి పోరాడితే తమ ప్రజలను, రాజ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పింది.ఆ మాటలకు కళ్ళు విప్పిన లఖోజీరాజే  షాహాజీరాజే తోకలిసాడు.అప్పటితో జాదవ్ లకు, భోంస్లే లకు మధ్య శత్రుత్వం ముగిసింది.దాంతో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు.

             కానీ నిజాం జిజియాబాయి తండ్రి మరియు ఆమె సోదరులను నిరాయుధులుగా ఆస్థానంలోకి పిలిచి మోసపూరితంగా హత్య చేస్తాడు.తర్వాత పూణె నగరాన్ని సర్వ నాశనం చేస్తాడు.ఇళ్ళన్నిటికీ నిప్పు పెడతాడు.పొలాలన్నీ నాశనం చేస్తాడు.ఇవన్నీ చూసి జిజియాబాయికి గుండె ముక్కలయినట్టు అవుతుంది.ఆమె ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది.కానీ తనని తానే సముదాయించుకుంటుంది.అలాగే ఇంత దుఃఖం లో కూడా అమె ధర్మాన్ని కాపాడాలనే తన కాంక్ష ని మాత్రం విడిచిపెట్టలేదు.అప్పుడే ఆమె గర్భవతి అయింది.

             జిజియా బాయి గర్హవతిగా ఉన్న సమయంలో భవానీ మాత ని ప్రతిరోజూ తీవ్రంగా ప్రార్ధించేది 'ఈ దుర్మార్గులను నాశనం చేయడానికి ,జాతి మరియు ధర్మాన్ని రక్షించడానికి రాముడు వంటి కుమారుడిని లేదా శత్రువులను చీల్చి చెండాడే దుర్గా దేవి లాంటి కుమార్తె ను అనుగ్రహించమని.ఆమె గర్భవతిగా ఉన్న సమయంలో ఎప్పుడూ తన బిడ్డ కత్తి పట్టి పులి మీద కూర్చుని శత్రువులను నాశనం చేస్తున్నట్టు కలలు వచ్చేవి.అలాగే ధర్మ యుద్ధం మరియు రామరాజ్యం కోసం కలలు కనేది.

            ఆమె ప్రార్ధనలు విన్న భవానీ మాత ఆమె కలలకు అనుగుణంగా, దేశాన్ని, ధర్మాన్ని కాపాడడానికి శత్రువులను చీల్చి చెండాడే ఒక గొప్ప యోధుడిని వైశాఖ శుక్ల పక్ష తృతీయ (1627 AD) నాడు ఒక కుమారుడిని ప్రసాదించింది.



            అతనే మరాఠ రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్.శివనేరి కోటలో అతను జన్మించాడు.అతని పేరుని చూసి చాలా మంది శివుడి పేరు అనుకుంటారు.కానీ అది అక్కడ శివాయి అనే ఒక దేవత పేరు.జిజియాబాయి శివాజీకి బాల్యం నుండి దేశభక్తి,ధర్మం పైన ప్రేమ లాంటి విలువలను నేర్పింది.శ్రీరాముడు, హనుమాన్,శ్రీ కృష్ణుడు లాంటి మహనీయుల గురించి చెప్తూనే మహాభారతం మరియు రామాయణం నుండి ధర్మ యోధుడిగా మలచడానికి ప్రయత్నించేది.ఆమె కేవలం తల్లి మాత్రమే కాదు.ఆమె శివాజీ కి గొప్ప గురువు కూడా.జిజియా బాయి గుర్రపు స్వారీ మరియు కత్తి యుద్ధం లాంటి యుద్ధ విద్యలలో కూడా నిష్ణాతురాలు.



              శివాజీ తండ్రి నిజాం షాహీల ప్రతినిధిగా ఉంటూ మొఘల్ రాజులకు వ్యతిరేకంగా యుద్ధాల్లో పాల్గొనేవాడు.షాజహాన్ దండయాత్ర చేసినప్పుడు కూడా కీలకంగా వ్యవహరించాడు.కానీ జిజియాబాయి తండ్రి లఖోజీరావుని నిజాంషాహీ ప్రభువు హత్య చేయించినప్పుడు కోపోద్రిక్తుడైన శివాజీ తండ్రి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.ఇదే మరాఠా సామ్రాజ్యానికి నాంది.షాహాజీ ఈ మార్గంలో నిజాం రాజులను ఓడించి కొంత భూభాగాన్ని గెలుపొందారు.ఇక్కడ మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి ప్రయత్నించాడు. కానీ మొఘలులు,  ఆదిల్షా కలిసి షాహాజీని ఓడించి నిజాం రాజుల నుండి గెలుపొందిన ప్రాంతాలను లాక్కుని బెంగళూరు ప్రాంతాన్ని ఇచ్చారు.దాంతో షాహాజీ పూణే ప్రాంతాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

        అయితే ఈ ప్రాంతంలో తన జాగీరును మాత్రం వదులుకోలేదు.ఈ జాగీరు వ్యవహారాలను చూసుకోడానికి జిజియాబాయి మరియు శివాజీని అక్కడ ఉంచి తాను బెంగుళూరు వెళ్ళాడు.శివాజీకి విద్యాబుద్ధులు నేర్పడానికి, రాజనీతి, యుద్ధ విద్యలు నేర్పడానికి కొంత మంది గురువులను అక్కడ ఉంచారు.ఈ గురువుల నుండి మరియు తల్లి నుంచి ఎన్నో విద్యలు నేర్చిన శివాజీ గొప్ప యోధుడిగా మారాడు.అదే విధంగా పరమత సహనం,స్త్రీల పైన గౌరవాన్ని కూడా తల్లి ద్వారా ఏర్పరచుకున్నాడు.

             యుద్ధ తంత్రాలు, రాజనీతి మొదలైన సకల విద్యలు నేర్చుకున్న శివాజీ మరాఠ రాజ్య స్థాపనకు తన వ్యూహాలు అతి గొప్ప రీతిలో, శత్రువుల ఊహలకు అందని రీతిలో అమలు పరచడం ప్రారంభించాడు.



           16 ఏళ్ళ వయసులో శివాజీ మొట్టమొదటి సారిగా టార్నా కోటను తర్వాత మూడు సంవత్సరాల కాలంలో కొండన,రాజ్గఢ్ కోటలను గెలిచి పూణెను తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.దీంతో కోపగించిన ఆదిల్షా శివాజీని ఏం చేయలేక బెంగుళూరులో శివాజీ తండ్రి ని మోసపూరితంగా బంధీని చేసాడు. తర్వాత శివాజీ ని, శివాజీ అన్న శంభాజీని పట్టుకోడానికి విడి విడిగా రెండు సైన్యాలను పంపాడు.కానీ రెండు సైన్యాలను అన్నదమ్ములిద్దరూ ఓడించి తమ తండ్రిని కూడా విడిపించారు.

            తర్వాత ఆదిల్షా అఫ్జల్ ఖాన్ ని రంగం లోకి దింపాడు.శివాజీ యుద్ధ పద్ధతులు, గెరిల్లా యుద్ధ రీతి తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ శివాజీని యుద్ధం లోనే ఓడించగలమని నిర్ణయించుకుని ముందు శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్ట దైవమైన భవానీ మాత ఆలయాలను కూల్చాడు.

              అఫ్జల్ ఖాన్ విషయం తెలుసుకున్న శివాజీ బాగా ఆలోచించి తాను యుద్ధానికి సిద్ధం గా లేనని చర్చలకు ఆహ్వానించాడు.అఫ్జల్ ఖాన్ కూడా చర్చలకు అంగీకరించాడు.ఈ చర్చలు ప్రతాప్ ఘఢ్ కోట దగ్గర నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు.

         అయితే అఫ్జల్ ఖాన్ కుటిలత్వం గురించి తెలిసిన శివాజీ ముందుగానే తన వ్యూహాలు రచించాడు.ముందుగా తాను ఒక ఉక్కు కవచాన్ని ధరించాడు, పులిగోర్లు వంటి ఇనుప బాకును తనతో ఉంచుకున్నాడు.ఆ కోట చుట్టుపక్కల అడవుల్లో శివాజీ సైన్యం కాచుకుని కూర్చుంది.

             శివాజీ, అఫ్జల్ ఖాన్ ఇద్దరూ తమ అంగ రక్షకులతో శిబిరం లోనికి వెళ్ళారు.కాసేపటికి అఫ్జల్ ఖాన్ శివాజీ దగ్గరకు వచ్చి కౌగలించుకొంటాడు.అత్యంత భారీ కాయుడైన అఫ్జల్ ఖాన్ శివాజీ ని అలాగే కౌగిలిలో బందించి వెనక నుండి కత్తి తీసి శివాజీ వీపు పైన పొడుస్తాడు.కానీ ఇనుప కవచం ధరించిన శివాజీ ఆ దాడి నుంచి తప్పించుకుని పులి గోర్లలా ఉండే బాకు తో అఫ్జల్ ఖాన్ పొట్టను చీల్చేస్తాడు.



             ముందుకు వస్తున్న అఫ్జల్ ఖాన్ అంగ రక్షకులను శివాజీ అంగ రక్షకులు అడ్డుకుంటారు.తప్పించుకు పారిపోతున్న అఫ్జల్ ఖాన్ తలను శివాజీ ఒక్క వేటుతో నరుకుతాడు. బయట అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని అడవిలో మాటు వేసిన శివాజీ సైన్యం చంపేస్తుంది.

            బీజాపూర్ సుల్తాన్ శివాజీని ఎలాగైనా చంపాలని అఫ్గాన్ నుండి వేల సంఖ్యలో పస్థూన్లను పంపితే శివాజీ సైన్యం వాళ్ళని కూడా చంపేస్తుంది.దాంతో శివాజీ హిందూ రాజులందరికీ ఆదర్శంగా మారిపోతాడు.

            మళ్ళీ సుల్తాన్ అరబ్, పర్షియా, ఆఫ్ఘన్ ల నుండి 10,000 మంది బాగా శిక్షణ పొందిన సైనికులను పంపితే కొల్హాపూర్ వద్ద శివాజీ కేవలం తన 5000 మంది సైనికులతో ఎదుర్కొని "హరహర మహాదేవ్" అనే నినాదంతో అరి వీర భయంకరుడిలా విజృంభించి శత్రువులను చీల్చి చెండాడాడు.

            ఆదిల్షా శివాజీని ఎలాగైనా ఆపాలని ఈసారి సిద్ధి జోహార్ అనే సైన్యాధ్యక్షుడికి అపారమైన ధనాన్ని, సైన్యాన్ని ఇచ్చి శివాజీ పైకి యుద్ధానికి పంపాడు.కానీ అప్పటికి శివాజీ వీరితో పోరాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే కేవలం తన 300 మంది అనుచరులతో పన్ హాలా కోటలో ఉన్నాడు. సిద్ధి జోహార్ వస్తున్నాడని తెలుసుకుని శివాజీ వెంటనే విశాల్ ఘడ్ కోటకు చేరుకోవాలని అనుకున్నాడు.అప్పటికే సిద్ధి జోహార్ సైన్యం పన్ హాలా కోటను చుట్టుముట్టారు.

            ఇప్పుడు యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నామని, అర్ధం చేసుకోవాల్సిందిగా వర్తమానం పంపాడు.దాంతో సిద్ధి జోహార్ సైన్యం విశ్రాంతి తీసుకోగానే వాళ్ళ కళ్ళుగప్పి శివాజీ తన అనుచరులతో విశాల్ గఢ్ కోట వైపు బయలుదేరాడు.కానీ సిద్ధి జోహార్ ఆ విషయం తెలుసుకుని వారిని వెంబడించాడు.

          కొంత దూరం వెళ్ళాక సైన్యం లోని ప్రభు దేశ్ పాండే శత్రు సైన్యాన్ని ముందుకు రాకుండా మేము ఆపుతామని చెప్పి శివాజీ ని అంగ రక్షకులతో కోట వైపుకి పంపుతాడు.ప్రభు దేశ్ పాండే రెండు చేతులతో కత్తులు పట్టుకొని వారి పైన పోరాడాడు.చివరికి 300 మంది సైన్యం వీరోచితంగా పోరాడి ప్రాణాలను విడిచారు. శివాజీ కోటని చేరుకున్న తర్వాత బాగా ఆలోచించి సంధి చేసుకోడానికి ఒప్పుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం శివాజీ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది.కానీ పన్ హాలా కోటను ఇచ్చేసారు.ఇక అప్పటి నుండి సుల్తాన్ ల పైన యుద్ధాలు ఆపి మొఘలులతో యుద్ధాలు మొదలు పెట్టాడు.

              శివాజీ గురించి తెలుసుకున్న ఔరంగజేబు ఎప్పటికైనా శివాజీ తో ప్రమాదం పొంచి ఉందని భయపడి తన మేనమామ షైస్తా ఖాన్ కి లక్ష మంది బాగా బలమైన సైన్యాన్ని ఇచ్చి యుద్ధానికి పంపాడు.

            బలమైన షైస్తా ఖాన్ సైన్యం ముందు శివాజీ సైన్యం నిలవలేకపోయింది.దాంతో శివాజీ పూణె నగరాన్ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది.షైస్తా ఖాన్ శివాజీ నిర్మించుకున్న లాల్ మహల్ ని తన నివాసంగా చేసుకున్నాడు.కానీ శివాజీ గురించి తెలుసు కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకున్నాడు.తర్వాత శివాజీ నగరంలో జరుగుతున్న ఒక పెళ్లి కి పెళ్ళి కూతురి బంధువుల్లా మారు వేషంలో అనుచరులతో వచ్చి అణువణువు తెలిసిన లాల్ మహల్ లోకి ప్రవేశించాడు.షైస్తా ఖాన్ గదిలోకి వెళ్ళి ఒక కత్తి వేటు వేయగా అతని మూడు వేళ్ళు తెగి పడిపోతాయి.దాంతో భయపడిన షైస్తా ఖాన్ కిటికీ నుండి దూకేస్తాడు.అతని అనుచరులు అతన్ని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లిపోతారు.



          తర్వాత వ్యాపార కేంద్రంగా ఉన్న సూరత్ పైన దాడి చేసి అపారమైన ధనాన్ని, ఆయుధాలను దోచుకున్నాడు.ఆ ధనంతో వేల మందిని తన సైన్యం లో చేర్చుకున్నాడు.తర్వాత మొఘలుల,సుల్తానుల కోటలను ఒక్కొక్కటిగా గెలుచుకోవడం మొదలుపెట్టాడు.

        కోపోద్రిక్తుడైన ఔరంగజేబు తన దగ్గర పని చేస్తున్న రాజా జై సింగ్ అనే ఒక మహా యోధుడిని శివాజీ పైన దాడి చేయడానికి పంపాడు.ఇతను ముందుగా పురంధర్ కోటను స్వాధీనం చేసుకున్నాడు.తర్వాత రాయ్ఘర్ వైపు కి వెళ్తుండగా,రాజా జై సింగ్ సేనల గురించి తెలుసుకున్న శివాజీ వారి పైన గెలవలేమని పురంధర్ వద్ద సంధి చేసుకున్నాడు.



           ఔరంగజేబు తన యాభైయవ యేట పుట్టిన రోజు వేడుకలకు శివాజీ ని,అతని కొడుకుని ఆహ్వానించి అవమానిస్తాడు.దాంతో శివాజీ అక్కడ నుండి వెళ్ళిపోబోతుండగా సైనికులు అతన్ని బంధించి అతని విడిది గృహంలోనే గృహ నిర్బంధం చేస్తారు.శివాజీ ని చంపితే మరాఠా మొత్తం అల్లర్లు చెలరేగుతాయని భయపడి ఆగుతారు.ఒకరోజు పని వాడి వేషం వేసుకుని పళ్ళ బుట్టలో కొడుకుని దాచి పెట్టి అక్కడ నుండి తప్పించుకుంటాడు.పురంధర్ ఒప్పందానికి కట్టుబడి రెండు సంవత్సరాలు మొఘలుల పై  ఎటువంటి దాడి చేయకుండా ఊరుకుంటాడు.తర్వాత మొహబత్ ఖాన్, బహుదూర్ ఖాన్,దిలేవర్ ఖాన్ లు కలిసి ఒకేసారి దాడి చేశారు.కానీ శివాజీ ని ఓడించడం వారి వల్ల కాలేదు.ఇది చాలా పెద్ద విజయం.



        ఈ విజయం తర్వాత శివాజీ పెద్ద గా పేరు వచ్చే పనులు చేయకుండా రహస్యంగా తన పనులు చేసుకునేవాడు.ఔరంగజేబు వేరే యుద్ధాలలో పాల్గొంటూ శివాజీ గురించి పెద్దగా పట్టించుకోలేదు.అదే సమయంలో శివాజీ లక్ష మంది సైనికులను, ఆయుధాలు, అశ్వాలు,నౌకా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు.మళ్ళీ మొఘల్ కోటల పైన దాడులు చేసి స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టారు.అప్పటికే యుద్ధాలతో అలసిపోయిన మొఘల్ సైన్యం శివాజీ ని ఎదుర్కొనలేకపోయాయి.

             కానీ పూణె దగ్గర ఉదయ భాన్ రాథోడ్ ఐనే రాజ పుత్రుడు పరి రక్షిస్తున్న కొండన కోటను స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాలేదు.కోట చుట్టూ ఎప్పుడూ పటిష్టమైన సైన్యం కాపలా ఉండేది.తన దగ్గర గొప్ప సైనికాధికారిగా పేరు తెచ్చుకున్న తానాజీ ని ఈ కోటను స్వాధీనం చేసుకోవడానికి నియమించారు.



            తానాజీ ఆ కోటను చాలా రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ద్వారం వద్ద బలమైన రక్షణ ఉందని గచరహించాడు.కానీ ఒక వైపు మాత్రం ఏటవాలుగా ఉన్న ఒక పెద్ద కొండ ఉంది.దాని పైకి ఎక్కడం అసాధ్యం.దాంతో తానాజీ తన నడుముకి యశ్వంతి అనే పేరు గల ఉడుమును కట్టి కొండ పైకి విసిరాడు.అది పైన పెట్టుకున్న తర్వాత తాడు సాయంతో కొంత మంది పైకి ఎక్కి మిగిలిన వారిని తాళ్ళతో పైకి లాగారు.ఈలోపు తానాజీ సోదరుడు సూర్యాజీ కోప ముఖ ద్వారం పైన దాడి చేసాడు.రెండు సైన్యాల వద్ద భీకర పోరు సాగింది.చివరకి మరాఠాలు గెలిచారు.కానీ తానాజీ మరణించారు.అతని గౌరవార్థం ఆ కోట పేరు ని సింహ ఘడ్ గా పెట్టి,కోట గెలిచాము, సింహాన్ని పోగొట్టుకున్నాము అని పెర్కొన్నాడు.



            జూన్ 6,1674 న రాయ్ ఘడ్ కోటలో క్షత్రియ రాజులందరికీ అధిపతిగా 'ఛత్రపతి' అనే బిరుదును వేద మంత్రాలతో ప్రధానం చేశారు.మళ్ళీ 50,000 మంది సైన్యంతో దక్షిణ భారతం పైన దండయాత్ర చేసి వెల్లూరు,గింగీలను స్వాధీనం చేసుకున్నారు.తన జీవితంలో ఎన్నో యుద్ధాలు చేసి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు.ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.శ్రీశైలంలో కాళీ మాత ప్రత్యక్షమై కత్తిని ఇచ్చింది.నావికా వ్యవస్థని ఏర్పాటు చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ గా పేరు పొందారు.ఎన్ని చెప్పుకున్నా తక్కువే.



          చివరలో మూడు వారాల పాటు జ్వరం తో బాధపడి ఏప్రిల్ 3,1680న పరమపదించారు.శివాజీ కొడుకు శంభాజీ తర్వాత రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించాడు.



0 $type={blogger}