1955లో పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ పైన పోలీస్ ఏక్షన్
NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
1955లో పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ పైన పోలీస్ ఏక్షన్ నిర్వహించారు.దీనికి కారణం పంజాబీ మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక పంజాబ్ రాష్ట్రం కావాలంటూ పంజాబీ సుబా ఉద్యమాన్ని ఉదృతం చేయడమే.అసలీ ఉద్యమం ఏంటి? అది పోలీస్ ఏక్షన్ జరిగేంత వరకు ఎలా వెళ్ళింది.ఇలాంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1945లో సిక్కు నాయకుడు తారా సింగ్ ఒకమాట అన్నాడు.సిక్కు పంత్(సంఘం) ఒక వ్యవస్థీకృత సంస్థ గా ఉన్నంత వరకే సిక్కు మతం ఉనికిలో ఉంటుంది.అతను అన్న మాటలకి అనుగుణంగా 1947లోపే పంజాబీ సుబా ఉద్యమం మొదలైంది.
1948 జనవరి లో ముగ్గురు హర్చరణ్ సింగ్ బద్వా,గియానీ కర్తార్ సింగ్ మరియు భూపిందర్ సింగ్ అనే ముగ్గురు అకాలీదళ్ నాయకులు అప్పటి న్యాయ మంత్రి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ని కలిసి పంజాబీ మాట్లాడే వాళ్ళ కోసం ప్రత్యేక పంజాబ్ రాష్ట్రం కావాలంటూ అడిగారు.ఆయన కేంద్ర ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రకటన చేశారు.కనుక పంజాబీ రాష్ట్రం లేదా పంజాబీ సుబా ని డిమాండ్ చేయమని చెప్పారు.
1948 ఏప్రిల్ లో పంజాబీ సుబా ను శిరోమణి అకాలీదళ్ నాయకుడు డిమాండ్ చేశారు.తమ సంఘానికి తమ సొంత భూమి తమ రాజకీయ ఆధిక్యతతో ఉంటేనే తమ ఉనికి సురక్షితంగా ఉంటుందని సిక్కుల భవిష్యత్తు గురించి అకాలీదళ్ అంచనా వేసింది.
సిక్కు మత సిద్ధాంతాలలో భాగంగా సిక్కులు రాజకీయాలలో పాల్గొనడానికి ఒక సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ గారి ద్వారా ఆయన విరాళంగా ఆయన సంతకంతో 1699లో పంజాబీ ఖల్సా ఏర్పాటు చేయబడింది.ఈ పార్టీ మూలాల నుండి బలమైన మద్దతు లభించింది.ఇది మతపరమైన మూలాలు కలిగిన రాజకీయ సంస్థ ని అందిస్తుంది.

కొత్తగా ఏర్పడిన భారత ప్రభుత్వం ఆంగ్లేయుల ప్రభుత్వాల భారతదేశ రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదని ఆలోచించి భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచించింది.ఈ పని కోసం 1948లో ఒక కమిషన్ ను ఏర్పాటు చేసింది.కానీ ఈ కమిషన్ ఉత్తర భారత దేశంలో తమ పనిని సరిగా చేయలేదని కొంత మంది అభిప్రాయం.ఈ కమిషన్ దేశం మొత్తం భాష ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పటికీ పంజాబీ,సింధీ మరియు ఉర్దూ భాషలను రాష్ట్ర ఏర్పాటుకు తగిన హోదాను పొందలేదు.
ఆ సమయంలో మొత్తం 20 జిల్లాలలో సిక్కులు మెజారిటీ గా ఉన్నారు,ఆరు జిల్లాల్లో హిందువులు మెజారిటీ గా ఉన్నారు.మొత్తంగా చూసుకుంటే సిక్కులు అధికంగా ఉన్నప్పటికీ పట్టమ ప్రాంతాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు.
పంజాబీ సుబా కోసం సిక్కులు పోరాడుతుంటే, మిగిలిన వారు మహా పంజాబ్ కోసం పోరాడారు.పంజాబీ సుబా అమరై రహే అంటూ వీళ్ళు నినాదాలు చేస్తుంటే,మహా పంజాబ్ కి మిగిలిన వారు నినాదాలు మొదలుపెట్టారు.దాంతో ఇవి ఘర్షణలకు దారి తీస్తాయని భయపడి అమృత్సర్ DC 1955 ఏప్రిల్ 6న రెండు నినాదాల పైన నిషేధాజ్ఞలు విధించింది.
కానీ శిరోమణి అకాలీదళ్ దీనిని వాక్ స్వాతంత్ర్యం పై దాడిగా అభివర్ణిస్తూ వెంటనే నిషేధాజ్ఞలు ఎత్తకపోతే 1955 మే 10న శాంతియుత అహింసా నిరసనలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.అన్నట్టుగానే మే 10న నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూ పంజాబీ సుబా నినాదాలు చేస్తున్న అకాలీదళ్ నాయకుడు తారా సింగ్ తో పాటు మరికొంత మంది నాయకులను అరెస్టు చేశారు.అంతేకాదు పంజాబ్ అంతటా ఈ అరెస్టులు కొనసాగాయి.కొంత మంది జాతీయ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులతో సహా పంజాబీలకు మద్ధతు పలికారు మరియు నిషేధాజ్ఞలు సరికాదన్నారు.
ఈ అహింసా నిరసనలు జూలై వచ్చే నాటికి తీవ్ర రూపం దాల్చాయి.గోల్డెన్ టెంపుల్ లో జరిగే అఖల్ తఖ్త్ కు స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.పంజాబ్ ప్రభుత్వం ఈ విషయం లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనుకుంది.ఏ మాత్రం తప్పు జరిగినా లేదా అక్కడ పంజాబీ సుబా గురించి నినాదాలు మొదలైనా అది ఎటు పోతుందోనని భయపడింది.గోల్డెన్ టెంపుల్ చుట్టూ పోలీసు బందోబస్తు పెంచారు.అనుకున్నట్టుగానే పంజాబీ సుబా కు అనుకూలంగా నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని నినాదాలు చేశారు.

దాంతో జూలై 4న DIG పోలీసులను ఆలయ ప్రాంగణంలోకి నడిపించారు.ఆలయ ప్రాంగణంలోని గురు రామ్ దాస్ సెరాయ్ మరియు శిరోమణి అకాలీదళ్ కార్యాలయాలపై కూడా దాడి చేశారు, ఆలయం బయట గుమిగూడిన నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీలు ప్రయోగించబడ్డాయి మరియు బాష్పవాయువు మరియు షెల్లు ప్రయోగించబడ్డాయి, ఆలయం యొక్క అంచు మరియు సరోవర్ లేదా కొలనును దెబ్బతీశాయి.గోల్డెన్ టెంపుల్‌కి వెళ్లే మార్గంలో ప్రభుత్వం స్వచ్ఛంద సేవకులను నిలిపివేసింది మరియు ఆ ప్రదేశం చుట్టూ వీధుల్లో ఫ్లాగ్-మార్చ్ చేయమని దళాలను ఆదేశించింది.200 మందికి పైగా నిరసనకారులు మరణించారు, వేలాది మంది అరెస్టు చేశారు,మహిళలు మరియు పిల్లలతో సహా వేలాది మంది గాయపడ్డారు.

ఈ సంఘటన తర్వాత ఉద్యమం మరింత ఊపందుకుంది.మొత్తం ఈ ఉద్యమంలో 12000 మంది వాలంటీర్లను అరెస్టు చేశారు.ఆఖరికి CM భీమ్ రావ్ జూలై 12, 1955న పంజాబీ సుబా పైన నిషేధాజ్ఞలు ఎత్తివేసారు.అకాలీ ఖైదీలను కూడా విడుదల చేస్తామని ప్రకటించారు, తారా సింగ్ సెప్టెంబర్ 8న విడుదలైంది మరియు అక్టోబర్ 18 వరకు ఒక్కొక్కరిని విడుదల చేస్తూ వచ్చారు.

తర్వాత కాలంలో ఈ ఉద్యమం కొనసాగిన ఫలితంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం అయిన ఛంఢీగర్హ్ కూడా ఏర్పడింది.కొన్ని పహరీ మెజారిటీ ప్రాంతాలను మాత్రం హిమాచల్ ప్రదేశ్ లో విలీనం చేయబడ్డాయి.
ఈ ఉద్యమం గురించి లాహోర్ బులెటిన్ 1930 జనవరి 9 ఎడిషన్ లో పంజాబీలు పంజాబీ సుబా అడగడంలో తప్పేమీ లేదంటూ వార్త వచ్చింది.

0 $type={blogger}