NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
ఇంటికి తండ్రి-దేశానికి సైనికుడు
ఇంటికి తండ్రి-దేశానికి సైనికుడు
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశం లో వస్తు ఉత్పత్తి, వ్యాపారం, వ్యవసాయం ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి.ఆ దేశంలోని యువత,ప్రజలు, స్త్రీలు అందరూ కలిసి కష్టపడి దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటారు. అలాగే ప్రతి రోజూ వాళ్ళు దేశంలోని మౌలిక సదుపాయాలు ఉపయోగించుకుంటూ, సినిమాలు,పార్కులు, రెస్టారెంట్ లు అంటూ ఎంతో ఆనందంగా గడుపుతారు.శుభకార్యాలు,పార్టీలు చేసుకుంటూ తమ జీవితాన్ని రంగులమయం చేసుకుంటారు.
కానీ ఒక దేశపు అభివృద్ధిని చూడలేని మూర్ఖులు,ఒక దేశం పైన దాడి చేసి దోచుకోవాలనుకునే దుర్మార్గులు, ఒక దేశం పైన లేదా ప్రపంచం పైన ఆధిపత్యం చెలాయించాలనుకునే కౄరులు,ఒక దేశపు సంస్కృతిని, అస్థిత్వాన్ని నాశనం చేయాలనుకునే పరమ మూర్ఖులు ఆ దేశాల పైన దాడులు చేస్తూ ఉంటారు.ఆ దేశాన్ని దోచుకుంటూ ఉంటారు. ఆ దేశపు స్త్రీల పైన దాడులు చేస్తారు,అవమానిస్తారు,హింసిస్తారు,హత్యలు చేస్తారు.భూమిని లాక్కుంటారు.ఆస్తుల్ని నాశనం చేస్తారు.ఆ దేశపు ప్రజలకు స్వాతంత్ర్యం లేకుండా చేసి,తమ బానిసలుగా చేసుకుని వారితో ఆడుకుంటారు.
అటువంటి సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతారు.ఆ దోపిడీ దారుల చేతిలో మానప్రాణాలను, ఆస్తి పాస్తుల్ని ,సంతోషాలను, ఆనందాన్ని పోగొట్టుకుని, బానిసలుగా బ్రతుకుతారు.లేదా ఉన్న ఊరిని వదిలి పారిపోయి వేరే దేశాలలో కాందిశీకుల్లా,రెండవ స్థాయి పౌరుల్లా బ్రతుకుతారు.
మరికొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా ప్రాణాలను,ఆస్తుల్ని కోల్పోయి, బ్రతకడానికి దారి లేక,ఏం చేయాలో తెలీక, ఎవరైనా తమని కాపాడతారేమో అని బిక్కు బిక్కు మంటూ భయంతో ఎదురు చూస్తూ ఉంటారు.
ఇలాంటి సందర్భాల్లో ఎటువంటి భయం లేకుండా రొమ్ము విరుచుకుని, ధైర్యంగా ఎటువంటి భయం లేకుండా, తన ప్రాణాన్ని,కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా,ఎండ,వాన,చలి,కొండ,గుట్ట ఎటువంటి ప్రదేశం లో అయినా వెనుకాడకుండా ముందుకు వచ్చి ప్రజలకు మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చి, శత్రువులకు ఎదురుగా నిలబడి ప్రజలు ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డు పెట్టి కాపాడతాడు.ఆ దేశ ధీర సైనికుడు.
ఒక దేశం ఆర్ధికంగా బలపడాలంటే ఎన్నో దారులు ఉండవచ్చు.కానీ అదే దేశం స్వేచ్ఛగా,సంతోషంగా, ఆనందంగా, సురక్షితంగా ఉండాలంటే మాత్రం ఒకే ఒక్క దారి ఉంది.అదే సైనిక వ్యవస్థ.దేశ ప్రజలను కాపాడడానికి ఒకే ఒక్కడు ముందుంటాడు.వాడే సైనికుడు.శత్రువు గుండెల్ని చీల్చి చెండాడి తన ప్రజల్ని కాపాడుకుంటాడు సైనికుడు.
దేశ పౌరులు తమ పని చేసుకోవాలన్నా? ఆనందంగా గడపాలన్నా? కుటుంబాలు ఆనందంగా పార్టీలు చేసుకోవాలన్నా?నేను గొప్ప నేను గొప్ప అంటూ గొప్పలు చెప్పుకోవాలన్నా? పిల్లలు ప్రశాంతంగా ఉండాలన్నా? చివరికి ప్రశాంతంగా నిద్రపోవాలన్నా కూడా అది ఒక సైనికుడు మన దేశాన్ని కాపాడుతున్నాడు అన్న ధైర్యంతో నే సాధ్యపడుతుంది.
అలా దేశం కోసం కుటుంబాన్ని,ఎన్నో ఆనందాల్ని వదులుకుని దేశ సరిహద్దుల్లో నిలబడి రాత్రి,పగలు వాన,చలి,ఎండ ఇలా దేన్నీ లెక్క చేయకుండా కౄర జంతువుల మధ్య దేశానికి కాపలా కాస్తూ శత్రువులు నుండి ప్రజలను కాపాడుతున్న ప్రతి ఒక్క సైనికుడికి నా శతకోటి వందనాలు.
అలాగే నా భారత దేశ సైనికులు నా భరత మాత రక్షణకై రాత్రి పగలు కాపలా కాస్తూ ప్రజలకు మేము కాపలాగా ఉన్నాము.మీరు నిశ్చింతగా బ్రతకండి అని భరోసా ఇస్తున్న నా దేశ సైనికుడా నీ ఋణం ఎలా తీర్చుకోవాలి? నీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం తప్పితే ఇంక ఏం ఇవ్వగలం?
ఎన్నో యుద్ధాల నుండి దేశాన్ని కాపాడావు.ఎంతో మంది ముష్కరుల దాడుల్ని తిప్పికొట్టావు.ఎన్నో ప్రాణాలను కాపాడడానికి నీ ప్రాణాన్ని విడిచావు.ఎంతో మంది ఆనందం కోసం నీ ఆనందాన్ని విడిచిపెట్టావు.
ఎన్నో కుటుంబాల రక్షణ కోసం నీ కుటుంబాన్ని వదిలేసాను.నీ కంటే గొప్ప హీరో ఎవరుంటారు ఈ దేశంలో.
మంచు కొండల్లో, రాజస్థాన్ ఎడారుల్లో,గల్వాన్ లోయలో, పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో, అడవుల్లో, రెండడుగుల
లోతు బురద నేలల్లో, కొండల్లో,కోనల్లో, ప్రకృతి వైపరీత్యాలలో ప్రతి రోజూ దేశాన్ని కాపాడుతున్న నా భారత సైనికా......
నీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు.నీకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటూ......
ధీర సైనికా..... నీకు వందనం..... బ్లాగ్ టీమ్...
.🙏🙏🙏🙏🙏
నా ఈ రచనని చదివిన ప్రతి ఒక్క మిత్రునికి కృతజ్ఞతలు.మన భారత సైనిక వ్యవస్థ గురించి, వారు చేసిన ఆపరేషన్స్ గురించి సాధ్యమైనంత మందికి తెలియజేయడం కోసమే ఈ బ్లాగ్ ని ఆరంభించడం జరిగింది.ఆదరిస్తారని భావిస్తున్నాను.మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి.
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
#specialforces #army #military #indianarmy #tactical #navy #airforce #indiannavy #indianairforce #soldier #commando #indian #police #specialoperations #bsf #marines #crpf #parasf #sof #armedforces #usarmy #navyseals #airsoft #militarylife #ssb #armylife #itbp #soldiers #operator #tacticalgear
#jaihind #guns #ncc #follow #india #war #paracommando #specops #greenberet #armystrong #indianarmedforces #sniper #ranger #indianarmylovers #usmc #nda #usa #milsim #love #nsg #a #marine #veterans #gun #fauji #multicam #veteran #m #infantry #k
0 $type={blogger}