NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్
భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ భారత్ ఆర్మీకి బలాన్ని చేకూరుస్తున్నాయి.ఇవి అత్యంత ధైర్య సాహసాలను కలిగి ఉంటాయి. కేవలం భారత్ లోనే కాక ఇతర దేశాల్లో కూడా ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు.ఇప్పుడు మనం భారత్ ఆర్మీలోని రెజిమెంట్స్ గురించి తెలుసుకుందాం.
1.బ్రిగేడ్ ఆఫ్ ద గార్డ్స్:
ఈ రెజిమెంట్ యొక్క ఆలోచన స్వాతంత్ర్యానంతరం భారత్ ఆర్మీ మొదటి కమాండర్ ఇన్ చీఫ్ మార్షల్ కరియప్ప గారిది.ఆయన ఈ రెజిమెంట్ ని ప్రారంభించినప్పుడు 'గార్డ్స్ శ్రేష్టమైన కాపలాదారులు' అని కొనియాడారు.
ఈ బ్రిగేడియర్ ఆఫ్ గార్డ్స్ రెజిమెంట్ యంత్రాలతో కూడిన ఆయుధాలను ఉపయోగిస్తారు. కొన్ని రెజిమెంట్ లలా భారత్ లోని ఒక ప్రాంతం వారిని ఒక సంస్కృతి కి చెందిన వారితో ఏర్పడింది కాకుండా మొత్తం భారతీయులందర్నీ,ఆర్మీలోని అన్ని తరగతులలో పని చేసే వారిని చేర్చుకుంటూ ఏర్పడిన మొట్టమొదటి రెజిమెంట్ ఇది.భారత స్వాతంత్ర్యం తర్వాత అత్యధిక యుద్ధ గౌరవ అవార్డులు పొంది రికార్డులు సృష్టించింది.
వీరి నినాదం:
పెహ్లే హమేషా పెహ్లే(మొదట ఎప్పుడూ మొదటే)
వీరి యుద్ధ నినాదం
గార్డ్ క హున్ బోల్ ప్యారే(మిత్రమా పలుకు, నేను కాపలాదారుల పుత్రుడను)
2.పారాచూట్ రెజిమెంట్:
ఈ పారాచూట్ రెజిమెంట్ గాలిలో నుండి పని చేసే భారత్ ఆర్మీలోని స్పెషల్ ఫోర్సెస్ రెజిమెంట్.ఇది 1945 లో బ్రిటిష్ ఆర్మీ ప్రారంభించింది.కానీ రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఆపేసారు. తర్వాత మళ్ళీ 1952 లో ప్రారంభించారు.ప్రస్తుతానికి భారత్ ఆర్మీలో భాగంగా పని చేస్తుంది.ప్రస్తుతం ఇది పది స్పెషల్ ఫోర్సెస్ గా,ఐదు వాయు సేనలు, రెండు టెర్రిటోరియల్ ఆర్మీ మరియు ఒక రాష్ట్రీయ రైఫిల్ ని దీనిలో కలిపారు.
వీరి నినాదం:
గెలవాలి.
వీరి యుద్ధ నినాదం:
ప్రాణ త్యాగమే పరమ ధర్మం.
3.మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.దీనిలో 27 బెటాలియన్స్ ని కలిపి భారత దేశంలోని వివిధ ఆయుధ బలగాలకు పంపుతారు. బ్రిగేడ్ ఆఫ్ ది గార్డ్స్ లోని 21 బెటాలియన్ లతో, యంత్ర ఆయుధాలను కలిగిన సాయుధ బలగాలతో కలిపి ఈ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో భాగంగా పని చేస్తుంది.
వీరి నినాదం:
శౌర్యం మరియు విశ్వాసం.
వీరి యుద్ధ నినాదం:
బోలో భారత్ మాతా కీ జై.
4.పంజాబ్ రెజిమెంట్:
పంజాబ్ రెజిమెంట్ అనేది ఇప్పుడు పని చేస్తున్న రెజిమెంట్ లలో రెండవ పురాతనమైనది.ఇది ఒక ప్రాంతానికి చెందిన అత్యంత అనుభవం కలిగిన ఆయుధాలు కలిగిన రెజిమెంట్.దీన్ని బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1947 లో ఏర్పాటు చేశారు.ఇప్పటి వరకు అనేక యుద్ధాల్లో మరియు దాడులలో పాల్గొంది.
స్వాతంత్ర్యం మరియు దేశ విభజనకు ముందు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో అనేక పంజాబ్ రెజిమెంట్స్ పని చేసేవి.వాటన్నిటినీ విలీనం చేసి 1వ పంజాబ్ రెజిమెంట్,2వ పంజాబ్ రెజిమెంట్, 8వ పంజాబ్ రెజిమెంట్,14వ పంజాబ్ రెజిమెంట్,15వ పంజాబ్ రెజిమెంట్ మరియు 16వ పంజాబ్ రెజిమెంట్ అనే ఆరు రెజిమెంట్ లుగా విభజించారు.
వీరి నినాదం:
ఖుష్కీ వ తారీ/స్థల్ వ జల్(భూమి మరియు సముద్రం ద్వారా)
వీరి యుద్ధ నినాదం:
జో బోలో సో నిహాల్,సత్ శ్రీ అకాల్(దేవుడిని సత్యం అని నమ్మేవాడు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు).ఇది సిఖ్ఖుల నినాదం.
5.ది మద్రాస్ రెజిమెంట్:
ఈ మద్రాస్ రెజిమెంట్ భారత్ లోనే పురాతనమైన రెజిమెంట్ మరియు దీనిని 1750 లో ప్రారంభించడం జరిగింది.బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో ఉన్నప్పుడు మరియు స్వాతంత్ర్యం తర్వాత కూడా మద్రాసు రెజిమెంట్ ఎన్నో యుద్ధాల్లో పాల్గొంది.
ఈ మద్రాస్ రెజిమెంట్ మొదట్లో 1660 లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు యురోపియన్ రెజిమెంట్ గా ప్రారంభించారు.తర్వాత 1748 లో మేజర్ స్ట్రింగర్ లారెన్స్ కమాండ్ లో బెటాలియన్ గా చేర్చుకున్నారు.ఈ మద్రాస్ బెటాలియన్ భారత్ లో ఫ్రెంచి బలగాలతో జరిగిన ప్రతి యుద్ధం లోనూ పాల్గొన్నారు.
వీరి నినాదం:
స్వధర్మే నిధానం శ్రేయహ(మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మరణించడం ఉత్తమం).
వీరి యుద్ధ నినాదం:
వీర్ మద్రాసి,ఆదికొల్లు,ఆదికొల్లు,ఆదికొల్లు.
6.ద గ్రెనేడియర్స్ రెజిమెంట్:
ఈ గ్రెనేడియర్స్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం. మొదట్లో ఇది బొంబే ఆర్మీలో భాగంగా పని చేసేది.స్వాతంత్ర్యం తర్వాత 4వ బొంబే గ్రెనేడియర్స్ గా పిలవబడుతుంది.
ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనూ మరియు స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి వివిధ యుద్ధాలలోనూ ప్రముఖ పాత్ర వహించింది.ఈ రెజిమెంట్ అనేక యుద్ధ గౌరవాలను, శౌర్య పతకాలు పొందింది.వేరు వేరు యుద్ధాలలో మూడు పరమ వీర చక్ర అవార్డులను పొంది భారత దేశపు అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
వీరి నినాదం:
సర్వదా శక్తిశాలి (ఎల్లప్పుడూ శక్తి కలిగి ఉంటాం)
వీరి యుద్ధ నినాదం:
సర్వదా శక్తిశాలి.
7.మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ:
ఈ మరాఠ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క తేలికైన పదాతిదళం.బొంబే సిపాయిల పేరుతో 1768 లో దీనిని ప్రారంభించడం వల్ల అత్యంత సీనియర్ పదాతిదళంగా అయింది. దీనిలోని సైనికులను పూర్వ మరాఠ సామ్రాజ్యం లో నుండి తీసుకోవడం జరుగుతుంది కనుక దీనికి మరాఠ పేరుని ఆపాదించారు.దాదాపుగా మహారాష్ట్ర మొత్తం నుండి దీని లోని సైనికులను తీసుకున్నప్పటికీ కొంత మందిని మాత్రం కూర్గ్ తో సహా కర్ణాటక లోని మరాఠ మాట్లాడే ప్రాంతాల నుండి కూడా తీసుకుంటున్నారు.1922లో ముంబయి ప్రావిన్స్ లో భాగంగా ఉన్న బెల్గామ్ లో రెజిమెంటల్ కేంద్రం ఏర్పాటు చేసి కొనసాగిస్తున్నారు.
వీరి నినాదం:
డ్యూటీ,హానర్,కరేజ్(కర్తవ్యం, నిజాయితీ, ధైర్యం).
యుద్ధ నినాదం:
బోలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై
8.రాజ్ పుతన రైఫిల్స్:
ఈ రాజ్ పుతన రైఫిల్స్ ఇండియన్ ఆర్మీ యొక్క మద్రాసు రెజిమెంట్ తర్వాత రెండవ రెజిమెంట్.ముందుగానే ఉన్న ఆరు రెజిమెంట్ లను కలిపి 6వ రాజ్ పుతన రైఫిల్స్ గా 6 బెటాలియన్ లను తయారు చేసినప్పుడు ఇది బ్రిటిష్ ఆర్మీలోని భాగంగా ఉండేది.
1945లో చాలా మంది అధికారులను తొలగించడం జరిగింది.1947 తర్వాత కొత్తగా ఏర్పడిన స్వాతంత్ర్య భారత్ ఆర్మీకి దీనిని బదిలీ చేసారు.స్వాతంత్ర్యం తర్వాత ఈ రెజిమెంట్ పాకిస్థాన్ తో ఏర్పడిన ఎన్నో గొడవల్లో పాలు పంచుకుంది.అలాగే కొరియా లో యునైటెడ్ నేషన్స్ ఒప్పందం ప్రకారం 1953-54 లో భారత కస్టోడియన్ ఫోర్స్ కి సహకారం అందించింది.అంతేకాక 1962 లో కాంగో లో జరిగిన యునైటెడ్ నేషన్స్ మిషన్ కి కూడా సహకారం అందించారు.
వీరి నినాదం:
వీర్ భోగ్య వసుంధర(ధైర్యవంతులు భూమిని వారసత్వం గా పొందుతారు.
యుద్ధ నినాదం:
రాజా రామచంద్ర కి జై.
9.ఝాట్ రెజిమెంట్:
ఝాట్ రెజిమెంట్ అనేది భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.అత్యధిక కాలం పని చేసిన మరియు ఎక్కువ మందికి తెలిసిన రెజిమెంట్ లలో ఇది ఒకటి.ఈ రెజిమెంట్ 1839 నుండి 1947 వరకు 19 యుద్ధ గౌరవాలను మరియు స్వాతంత్ర్యం తర్వాత 2 విక్టోరియా క్రాస్ లు,8 మహావీర్ చక్రాలు,8 కీర్తి వీర చక్రాలు,34 శౌర్య చక్రాలు,39 వీర్ చక్రాలు మరియు 170 సేన మెడళ్ళతో బాటు ఐదు యుద్ధ గౌరవాలను పొందింది.
తన 200 సంవత్సరాల సుదీర్ఘ సేవ సమయం లో ఈ రెజిమెంట్ రెండు ప్రపంచ యుద్ధాలలోనే కాక భారత్ మరియు అబ్రాడ్ లలో ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నారు.
వీరి నినాదం:
సంఝటన్ వ వీర్త(ఐక్యత మరియు శౌర్యం).
యుద్ధ నినాదం:
ఝాట్ బల్వాన్,జై భగవాన్ (జాట్ అనేది శక్తివంతమైనది, భగవంతుడికి విజయం కలుగుతుంది).
10.సిఖ్ఖ్ రెజిమెంట్:
ఈ సిఖ్ఖ్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.1979లో మొదటి బెటాలియన్ ఏర్పడినప్పుడు కామన్వెల్త్ లో స్వాతంత్ర్యానికి పూర్వం 245 మరియు స్వాతంత్ర్యం తర్వాత 82 శౌర్య పురస్కారాలతో అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా నిలిచింది.4వ బెటాలియన్ గా మారినప్పుడు యాంత్రిక ఆయుధాల రెజిమెంట్ గా అయింది.
మొదటి బెటాలియన్ 1846 ఆగస్టు 1న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా అధికారికంగా ఏర్పడింది.మొదట్లో దీని కేంద్రం ఉత్తర ప్రదేశ్ మీరట్ లో ఉండేది.కానీ ప్రస్తుతం రామ్ గర్హ్ కంటోన్మెంట్, ఝార్ఖండ్ లో ఉంది.
వీరి నినాదం:
నిశ్చయ్ కర్ అప్నీ జీత్ కరోన్(సంకల్పం తో నేను విజయం సాధిస్తాను).
వీరి యుద్ధ నినాదం:
బోలో సో నిహాల్ సాత్ శ్రీ అకాల్(భగవంతుడిని గొప్పవాడు అని చెప్పేవాడిని శాశ్వతంగా ఆశీర్వాదం పొందుతాడు).
11.గోర్ఖా రైఫిల్స్:
1947లో భారత్ కి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్-ఇండియా-నేపాల్ త్రైపాక్షిక ఒప్పందం లో భాగంగా ముందు నుండి బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో పని చేస్తున్న 6 గోర్ఖా రెజిమెంట్ లను భారత్ ఆర్మీలో కలిపారు.అప్పటి నుండి నేటి వరకు వారు మన ఆర్మీలో పని చేస్తున్నారు.ఈ ట్రూప్స్ లో ముఖ్యంగా నేపాల్ లోని గోర్ఖా జాతి వారి నుండి వస్తారు.
ఇంకా బ్రిటిష్ సైన్యం లో చేరడానికి అంగీకరించని ఏడవ మరియు పదవ గోర్ఖా రైఫిల్స్ ని కూడా స్వాతంత్ర్యం తర్వాత మన సైన్యం లో ప్రారంభించారు.
వీరి నినాదం:
యత్రహం విజయస్తత్ర(మేము విజయానికి రూపకం)
యుద్ధ నినాదం:
జై మహాకాళి,ఆయో గోర్ఖాలి!(కాళీమాత కి నమస్కారములు, ఇక్కడున్న వారము గోర్ఖాలము)
12.డోగ్రా రెజిమెంట్:
ఈ డోగ్రా రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ నేరుగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క 17వ డోగ్రా రెజిమెంట్ నుండి తీసుకొనబడింది.
ఈ డోగ్రా రెజిమెంట్ స్వాతంత్ర్యం అనంతరం దాదాపుగా భారత్ ఆర్మీ చేసిన ప్రతి ఒకైక యుద్ధం లోనూ పాల్గొన్నారు.ఇది భారత్ ఆర్మీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అలంకారమైన రెజిమెంట్.
వీరి నినాదం:
కర్తవ్యం అన్వాత్మ (మరణం కంటే కర్తవ్యం ముఖ్యమైనది).
వీరి యుద్ధ నినాదం:
జ్వాల మాత కి జై.
13.గర్వాల్ రెజిమెంట్:
ఈ గర్వాల్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఇది 1887 లో బెంగాల్ ఆర్మీలో 39వ గర్వాల్ రెజిమెంట్ గా ఆరంభించారు.తర్వాత బ్రిటిష్ ఆర్మీలో కలిపారు కానీ స్వాతంత్ర్యం అనంతరం ఇండియన్ ఆర్మీ లో భాగమైంది.
ఇది 19వ మరియు 20వ శతాబ్దం లో సరిహద్దు ఉద్యమాల్లో మరియు రెండు ప్రపంచ యుద్ధాలలోనూ అలాగే స్వాతంత్ర్యం అనంతర ఉద్యమాల్లో పాల్గొన్నారు.దీనిలో ముఖ్యంగా ఉత్తరాఖండ్ లోని 7 జిల్లాలలోని గర్వాలీ ప్రజలతో ఏర్పడింది.
వీరి నినాదం:
యుద్ధాయ కృత్ నిశ్చయ(ధృడ సంకల్పంతో యుద్ధం చేయాలి).
యుద్ధ నినాదం:
బద్రీ విశాల్ లాల్ కి జై(బద్రీనాథ్ పుత్రులకు విజయం కలుగుతుంది).
14.కుమవోన్ రెజిమెంట్:
ఈ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పురాతన రెజిమెంట్ లలో ఒకటి.ఈ రెజిమెంట్ 18వ శతాబ్దం లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో మొదలై వారి ఆధ్వర్యంలో మరియు భారత్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగిన దాదాపు అన్ని పెద్ద యుద్ధాలలో పాల్గొంది.అలాగే రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్నారు.దాని వల్ల అత్యంత అలంకారమైన రెజిమెంట్ గా పరిగణించబడుతుంది.
దీని కేంద్రం రాణిఖేడ్ లో ఉంది.దీనిలో కుమవోన్ లోని రాజ్ పుత్స్ ని, బ్రాహ్మణులను మరియు అహిర్స్ ని తీసుకొంటారు.
వీరి నినాదం:
పరాక్రమో విజయతే(శౌర్యం విజయం సాధిస్తుంది).
యుద్ధ నినాదం:
కాళికా మాత కి జై.
15.అస్సాం రెజిమెంట్:
ఈ అస్సాం రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతి దళం.ఈ రెజిమెంట్ 15 నిత్యం పని చేసే బెటాలియన్ లను,3 రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్ లను,5 ప్రాదేశిక బెటాలియన్ లను మరియు 2 అటవీ ప్రాంత బెటాలియన్ లను కలిగి ఉంటుంది.దీనిలో 8 ఈశాన్య రాష్ట్రాల నుండి యువకులను తీసుకుంటారు.
వీరి నినాదం:
అసం విక్రమ్(ప్రత్యేక శౌర్యం)
యుద్ధ నినాదం:
రైనో ఛార్జ్(ఖడ్గ మృగంలా దాడి చేయాలి).
16.బీహార్ రెజిమెంట్:
ఈ బీహార్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క రెజిమెంట్.ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లోనే ప్రారంభమైంది.ఇది 1941 లోనే 11వ ప్రాదేశిక బెటాలియన్,19వ హైదరాబాద్ రెజిమెంట్ కలుపుకుని కొత్త బెటాలియన్ లగా ఏర్పడింది.ఈ బీహార్ రెజిమెంటల్ కేంద్రం బీహార్ లోని పాట్నా లో ఉంది.
భారత నావికా దళం యొక్క అతి పెద్ద మరియు విమాన వాహక ఓడ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య ఈ రెజిమెంట్ కి అనుబంధం గా పని చేస్తుంది.భారత్ ఆర్మీ యొక్క అత్యంత అలంకారమైన మరియు కఠినతరమైన పోరాటం చేసే యూనిట్.అలాగే మొత్తం రెజిమెంట్ లలోఅత్యధిక రాష్ట్రీయ రైఫిల్స్ ని కలిగి ఉన్న రెజిమెంట్ ఇది.
వీరి నినాదం:
కరమ్ హై ధరమ్(కర్తవ్యమే నిజమైన భక్తి).
యుద్ధ నినాదం:
జై భజరంగ్ భళి మరియు బిర్సా ముండా కి జై.
17.మహర్ రెజిమెంట్:
ఈ మహర్ రెజిమెంట్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.నిజానికి ఈ రెజిమెంట్ లో మహారాష్ట్ర లోని మహర్షి వర్గానికి చెందిన వారిని ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్,ఉత్తర ప్రదేశ్ మరియు బీహార్ లాంటి రాష్ట్రాల నుండి వేరే వర్గాల వారిని కూడా తీసుకుంటున్నారు.
ఈ మహారాస్ అనే వారే నిజమైన మహారాష్ట్ర నివాసులుగా చెప్పుకుంటారు.ఈ వర్గం వారిని కతివాలె(కర్రని ధరించిన మనుషులు),భూమి పుత్ర,మిరాశి(భూస్వాములు) అని కూడా పిలుస్తారు. వీరి సంస్కృతి ప్రకారం బయట వ్యక్తుల నుండి, ఆక్రమణదారి జాతుల నుండి, నేరస్థుల నుండి, మరియు దొంగల నుండి వారి ప్రాంతాన్ని కాపాడుకోడానికి ప్రతి వ్యక్తి వారి పాత్రని పోషించాలి.అలాగే వారి ప్రాంతంలోని చట్టాలను కూడా అమలయ్యేలా చూడాలి.ఈ మహారాస్ అత్యంత పురాతన మరియు గర్వపడే ధైర్యవంతమైన సంస్కృతి ని కలిగి ఉంది.
వీరి నినాదం:
యష్ సిద్ది(సాధన&విజయం)
యుద్ధ నినాదం:
బోలో హిందుస్థాన్ కి జై
18.జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్:
ఈ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత్ ఆర్మీ యొక్క పదాతిదళం.ఇది జమ్మూ కాశ్మీర్ రాజ్యం ఉన్న సమయంలో జమ్మూ&కాశ్మీర్ స్టేట్ ఫోర్సెస్ లో ప్రారంభమైంది. 1947 అక్టోబర్ లో జమ్మూ&కాశ్మీర్ భారతదేశంలో కలిసినప్పుడు దీనిని భారత్ ఆర్మీ లోకి చేర్చారు.
1956లో జమ్మూ&కాశ్మీర్ అసెంబ్లీ పూర్తిగా భారత్ లో కలిసేంత వరకు ఈ రెజిమెంట్ దాని పూర్వ రూపంలోనే పని చేసేది. ఆ తర్వాత మాత్రమే స్టేట్ ఫోర్సెస్ జమ్మూ & కాశ్మీర్ రెజిమెంట్ గా రూపాంతరం చెందినది. 1963 లో జమ్మూ&కాశ్మీర్ రైఫిల్స్ గా మారింది. ఈ మార్పు తర్వాత లడక్ స్కౌట్స్ కూడా ఈ రెజిమెంట్ లోకి చేర్చారు. కానీ 2002 లో మళ్ళీ ఈ లడక్ స్కౌట్స్ ప్రత్యేక రెజిమెంట్ గా మారింది.
వీరి నినాదం:
ప్రశత రన్వీర్త(యుద్ధంలో శౌర్యమే కీర్తి గడుస్తుంది) .
యుద్ధ నినాదం:
దుర్గా మాత కి జై.
#armylover #bharat #paracommando #motivation #indianarmyfans #fauji #bjp #photography #ima #bharatmatakijai #indianmilitaryacademy #armystrong #bhagatsingh #soldier #cisf #indianarmyday #indianarmyofficers #vandematram #military #nsg #maharashtra #modi #navy #hindustan #trending #iaf #foji #indiansoldiers #like #indianarmyforever#indianarmy #india #army #indianairforce #indiannavy #indian #jaihind #bsf #instagram #love #crpf #indianarmylovers #armylife #commando #indianarmedforces #parasf #follow #ssb #ncc #itbp #delhi #specialforces #nda #airforce #mumbai #narendramodi #upsc #instagood #bhfyp #indianarmyvideo
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
0 $type={blogger}