NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
తెలంగాణ విమోచన దినోత్సవం-ఆపరేషన్ పోలో
"నీ బాంచన్ దొర కాల్మొక్తా" అంటే నీ బానిసని దొర నీ కాళ్ళు మొక్కుతా అంటూ బానిస బతుకులు బతికేవారు నిజాం ప్రభుత్వం లోని హైదరాబాద్ సంస్థాన ప్రజలు.ఇంకా చెప్పాలంటే నిజాం పాలనలో ప్రజలు మనుషులు అని కూడా మర్చిపోయి అత్యంత దుర్భరమైన జీవితాన్ని జీవించేవారు.
రైతులు పండించిన పంటలు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు.వేల మంది మహిళలు మానభంగాలకు గురయ్యారు.ప్రతి ఊరిలోని హిందూ మహిళలు తమ ప్రాణాలను,తమ వారి ప్రాణాలను కాపాడుకునేందుకు సిగ్గు విడిచి నగ్నంగా బతుకమ్మ ఆడవలసి వచ్చేది.పనుల్లో ఉన్న పిల్లల తల్లులు తమ పిల్లలకు పాలు ఇవ్వడానికి కూడా అనుమతి ఉండేది కాదు.వారు ఏడ్చి చచ్చినా సరే వారిని పట్టించుకోకుండా తల్లులు పని చేయాల్సిందే.
రకరకాల చిత్ర విచిత్రమైన పన్నులు విధించి ప్రజల సొమ్ము మొత్తం దోచుకునేవారు.కొన్ని సందర్భాల్లో చివరికి ఊరి జనం దాచుకున్న ధాన్యం కూడా దోచుకొనేవారు.నిజాం రాజులు మాత్రం ఆ సొమ్ము తో జల్సాలు చేసేవారు.ఎదురు తిరిగినందుకు బైరాన్ పల్లిలో 108 మందిని కాల్చి చంపారు, నిర్మల్ లో వెయ్యి మందిని ఉరి తీసి చంపారు.ఇలాంటి లెక్కలేనన్ని సంఘటనలు మరెన్నో జరిగేవి.గోళ్ళని పీకేసేవారు.నానా హింసలు పెట్టేవారు.
యార్జంగ్ నేతృత్వంలోని మజ్లిస్ ఇతైదుహల్ బైనుల్ముస్లమీన్ సంస్థ హిందువులను బలవంతంగా ముస్లిం మతంలోకి మర్చేది.ఎదురు తిరిగిన వారి పైన అరాచకంగా దాడులు చేసేవారు.నిజాం పాలకుల దృష్టిలో ప్రజలంతా వారి బానిసలు.సామాజికంగా వెట్టి అనే బానిస వ్యవస్థ అమల్లో ఉండేది.
సంస్థాన ఉద్యోగాల్లో ఉత్తర భారతం నుండి అపాకీలను రప్పించి నియమించేవారు.స్థానికులను తీసుకొనేవారు కాదు.స్థానిక భాషల్ని, సంస్కృతులను నిర్దాక్షిణ్యంగా అణచివేసేవారు.అరబ్బీ,పార్శీ, ఉర్దూ లు గొప్ప భాషలనీ మిగిలిన భాషలు నీచమైనవనీ ఈసడించుకునేవారు.
ఈ అవమానాల్ని,అకృత్యాలను, బాధల్ని, బానిసత్వాన్ని,ఆకలినీ తట్టుకోలేని హైదరాబాద్ సంస్థాన ప్రజలు తమ ఆవేశం కట్టలు తెంచుకోగాయ ఇక ఆ నిజాం నుండి మాకు విముక్తి కావాలని తమ జీవితాల కోసం వీరోచితంగా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి పైన పోరాడారు.1946 నుండి 1948 మధ్య ఈ ఉద్యమం చాలా భీకరంగా జరిగింది.ఈ ఉద్యమాన్నే తెలంగాణ విమోచన ఉద్యమం గా పేర్కొంటారు.వివిధ సంఘాల,పార్టీల, రచయితల, ప్రజాస్వామిక వాదుల ప్రజల
సంఘటిత పోరాటమిది.
మరొక వైపు మొత్తం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ ప్రజలు మాత్రం ఆ బానిసత్వం లోనే బ్రతకాల్సి వచ్చేది.దాని వలన తెలంగాణ ప్రజల కడుపు ఇంకా మండిపోయింది.
తెలంగాణ ప్రజల తిరుగుబాటు అణచివేయడానికి ఖాసీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అనబడే నరరూప రాక్షసులను ప్రజల పైకి ఉసిగొల్పారు.ప్రజల పచ్చి నెత్తురు తాగే రాక్షసుల వంటి వారు ఈ రజాకార్లు.
వాళ్ళు ఊళ్ళ మీద పడి కనిపించిందంతా దోచుకుని ఊళ్ళకు ఊళ్ళనే తగలబెట్టేసేవారు.ఆఖరికి చచ్చిన శవాలను కూడా బూటు కాలితో తన్నేవారు కిరాతక రజాకార్లు.స్త్రీలను మానభంగం చేసి,వివస్త్రలను చేసి ఎత్తుకుపోయేవారు, చెట్లకు కట్పేసి కింద మంటలు పెట్టేవారు, జనాన్ని వరుసగా నిలబెట్టి తుపాకీతో కాల్చేసేవారు, బహిరంగంగా సామూహిక అత్యాచారాలు చేసేవారు.
ఈ భయంకర దృశ్యాలు చూసి వందేమాతరం రామచంద్రరావు గారు అప్పటి నెహ్రూ గారికి నిజాం దుర్మార్గుల పై లేఖ రాసి అందించారు.
భారత ఆర్మీ పోలీసు చర్య-ఆపరేషన్ పోలో
స్వాతంత్ర్యం అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం దేశం లో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం కట్టబెట్టారు.ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక లేకపోయి ఉంటే ఆ చిన్న చిన్న సంస్థానాలన్నీ స్వతంత్రంగా ఉండి మళ్లీ దోపిడీకి గురయ్యేవి.కానీ పటేల్ గారు తన చాతుర్యం తో 562 సంస్థానాలను మన దేశంలో కలిపారు.కానీ కాశ్మీర్,జునాఘడ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర్య రాజ్యాలుగా ఉంటామని పట్టుబట్టాయి.కానీ తొందర్లోనే పాకిస్థాన్ దాడులు తట్టుకోలేక కాశ్మీర్ రాజు కూడా తన సంస్థానాన్ని భారత దేశం లో కలిపాడు.పాకిస్థాన్ నుండి మన కాశ్మీర్ ను మన సైన్యం కాపాడింది.అదే మన సైన్యం మొదటి ఆపరేషన్.
హైదరాబాద్ సంస్థాన పాలకుడు ఏడవ నిజాం తన రాజ్యాన్ని స్వతంత్రంగా ఉంచాలనుకున్నాడు.దాని కోసం వ్యూహాలు పన్నాడు.భారత్ లో విలీనానికి సమయం కావాలని అప్పటి వరకు స్వతంత్రంగా ఉంటామనీ పటేల్ ని కోరాడు.
కానీ అదే నిజాం అప్పటికే పాకిస్థాన్ కి 20 కోట్ల సహాయం చేసినట్లు ఆధారాలతో సహా పటేలచ గారికి తెలిసింది.
దాంతో సమయం ఇవ్వడానికి పటేల్ ఒప్పుకోలేదు.ఆలస్యం అయితే ఏం జరుగుతుందో ఆయన అర్ధం చేసుకున్నారు.
పైగా కరాచీలో నిజాం తన సంస్థానం తరపున ఒక అధికారిని కూడా నియమించాడు.
అదే సమయంలో నిజాం ప్రైవేటు సైన్యం రజాకార్లు హైదరాబాద్ సంస్థానం లో మారణహోమం సృష్టిస్తూ భారత ప్రభుత్వాన్ని భయపెట్టడానికి లక్షలాది మంది తో భారీ కవాతు నిర్వహించారు.
ఇక పటేల్ గారు ఆలస్యం చేయకూడదని భావించి హైదరాబాద్ సంస్థానాన్ని ఎలాగైనా భారతదేశంలో కలపాలనుకున్నాడు.అప్పుడే భారత సైన్యం తో పోలీసు చర్య చేయించాడు.
దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు.
పటేల్ గారి ఆదేశాలతో జనరల్ జె.ఎన్.ఛౌదరి నేతృత్వంలో ఈ చర్య 1948 ్్సెప్టెంబర్ 13 నుండి 18 సాయంత్రం వరకు కొనసాగింది.
నిజాం సైన్యం రెండు రోజులు ప్రతిఘటించినా తర్వాత ఏమీ చేయలేకపోయారు.రజాకార్లు 800 వరకూ చనిపోయారు.వారు చేసిన అకృత్యాల ముందు అది చాలా చిన్నదని కొంత మంది అభిప్రాయం.
భారత ప్రభుత్వ ప్రతినిధి కె.ఎం.మున్షి సమక్షంలో నిజాం సైన్యాధ్యక్షుడు ఎల్.ఎడ్రూస్ భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు మేజర్ జనరల్ చౌదరి కి పత్రాన్ని అందజేశారు.దక్కన్ రేడియో లో ఆ రోజు రాత్రి హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్లుగా నిజాం ప్రకటించడంతో జనం వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగురవేశారు.తర్వాత రోజు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైన్యానికి జనం నీరాజనాలు పట్టారు.
1948 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేసారు.నిజాం ప్రధాని లాయక్ అలీ ని తొలగించి, రజాకార్లతో జనాన్ని నానా హింసలు పెట్టించిన ఖాసీం రజ్వీ ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.తర్వాత హైదరాబాద్ లో తాము కనిపిస్తే ప్రజల చేతుల్లో తమ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించి లాయకై అలీ, ఖాసీం రజ్వీ లు పాకిస్థాన్ కి పారిపోయారు.ఖాసీం రజ్వీ అక్కడే దిక్కు లేని చావు చచ్చాడు.
అలా ఆపరేషన్ పోలో పేరుతో పటేల్ గారు తెలంగాణ ప్రజలను బానిసత్వం నుండి,ప్రత్యక్ష నరకం నుండి నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి కల్పించాడు.ఒకవేళ పాకిస్థాన్ లో కలిపి ఉంటే ఇంకా దయనీయంగా ఉండేది తెలంగాణ ప్రజల పరిస్థితి.
అందుకే సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకుంటారు.
ఒకవేళ పటేల్ గారే లేకపోతే భారత దశమే ఉండేది కాదు.ఒకవేళ ఉన్నా కాశ్మీర్ మరియు హైదరాబాద్ చాలా దారుణ పరిస్థితుల్లో పాకిస్థాన్ చేతిలో నలిగిపోతూ ఉండేవి.
మన ఈ బ్లాగ్ లో ముందు భారత సైన్యం గురించి, తర్వాత నావీ మరియు ఎయిర్ ఫోర్స్ గురించి తెలియజేసి తర్వాత వారు చేసిన ఆపరేషన్స్ గురించి తెలియజేయాలనుకున్నా.కానీ తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది.
అందరూ ఈ బ్లాగ్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#telangana #hyderabad #andhrapradesh #india #telugu #telugumemes #mumbai #kerala #tollywood #delhi #chennai #instagram #warangal #hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata
#kcr #memes #tiktok #teluguactress #instagood #telugutiktok #covid #bollywood #ktr #ramcharan #photography #charminar #telugutrolls #telangananews #aimim #telugusongs #ysjagan #nizamabad #rajasthan #banglore #hyderabaddiaries #samantha #follow #ysrcp #pune #uttarpradesh #kakinada #trs #punjab #goa
0 $type={blogger}